వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రానికి గుడ్‌బై చెప్పినా ఏం కాదు, బాబు సహనాన్ని ఎంతో కాలం పరీక్షించలేరు: జెసి సంచలనం

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

J.C.Diwakar Reddy Says If YSRCP MP Resign, I will Resign

అమరావతి: కేంద్ర ప్రభుత్వం నుండి బయటకు రావాలని ప్రజలు కోరుకొంటున్నారని అనంతపురం ఎంపీ జెసి దివాకర్ రెడ్డి చెప్పారు.తాము ప్రభుత్వం నుండి బయటకు వచ్చినా కేంద్ర ప్రభుత్వం పడిపోదన్నారు.

మార్చి 5వ తేది నుండి పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.ఈ సమావేశాలను దృష్టిలో ఉంచుకొని ఎంపీలతో చంద్రబాబునాయుడు శుక్రవారం నాడు అమరావతిలో సమావేశమయ్యారు.

చంద్రబాబుపై సస్పెన్షన్, 1980లోనే నల్లారి అమర్‌నాథ్‌రెడ్డికి చెక్ చంద్రబాబుపై సస్పెన్షన్, 1980లోనే నల్లారి అమర్‌నాథ్‌రెడ్డికి చెక్

ఈ సమావేశానికి హజరయ్యేందుకు ఎంపీ జెసి దివాకర్ రెడ్డి అమరావతికి వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడిని తెచ్చేందుకు తాము ప్రయత్నిస్తామని జెసి దివాకర్ రెడ్డి చెప్పారు.

1978లో బాబు విజయానికి కారణమిదే, ఆ వ్యూహమే కలిసొచ్చింది1978లో బాబు విజయానికి కారణమిదే, ఆ వ్యూహమే కలిసొచ్చింది

బాబుకు సహనం ఎంతో కాలం ఉండదు

బాబుకు సహనం ఎంతో కాలం ఉండదు

ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు సహనం ఎంతో కాలం ఉండదని అనంతపురం ఎంపీ జెసి దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వ సహనాన్ని పరీక్షిస్తోందని దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.రాష్ట్రానికి విభజన చట్టం ఇచ్చిన హమీలను అమలు చేయాలని జెసి దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.ఏపీ పునర్విభజన చట్టాన్ని అమలు చేయాలని ఆయన కోరారు.

 వెంకయ్య తలుచుకొంటే ఏమైనా జరుగుతోంది

వెంకయ్య తలుచుకొంటే ఏమైనా జరుగుతోంది

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తలుచుకొంటే ఏమైనా జరుగుతోందని అనంతపురం ఎంపీ జెసి దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఏపీ రాష్ట్రానికి న్యాయం జరిగేలా వెంకయ్యనాయుడు చొరవ తీసుకొంటే రాష్ట్రానికి న్యాయం జరుగుతోందని జెసి దివాకర్ రెడ్డి చెప్పారు. ఏపీ రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని జెసి తేల్చి చెప్పారు.

అమిత్‌షా చర్చలతో ఒరిగేదేమీ లేదు

అమిత్‌షా చర్చలతో ఒరిగేదేమీ లేదు

బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఏపీ రాష్ట్రానికి దక్కాల్సిన వాటాల విషయమై టిడిపి ఎంపీలతో చర్చించినా పెద్దగా రాష్ట్రానికి ఉపయోగం ఉండదని అనంతపురం ఎంపీ జెసి దివాకర్ రెడ్డి చెప్పారు. కేంద్రానికి ఈ దఫా తలొగ్గేది లేదని జెసి దివాకర్ రెడ్డి చెప్పారు.

వైసీపీ విశ్వాసం ప్రజలను మభ్యపెట్టడానికే

వైసీపీ విశ్వాసం ప్రజలను మభ్యపెట్టడానికే

కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతామని వైసీపీ ప్రకటన ప్రజలను మభ్య పెట్టడానికేనని అనంతపురం ఎంపీ జెసి దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. జగన్‌ ఓ ఎంపీతో రాజీనామా చేయించమనండి..తానూ చేస్తానని..చివరకు ఎవరు గెలుస్తారో చూద్దామని జేసీ సవాల్ విసిరారు.

English summary
Tdp MP Jc Diwakar Reddy challenged to Ysrcp on Friday at Amaravathi. Jc Diwakar Reddy said that If one Ysrcp MP resign to MP post, I will resign to MP post .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X