వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎంవోలో జగన్ భారీమార్పులు - అజయ్ కల్లాం, పీవీ రమేష్ కు షాక్- పవర్ ఫుల్ గా ప్రవీణ్ ప్రకాష్..

|
Google Oneindia TeluguNews

అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ సీఎంవోలో కీలక మార్పులు చేపట్టారు. ప్రభుత్వం తాజాగా ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం సీఎంవోలో పనిచేస్తున్న పలువురు ఐఏఎస్ అధికారుల బాధ్యతల్లో భారీ మార్పులు జరిగాయి. వీటి ప్రకారం జగన్ వద్ద ఇప్పటివరకూ కీలకంగా వ్యవహరించిన వారు ఇకపై నామమాత్రంగా మారిపోయారు. అదే సమయంలో ప్రస్తుతం సీఎం జగన్ రాజకీయ కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ మరిన్ని బాధ్యతలతో మరింత శక్తివంతంగా మారిపోయారు.

 సీఎంవోలో భారీ మార్పులు...

సీఎంవోలో భారీ మార్పులు...

అధికారం చేపట్టి ఏడాది పాలన పూర్తి కావడం, పలు కీలక సమస్యల పరిష్కారంలో ఎదురవుతున్న ఇబ్బందులు, వాటి పరిష్కారంలో తన టీమ్ అధికారులు చూపుతున్న చొరవ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఏపీ సీఎం జగన్ సీఎంవో టీమ్ బాధ్యతల్లో పలు మార్పులు చేపట్టారు. తాజా మార్పుల ప్రకారం పలువురు కీలక అధికారులు నిర్వర్తిస్తున్న బాధ్యతల్లో భారీగా కోత పడగా.. మరికొందరికి అదనపు బాధ్యతలు దక్కాయి. తాను తెచ్చిపెట్టుకున్న అధికారులపై జగన్ కన్నెర్ర చేసినట్లు తాజా మార్పులు చెబుతున్నాయి. తాజా మార్పులను బట్టి చూస్తుంటే అధికార యంత్రాంగంపై సీఎం జగన్ ఉన్న అభిప్రాయం కూడా బయటపడినట్లయింది.

అజయ్ కల్లాం, పీవీ రమేష్ లకు కోతలు...

అజయ్ కల్లాం, పీవీ రమేష్ లకు కోతలు...


ఏపీ సీఎంఓలో పనిచేస్తున్న కీలక అధికారులకు గతంలో వివిధ రంగాల కేటాయింపు జరిగింది.. దీని ప్రకారం మాజీ సీఎస్, ప్రభుత్వ ముఖ్యసలహాదారుగా ఉన్న అజయ్ కల్లాం సీఎంవోలో అత్యంత కీలకమైన హోం, రెవెన్యూ, ఫైనాన్స్ బాధ్యతలు పర్యవేక్షించేవారు. ఇప్పుడు ఆయన పరిధిలో ఉన్న సబ్జెక్ట్ లు అన్నీ తప్పించేశారు. సీఎంవో సబ్జెక్ట్ ల జాబితాలో అజయ్ కల్లాం పేరు లేకుండా పోయింది. దీంతో ఆయన ఎలాంటి సబ్జెక్ట్ లు లేకుండా కేవలం సలహాదారుగా మిగిలిపోనున్నారు. అజయ్ కల్లాంతోపాటు మరో రిటైర్డ్ అధికారి పీ వీ రమేష్, జె.మురళీలది అదే పరిస్థితి. పీవీ రమేష్ కు తొలుత కీలక శాఖలు అప్పగించినా మధ్యలో కోత వేసి వైద్యం, విద్య వంటి శాఖలకు పరిమితం చేశారు.
ఈ ముగ్గురూ ఇప్పటివరకూ ప్రభుత్వంలో, ముఖ్యంగా సీఎంవోలో కీలక వ్యవహారాలు నిర్వర్తిస్తున్న వారే కావడంతో ఈ మార్పులు చర్చనీయాంశమయ్యాయి.

మరింత శక్తివంతుడిగా ప్రవీణ్ ప్రకాష్...

మరింత శక్తివంతుడిగా ప్రవీణ్ ప్రకాష్...

