వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో తెలుగు జంట భారీ మోసం -H-1B పేరిట రూ10కోట్లు టోకరా - బాధితులూ మనోళ్లే -ఏపీలో కలకలం

|
Google Oneindia TeluguNews

'మీది తెనాలే.. మాది తెనాలే.. మనది తెనాలే..' అంటూ కాశీలో తెలుగోళ్లనే గంగలో ముంచేసే తెలుగు దొంగల కథను తెరపై చూశాం. సరిగ్గా అదే స్టైల్లో తెగులు సెంటిమెంట్ ను అడ్డం పెట్టుని ఓ తెగులు జంట.. 30 మంది తెలుగు విద్యార్థుల్ని నిలువు దోపిడీ చేసిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. ట్రంప్ ఏలుబడిలో వలసదారుల్లో నెలకొన్న భయాలను క్యాష్ చేసుకున్న ఆ జంట.. ఎంచక్కా యూరప్ చెక్కేయగా.. వాళ్లు పంపిన డబ్బుతో ఆంధ్రప్రదేశ్ లో ఆస్తులు పోగేసిన కుటుంబీకులు కూడా పరారైపోయారు...

తెలంగాణలో రాష్ట్రపతి పాలన -నెత్తురు తాగే బ్రోకర్ -బీజేపీ తడాఖా -కేసీఆర్‌పై అర్వింద్ సంచలనం తెలంగాణలో రాష్ట్రపతి పాలన -నెత్తురు తాగే బ్రోకర్ -బీజేపీ తడాఖా -కేసీఆర్‌పై అర్వింద్ సంచలనం

వీసా కన్సల్టెన్సీ అంటూ..

వీసా కన్సల్టెన్సీ అంటూ..

అమెరికా వెళ్లే ప్రతి తెలుగు విద్యార్థి హెచ్‌1బీ వీసా సాధించాలని కలలు కంటారు. అయితే, ఇటీవల హెచ్‌1బీ వీసాల ప్రక్రియ మరింత జఠిలమైంది. వసల చట్టాలను ట్రంప్ మరింత కఠినతరం చేయడంతో, అక్కడ పెద్ద సంఖ్యలో ఉన్న భారతీయులు, అందునా తెలుగువారు ఆందోళనకు గురయ్యారు. వీసాల పట్ల వారిలోని భయాలను క్యాష్ చేసుకునేందుకు ఓ తెలుగు జంట ఏకంగా కన్సల్టెన్సీ పెట్టి భారీ ఎత్తున మోసానికి పాల్పడింది. అమెరికాలో ఎఫ్‌1 వీసా ఉన్న తెలుగు విద్యార్థుల్ని టార్గెట్ చేసుకుని, వారికి హెచ్‌1 వీసా ఇప్పిస్తామంటూ నమ్మబలకి పెద్ద మొత్తంలో డబ్బులు లాగారు. నార్త్‌ కరోలినాలోని హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం, ఆంధ్రప్రదేశ్ పోలీసులు చెప్పిన వివరాలిలా ఉన్నాయి..

టిట్ ఫర్ టాట్: జగన్‌కు సంచైత షాక్ -కోరి తెచ్చుకుంటే కారం పెట్టినట్లు కామెంట్లు -మార్పు తప్పదంటూటిట్ ఫర్ టాట్: జగన్‌కు సంచైత షాక్ -కోరి తెచ్చుకుంటే కారం పెట్టినట్లు కామెంట్లు -మార్పు తప్పదంటూ

ముత్యాల సునీల్ -ప్రణీత జంట

ముత్యాల సునీల్ -ప్రణీత జంట

కొంతకాలంగా అమెరికాలో నివసిస్తోన్న ముత్యాల సునీల్ -ప్రణీత జంట.. కన్సల్టెంట్‌ కంపెనీ పేరిట అనేకమంది తెలుగు విద్యార్థులకు గాలం వేశారు. ఎఫ్‌1 వీసా ఉన్నవారికి, దాన్ని హెచ్‌1బీ వీసాగా మార్పిస్తామంటూ ఒక్కొక్కరి నుంచి రూ.18.44 లక్షలు(25 వేల డాలర్లు) వసూలు చేశారు. అలా పదుల సంఖ్యలో విద్యార్థుల నుంచి రూ.10కోట్ల దాకా పిండేశారు. రోజులు గడుస్తున్నా వీసాల ప్రక్రియ ముందుకు కదలకపోవడం, సునీల్-ప్రణీతలు పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో తాము మోసపోయామని కొందరు విద్యార్థులు గ్రహించారు. దాదపు 30 మంది తెలుగు విద్యార్థులు నార్త్‌ కరోలినాలోని హోంల్యాండ్‌ సెక్యూరిటీలో ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది. ఈలోపే..

నిందితులు పరార్‌.. ఇంటర్‌పోల్ లుకౌట్

నిందితులు పరార్‌.. ఇంటర్‌పోల్ లుకౌట్

వీసాల పేరుతో మోసాలకు పాల్పడిన తెలుగు జంట సునీల్-ప్రణీతలు తమపై ఫిర్యాదు నమోదైందని తెలిసిన వెంటనే క్షణం ఆలస్యం చేయకుండా అమెరికా నుంచి పరారైపోయారు. మోసకారి దంపతులు యూర్‌పకు పారిపోయినట్టు సమాచారం. దీనిపై అమెరికా అధికారులు.. ఇంటర్‌పోల్‌ను అప్రమత్తం చేశాయి. పరారీలో ఉన్న సునీల్‌ దంపతులపై ఇంటర్‌పోల్ లుకౌట్‌ నోటీసులు కూడా జారీ అయ్యాయి. ఇటు ఆంధ్రప్రదేశ్‌లోనూ..

వీసా మోసాలతో ఏపీలో విలాసాలు

వీసా మోసాలతో ఏపీలో విలాసాలు

అమెరికాలో వీసాల కుంభకోణానికి సంబంధించి ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పోలీసులకు కూడా ఫిర్యాదులు వచ్చాయి. ముత్యాల సునీల్-ప్రణీతలు వీసాల పేరుతో మోసాలకు పాల్పడుతూ అమెరికాలో కూడబెట్టిన డబ్బులను పశ్చిమగోదావరి జిల్లాలోని తమ కుటుంబీకులకు పంపారు. సునీల్‌ తండ్రి ముత్యాల సత్యనారాయణ బ్యాంకు ఖాతాలోకి అమెరికా నుంచి డబ్బులు మళ్లాయని, ఆ డబ్బుతో సత్యనారాయణ స్థానికంగా భారీగా ఆస్తులు కూడబెట్టారని పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే, కొడుకు, కోడలు దారిలోనే సత్యనాయాణ కూడా పరారయ్యారు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు.

English summary
Interpol notice has been issued against telugu couple in usa for duping Telugu students in the name of American H1B visas. Muthyala Sunil and Pranitha have collected up to Rs. 10 crore from 30 Telugu students. The accused fled to Europe, sunil.s father also escaped in andhra pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X