గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దాచేపల్లిలో 9 ఏళ్ల బాలికపై వృద్ధుడు రేప్: స్పందించిన జగన్, పవన్ కళ్యాణ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

దాచేపల్లి: గుంటూరు జిల్లాలోని దాచేపల్లిలో తొమ్మిదేళ్ల బాలికపై వృద్ధుడి అత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపింది. అత్యాచారం కేసులో నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తు అద్దంకి నార్కట్‌పల్లి రోడ్డుపై దాచేపల్లి వద్ద బాధితురాలి కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాలు బుధవారం ఆందోలన నిర్వహించారు.

గుంటూరులో దారుణం: 9ఏళ్ల బాలికపై వృద్ధుడి అత్యాచారం..గుంటూరులో దారుణం: 9ఏళ్ల బాలికపై వృద్ధుడి అత్యాచారం..

దీంతో దాదాపు పదిహేను కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచింది. బుధవారం రాత్రి పది గంటల నుంచి రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు వారితో మాట్లాడి న్యాయం చేస్తామని, నిందితుడిని అరెస్టు చేస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు, గురువారం బందుకు పిలుపునిచ్చారు.

Andhra Girl, 9, Raped Allegedly By 50-Year-Old: Angry Locals Set Deadline

స్పందించిన పవన్ కళ్యాణ్

దాచేపల్లి అత్యాచార ఘటనపై పవన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. కతువా నుంచి కన్యాకుమారి వరకు జరిగే అత్యాచార సంఘటనల గురించి విన్నప్పుడు తనతో సహా, పౌర సమాజం తీవ్ర ఆవేదనకు గురవుతోందని, ఈ రోజు దాచేపల్లి సంఘటన కూడా మనసును కలచివేసిందని, నిస్సహాయతకు గురి చేసిందని పవన్ పేర్కొన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో పోలీస్ యంత్రాంగం, ప్రభుత్వం అన్యాయానికి గురైన ఆ బిడ్డకు, వారి కుటుంబానికి అండగా నిలబడాలని కోరుకుంటున్నానని చెప్పారు. అసలు ఆడబిడ్డపై ఇలాంటి అరాచకం చేసే వ్యక్తులు భయపడే పరిస్థితి రావాలంటే పబ్లిక్‌గా శిక్షించే విధానాలు రావాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.

స్పందించిన జగన్

దాచేపల్లిలో తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం జరిగిందని, ఇలాంటి దారుణ సంఘటనలు గత కొన్ని నెలలుగా ఏపీలో చోటు చేసుకుంటున్నాయనిపేర్కొన్నారు.

ఎక్కువ మంది నిందితులు అధికార పార్టీకి చెందిన వారని, అందుకే బాధితులకు సరైన న్యాయం జరగడం లేదని పేర్కొన్నారు. ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోనందుకు చంద్రబాబు బాధ్యులు కాదా అని ప్రశ్నించారు.

English summary
A nine year old girl was sexually assaulted allegedly by a 50-year-old man in Andhra Pradesh's Guntur. The incident has sparked violent protests in the area. Locals who blocked a highway till early this morning have set a deadline till 3 pm for the arrest of the accused, who is missing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X