ప్రభుత్వం తాజాగా చేపట్టిన మార్పుల ప్రకారం ప్రస్తుతం సీఎం ముఖ్యకార్యదర్శిగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ మరింత శక్తివంతంగా మారారు. సీఎంవోల బాధ్యతలు అన్నీ ప్రవీణ్ ప్రకాష్, సాల్మన్ ఆరోగ్యరాజ్, ధనుంజయ్ రెడ్డిల మధ్య పంపిణీ జరిగింది.
అధికార వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం సబ్జెక్ట్ లు తొలగిస్తున్న విషయం ఉత్తర్వులు వచ్చే వరకూ అజయ్ కల్లాం, పీవీ రమేష్ కు కూడా తెలియదని చెబుతున్నారు. దీని ప్రకారం సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ కు సాదారణ పరిపాలన శాఖతోపాటు హోం, రెవెన్యూ, ఫైనాన్స్ అండ్ ప్లానింగ్, న్యాయ, లెజిస్లేటివ్ వ్యవహారాలు, సీఎంవో ఎస్టాబ్లిష్ మెంట్, ఇతర అనుబంధ విభాగాలు, కేంద్ర రాష్ట్ర సంబంధాలతో పాటు అన్ని అంశాలు ప్రవీణ్ ప్రకాష్ పరిధిలోనే ఉంటాయి.

తర్వాత స్ధానాల్లో వారిద్దరూ...

తర్వాత స్ధానాల్లో వారిద్దరూ...

తాజా మార్పులతో ప్రవీణ్ ప్రకాష్ తర్వాత సీఎంవోలో మరో ఇద్దరు ఐఏఎస్ అధికారులు కీలకంగా మారారు. వీరిలో సాల్మన్ ఆరోగ్యరాజ్ కు రవాణా, రోడ్లు భవనాల శాఖ, హౌసింగ్, ఫుడ్ అండ్ సివిల్ సప్లయిస్, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్ మెంట్, ఎడ్యుకేషన్, అన్ని సంక్షేమ శాఖలు, పరశ్రమలు, వాణిజ్యం, మౌలికసదుపాయాలు, పెట్టుబడుల శాఖ,ఐటి, గనులు, కార్మిక, ఉపాధి కల్పనా శాఖ, కె.. ధనుంజయ్ రెడ్డికి జలవనరులు, ఎన్విరాన్ మెంట్ అండ్ ఫారెస్ట్, మున్సిపల్ అడ్మిస్టేషన్, వ్యవసాయం, అనుబంధ విభాగాలు, హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ, ఎనర్జీ, టూరిజం, మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్ , ఫైనాన్స్ కేటాయించారు.

కోరి తెచ్చుకున్న వారికి షాక్...

కోరి తెచ్చుకున్న వారికి షాక్...

సీఎం జగన్ తాను కోరి తెచ్చిపెట్టుకున్న అజయ్ కల్లాం వంటి వారిని కూడా ఇలా ఏ బాధ్యతలు లేకుండా చేయటం..అది కూడా పిలిచి ఓ మాట మాత్రంగా కూడా చెప్పకుండా చేశారని ఐఏఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
గతంలో కేటాయించిన సబ్జెక్ట్ ల కేటాయింపు ఆదేశాలు అన్నింటిని రద్దు చేస్తూ కొత్తగా ఆదేశాలు జారీ చేశారు. అజయ్ కల్లాం ఎన్నికల ముందు నుంచి కూడా జగన్ తో అత్యంత సన్నిహితంగా ఉండటంతో గ్రామ సచివాలయాల వ్యవస్థ వంటి వాటి విషయంలో కీలక పాత్ర పోషించారనే ప్రచారం వైసీపీ వర్గాల్లో ఉంది. అంతే కాదు..ప్రతిపక్షంలో ఉండగా వ్యతిరేకించిన వాటినే అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయటం వంటి అంశాల్లో ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా పనిచేయటం ద్వారా అజయ్ కల్లాం వ్యక్తిగతంగా తనకు ఉన్న పేరును కూడా దెబ్బతీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందులో ముఖ్యమైనది.

English summary
andhra pradesh chief minister ys jagan has made some key changes in his official team in cmo. govt issued orders to change responsibilities of senior ias officers working there.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X