వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గణపతి ఆలయంలో ప్రమాణాలకు సిద్ధమైన అనపర్తి తాజా, మాజీ ఎమ్మెల్యేలు .. హై టెన్షన్ , 144సెక్షన్ విధింపు

|
Google Oneindia TeluguNews

తూర్పు గోదావరి జిల్లా అనపర్తి, బిక్కవోలులో రాజకీయ వాతావరణం ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది. అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మధ్య నెలకొన్న రాజకీయ విభేదాలు చిలికి చిలికి గాలివానగా మారడంతో రెండు మండలాల్లోనూ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తాజా మాజీల మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు , గణపతి ఆలయంలో ప్రమాణాలతో అనపర్తి రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి.

అనపర్తి నియోజకవర్గంలో తాజా, మాజీ ఎమ్మెల్యేల మధ్య అవినీతి ఆరోపణలు

అనపర్తి నియోజకవర్గంలో తాజా, మాజీ ఎమ్మెల్యేల మధ్య అవినీతి ఆరోపణలు

మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, వైసిపి తాజా ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుని అవినీతి చిట్టాను బయటపెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజా ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సేకరించిన 200 ఎకరాల్లో అక్రమ మైనింగ్ చేసి 400 కోట్లు దోచుకునేందుకు ప్రయత్నం చేశారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆరోపణలు గుప్పించారు. దీనికి సమాధానంగా వైసిపి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హయాంలో కలెక్షన్ కింగ్ లు ఏ విధంగా దోపిడీ చేశారో తనకు తెలుసన్నారు . అవినీతి చరిత్ర నల్లమిల్లి రామకృష్ణా రెడ్డిదే అన్నారు.

 లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రమాణం చేస్తానన్న ఎమ్మెల్యే .. తానూ రెడీ అన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే

లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రమాణం చేస్తానన్న ఎమ్మెల్యే .. తానూ రెడీ అన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే

అన్ని ఆధారాలతో బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రమాణం చేస్తానని, నల్లమిల్లి కి సవాల్ చేశారు. దీంతో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సైతం తాను కూడా తన భార్యతో కలిసి సత్య ప్రమాణానికి రెడీ అన్నారు.

ఇద్దరు నేతలు బిక్కవోలు గణపతి ఆలయంలో భగవంతుడి మీద ప్రమాణాలు చేయడానికి సిద్ధమయ్యారు.

టిడిపి వైసిపి నేతలు ఇద్దరూ తగ్గకపోవడంతో అనపర్తి, బిక్కవోలు లో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. ఇక ఇద్దరు నేతలు బిక్కవోలు గణపతి ఆలయంలో ప్రమాణాలకు సిద్ధమైన నేపథ్యంలో అనపర్తి నియోజకవర్గం లో పోలీసులు 144 సెక్షన్ విధించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

 ప్రమాణానికి ముందు బహిరంగ చర్చకు రావాలని టీడీపీ నేత సవాల్

ప్రమాణానికి ముందు బహిరంగ చర్చకు రావాలని టీడీపీ నేత సవాల్

ఈ నేపథ్యంలో అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా పోలీసులు రామకృష్ణారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. అయితే సత్య ప్రమాణానికి ముందు బహిరంగ చర్చకు రావాలని రామకృష్ణారెడ్డి సవాల్ చేశారు. ప్రమాణానికి ముందు ఎమ్మెల్యే తన మీద చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని . లేదంటే రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి .

ఆలయంలో ప్రమాణాలకు మధ్యాహ్నం 2. 30 నిమిషాలకు ముహూర్తం .. అందరిలో ఉత్కంఠ

ఆలయంలో ప్రమాణాలకు మధ్యాహ్నం 2. 30 నిమిషాలకు ముహూర్తం .. అందరిలో ఉత్కంఠ


ఈరోజు మధ్యాహ్నం 2. 30 నిమిషాలకు ముహూర్తం పెట్టుకున్న నేపథ్యంలో వైసిపి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి, నల్లమిల్లి గణపతి ఆలయానికి వస్తారా లేదా అన్నది ఆసక్తికర అంశం గా మారింది.
ఒకవేళ వస్తే ఉద్రిక్త వాతావరణం నెలకొంటుందని, వారిని రాకుండా అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. లేదంటే వారికి ఆంక్షలతో కూడిన అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు గా తెలుస్తుంది. ఏది ఏమైనా ఈ ఇద్దరు నేతల సవాళ్ళు ,గణపతి గుడి లో సత్య ప్రమాణాల నేపథ్యంలో అనపర్తి నియోజకవర్గంలో ఏం జరగనుంది అన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

English summary
The political climate in Anaparti and Bikkavolu in East Godavari district has led to tensions. Tensions are high in the constituency as political tensions between Anaparthi MLA Suryanarayana Reddy and former TDP MLA Ramakrishnareddy have escalated. Challenges and counter-challenges among the latest ex, Anaparthi politics has become a hot topic with promises at the Ganpati temple.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X