• search
  • Live TV
అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఎన్నిక‌ల వేళ‌..అనంత టిడిపిలో భ‌గ్గుమ‌న్న విభేదాలు : ప‌ంతం నెగ్గించుకున్న జేసీ ..!

|

ఎన్నిక‌ల వేళ‌..టిడిపి కి కొత్త టెన్ష‌న్ ప‌ట్టుకుంది. కొంత కాలంగా నివురుగ‌ప్పిన నిప్పులా ఉన్న టిడిపి నేత‌ల మ‌ధ్య విభే దాలు రోడ్డు పైకి వ‌చ్చాయి. ఎంపి దివాక‌ర్ రెడ్డి వ‌ర్సెస్ ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర్ చౌద‌రి వ‌ర్సెస్ మేయ‌ర్ స్వ‌రూప అన్న‌ట్లుగా అధికారుల స‌మ‌క్షంలో..న‌డి రోడ్డు పై టిడిపి నేత‌ల నిర్వాకం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

రైల్వే వంత‌నె పై పంతం..

అనంతపురంలో రైల్వే పై వంతన ప్రారంభోత్సవంలో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తన పంతం నెగ్గించుకున్నారు. ప్రారం భోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే, మేయర్‌ కలెక్టర్ కోసం వేచి చూస్తుండగానే, ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కారు దిగి నేరుగా వె ళ్లి వంతెన ప్రారంభించారు. దీంతో ఎంపీ, ఎమ్మెల్యే, మేయర్‌ మధ్య కొంతకాలంగా ఉన్న విభేదాలు మరోసారి బయటప డ్డాయి. చాలా కాలంగా అనంతపురం నగరంలోని పాతూరులో రహదారుల విస్తరణ విషయంలో ఎంపీ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్య రేగిన వివాదం, చినికి, చినికి గాలివానలా మారి వర్గవిభేదాల వరకు దారితీసింది.

ఇది అంతటితో ఆగకుండా ఇరు వర్గాలు తమ బలనిరూపణకు దిగేవరకు దారితీసింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు జోక్యం చేసుకొని ఇరువురిని కూర్చోబెట్టి గట్టిగా హెచ్చరించి పంపించారు. అమరావతి నుంచి తిరిగొచ్చిన ఇద్దరు నేత లు పాతూరు రోడ్ల విస్తరణ వివాదం కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగానే ఎంపీ దివాకర్ రెడ్డి నగరంలోని రామనగర్ కాలనీకి వెళ్లే దారిలో రైలు పై వంతెన మంజూరు చేయించారు.

Anantapur TDP Leaders Political fight on new fly over : High command serious..!

ప్రారంభోత్స‌వ ర‌గ‌డ‌..
దీని నిర్మాణానికి గుత్తేదారు ఎంపిక విషయంలో ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తీవ్రంగా వ్యతిరేకించారు. గుత్తేదారు వేగంగా నిర్మాణం చేయకపోవడంతో అధికారులను చాలాసార్లు హెచ్చరించారు. వీరి వివాదం కొనసాగుతుండగానే ఆ పై వంతెనకు పేరు పెట్టే విషయంలో ఎమ్మెల్యేకు, నగర మేయర్ స్వరూపకు వివాదం నెలకొంది. వంతెనకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని ఎమ్మెల్యే ప్రభాకర్ నిర్ణయించగా, దీన్ని విభేధించిన మేయర్ స్వరూప సీఎం చంద్రబాబు పేరు పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం రామనగర్ పై వంతెన ప్రారంభానికి ముహూర్తం ఖరారు చేశారు.

ఆ మేరకు జిల్లా కలెక్టర్ నుంచి ముగ్గురి నేతలకు ఆహ్వానం వెళ్లడంతో ప్రభాకర్ చౌదరి అరగంట ముందుగానే ఫ్లైఓవర్‌ వద్ద గల సభాస్థలికి చేరుకున్నారు. మేయర్ స్వరూప కూడా పావుగంట ముందుగానే వచ్చారు. ఇద్దరూ ఎడమొహం, పెడమొహంగా కూర్చుండగా.. ఎంపీ జేసీ కారులో అక్కడికి చేరుకున్నారు. వంతెన ప్రారంభానికి కలెక్టర్ వస్తున్నారని అధికారులు ఎంపీకి చెప్పారు. ఎవరి కోసమో ఎదురు చూడటం ఏంటి.. వచ్చిన పుడు వస్తారులే'' అంటూ ఎంపీ నేరుగా వెళ్లి ఫ్లైఓవర్ ప్రారంభించారు. దివాకర్ రెడ్డి తీరుపై వెంటనే మీడియా సమావేశం పె ట్టి తీవ్రంగా ఎండగట్టిన ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, తనకు జరిగిన అగౌరవాన్ని పార్టీ అధిష్టానం చూసుకుంటుం దన్నా రు. తప్పంతా అధికారులదేనని మేయర్ స్వరూప ఆగ్రహం వ్యక్తం చేయ‌టం కొస మెరుపు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

అనంతపురం యుద్ధ క్షేత్రం
సంవత్సరం
అభ్యర్థి పేరు పార్టీ లెవెల్ ఓటు ఓటు రేట్ ఓట్ల తేడ
2019
తలారి రంగయ్య వైయస్సార్‌సీపీ విజేతలు 6,95,208 52% 1,41,428
జేసీ పవన్ కుమార్ రెడ్డి టీడీపీ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 5,53,780 41% 1,41,428
2014
జే.సి. దివాకర్ రెడ్డి టీడీపీ విజేతలు 6,06,509 51% 61,269
అనంత వెంకటరామి రెడ్డి వైయస్సార్‌సీపీ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 5,45,240 46% 0
2009
అనంత వెంకట రమిరెడ్డి కాంగ్రెస్ విజేతలు 4,57,876 46% 77,921
కలవ శ్రీనివాసుల టీడీపీ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 3,79,955 38% 0
2004
అనంత వెంకట రమిరెడ్డి కాంగ్రెస్ విజేతలు 4,58,925 52% 73,404
కలవ శ్రీనివాసుల టీడీపీ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 3,85,521 44% 0
1999
కలవ శ్రీనివాసుల టీడీపీ విజేతలు 3,78,488 50% 21,102
అనంత వెంకట రమిరెడ్డి కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 3,57,386 47% 0
1998
అనంత వెంకటరామి రెడ్డి కాంగ్రెస్ విజేతలు 3,20,474 48% 82,398
కె రామకృష్ణ సీపీఐ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 2,38,076 35% 0
1996
అనంత వెంకటరామి రెడ్డి కాంగ్రెస్ విజేతలు 2,84,845 45% 78,859
ఆర్ రంగప్ప సీపీఐ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 2,05,986 32% 0
1991
అనంత వెంకట రెడ్డి కాంగ్రెస్ విజేతలు 3,62,676 59% 1,62,284
బి టి ఎల్ ఎన్ చౌదరి టీడీపీ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 2,00,392 33% 0
1989
అనంత వెంకట రెడ్డి కాంగ్రెస్ విజేతలు 3,49,685 54% 59,482
జి. రామన్న చౌదరి టీడీపీ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 2,90,203 45% 0
1984
దేవినేని నారాయణ స్వామి టీడీపీ విజేతలు 3,02,307 59% 1,08,649
దరురు పుల్లాయ కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 1,93,658 38% 0
1980
దూరూర్ పుల్లయ్య ఐ ఎన్సి( ఐ ) విజేతలు 1,71,838 49% 73,277
డి. నారాయణస్వామి జేఎన్ పి రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 98,561 28% 0
1977
దూరూర్ పుల్లయ్య కాంగ్రెస్ విజేతలు 2,15,279 55% 42,208
డి. నారాయణస్వామి బిఎల్డి రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 1,73,071 45% 0
1971
ఆంటోనీ రెడ్డి పొన్నపాటి కాంగ్రెస్ విజేతలు 2,00,701 63% 89,057
నీలం సంజీవ రెడ్డి ఎన్సిఓ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 1,11,644 35% 0
1967
పి. ఎ. రెడ్డి కాంగ్రెస్ విజేతలు 1,35,685 41% 62,614
జి సదాశివన్ సీపీఐ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 73,071 22% 0
1957
టి నాగిరెడ్డి సీపీఐ విజేతలు 98,976 51% 10,801
పైడి లక్ష్మయ్య కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 88,175 45% 0

English summary
Political fight between Anantapur TDP Leaders is in peak stage. In a fly over opening issue MP and Mla and mayor belongs to TDP differed each otehr. Now this issue is in court of party chief.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more