అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'కాల్వ'కు అనంత ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల షాక్: పదవి చేపట్టిన వేళ వారంత దూరంగా..

'కాల్వ'కు అనంత ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల షాక్: పదవి చేపట్టిన వేళ వారంత దూరంగా..

|
Google Oneindia TeluguNews

అనంతపురం: అనంత పాలిటిక్స్ అంటేనే గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరు. పరిటాల వర్గం, పయ్యావుల వర్గం, జేసీ వర్గం.. ఎవరి గ్రూపు రాజకీయాలు వారివే. అంతా ఒకే గూటిలో ఉన్నా.. అంతర్గతంగా వీరి మధ్య ఎప్పుడూ విభేదాలు ఉంటూనే ఉంటాయి. తాజాగా ఆ విభేదాలు మరోసారి బయటపడ్డాయి.

అనంతపురం జిల్లా రాయదర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు నేడు మంత్రిగా బాధ్యతలు చేపట్టగా.. వీరిలో పరిటాల సునీత మినహా మిగతా వారంతా ఆ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యేలు జేసీ ప్రభాకర్ రెడ్డి, ప్రభాకర్ చౌదరి, బీకే పార్థసారథి, యామినీ బాల, వరదాపురం సూరిలు హాజరు కాలేదు.

 anantapuram tdp mlas not attends to kalva srinivasulu

మంత్రి పదవి కోసం శతవిధాలా ప్రయత్నించిన పయ్యావుల, పార్థసారథిలు అధినేత నిర్ణయంతో అసంతృప్తికి లోనై, ఆ కారణంగానే కార్యక్రమానికి దూరంగా ఉండవచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమానికి రాకపోవడంతో కాల్వ శ్రీనివాసులు ఒకింత షాక్ కు గురైనట్లు చెబుతున్నారు.

కాగా, ఇటీవల మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కించుకున్న కాల్వ శ్రీనివాసులు ఏపీ సమాచార, పౌర సంబంధాలు, గ్రామీణ గృహనిర్మాణ శాఖల మంత్రిగా నేడు బాధ్యతలు స్వీకరించారు.

English summary
Anantapuram Rayadurgam MLA Kalva Srinivasulu taken ministry duties on Thursady. Except Minister Paritala Sunitha remaining misters from anantapuram was not attended to this program
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X