టీడీపీకి బిగ్ షాక్ - వైసీపీలోకి అనంత టీడీపీ ముఖ్య నేతలు..!!
ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి పార్టీల అభ్యర్దుల ప్రకటన దాదాపు పూర్తయింది. జనసేన ఒక ఎంపీ, మూడు అసెంబ్లీ స్థానాలకు తమ అభ్యర్దులను ఖరారు చేయాల్సి ఉంది. టీడీపీ మొత్తం 144 స్థానాలకు పోటీ చేస్తుండగా, బీజేపీ 10, జనసేన 21 స్థానాల్లో తమ అభ్యర్దులను దించుతోంది. టీడీపీ తుది జాబితా తరువాత సీట్లు రాని నేతలు పార్టీ మారుతున్నారు. ఉమ్మడి అనంత జిల్లా టీడీపీ ముఖ్య నేతలు వైసీపీలో చేరారు.
హోరా హోరీ పోరు
ఏపీలో ఎన్నికల్లో పోటీ చేసే ప్రధాన పార్టీల అభ్యర్దుల పైన స్పష్టత వచ్చింది. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ టీకెట్లను పార్టీల అధినేతలు ఖరారు చేసారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 2019 లో టీడీపీ కేవలం రెండు స్థానాలకే పరిమితం అయింది. ఈ సారి తిరిగి తమ పట్టు నిరూపిచుకోవాలని టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ధర్మవరం సీటు బీజేపీకి కేటాయించారు. మిగిలిన 13 స్థానాల్లో టీడీపీ అభ్యర్దులే బరిలో నిలిచారు. అయితే, కళ్యాణ దుర్గం పార్టీ ఇంఛార్జ్ గా ఉన్న ఉమామహేశ్వరనాయుడకు సీటు దక్కలేదు.

ఎవరెక్కడ పోటీ
అక్కడ టీడీపీ నుంచి ఈ సారి సురేంద్రబాబు పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి మాజీ ఎంపీ తలారి రంగయ్య పోటీలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఉమామహేశ్వర నాయుడు టీడీపీ నుంచి అభ్యర్దిగా పోటీ చేసారు. అక్కడ మంత్రి ఉషశ్రీ చరణ్ విజయం సాధించారు. ఇప్పుడు సీటు రాకపోవటంతో వైసీపీ ముఖ్య నేతలు ఉమామహేశ్వర నాయుడుతో చర్చలు చేసారు. వైసీపీలోకి రావాలని ఆహ్వానించారు. అందుకు ఆయన అంగీకరించటంతో పలువురు సీనియర్ నేతలతో కలిసి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. న్ వారికి వైయస్ఆర్ సీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నియోజవర్గంలో పలువురు టీడీపీ నేతలు వైసీపీలో చేరిన వారిలో ఉన్నారు.

వైసీపీలో చేరికలు
అదే విధంగా అనంతపురం అర్బన్ సీటు దక్కకపోవటం పైన టీడీపీ సీనియర్ నేత ప్రభాకర్ చౌదరి వర్గం ఆగ్రహంతో ఉంది. స్వతంత్ర అభ్యర్దిగా బరిలోకి దిగాలని ప్రభాకర్ చౌదరి పైన ఆయన మద్దతు దారులు ఒత్తడి చేస్తున్నారు. ఇటు సీఎం జగన్ ఎన్నికల ప్రచారం అనంతపురం జిల్లాలోకి ప్రవేశించింది. ఈ సారి జిల్లాలో మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలనేది వైసీపీ వ్యూహంగా ఉంది. అనంతపురం, హిందూపురం రెండు పార్లమెంట్ స్థానాలను టీడీపీ, వైసీపీ పార్టీలు బీసీలకే కేటాయించాయి. దీంతో..సీమలో కీలక జిల్లాగా ఉన్న అనంతపురం రాజకీయ సమీకరణాలు ఎన్నికల వేళ మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications