వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా కల్లోలం: వైరస్ ఉందనే అనుమానంతో ఆత్మహత్య, మాస్క్ పెట్టుకోవాలని వైద్యులు సూచించడంతో..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ కాదు.. వైరస్ లక్షణాలు ఉన్నాయనే భ్రమపడేవారు ఉన్నారు. దగ్గు, జలుబు, జ్వరంతో వైరస్ వ్యాప్తి చెందుతోందని వైద్యులు తెలిపిన సంగతి తెలిసిందే. అయితే చిత్తూరులో ఓ వ్యక్తి తనకు కరోనా వైరస్ ఉందనే అనుమానం వెంటాడింది. తనకు వైరస్ ఉందని, అది మరొకరి వస్తోందని భావించి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది.

కరోనా ఉందని..?

కరోనా ఉందని..?

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాకు చెందిన 54 ఏళ్ల వ్యక్తికి జలుబుతో బాధపడ్డాడు. వైద్యుడిని సంప్రదిస్తే మాస్క్ పెట్టుకోవాలని సూచించారు. కరోనా వైరస్ గురించి విన్న అతను తనకు కూడా అదే సోకిందని భయపడ్డారు. దీంతోపాటు మాస్క్ పెట్టుకొని ఉంటే.. జనం వింతగా చూడటం కూడా ఆత్మన్యూనత భావం కలిగించింది. వైరస్ వల్ల జర్వం ఎక్కువవుతోందని వైద్యులు సూచించారు. కానీ దానిని అతను తప్పుగా అర్థం చేసుకున్నాడు.

ఆత్మహత్య..

ఆత్మహత్య..

మాస్క్ పెట్టుకోవడం జనం కూడా విచిత్రంగా చూడటం కలచి వేసింది. తనకు కరోనా వైరస్ సోకిందని భావించాడు. తన నుంచి వైరస్ మరొకరికి సోకిందని భావించాడు. అందుకే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన తండ్రి కరోనా వైరస్ వచ్చిందని భయపడ్డాడని అతని కుమారుడు తెలిపాడు. తన నుంచి వైరస్ ఇతరులకు సోకద్దని ఆత్మహత్య చేసుకున్నాడని వివరించారు.

ఏపీకి చెందిన వారు 56 మంది..

ఏపీకి చెందిన వారు 56 మంది..

గతవారం చైనా నుంచి 324 మంది ప్రయాణికులు చైనా నుంచి ఇండియా వచ్చారు. అందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు 56, తమిళనాడుకు చెందిన వారు 53, కేరళకు చెందినవారు 42 మంది ఉన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందటంతో 50 వేల మంది వైద్య సిబ్బందికి పర్సనల్ ప్రొటెక్షన్ కిట్లను సమకూర్చామని కేంద్ర వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న టాప్ 30 దేశాల జాబితాలో భారతదేశం కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

English summary
novel coronavirus threat in India has been worrisome lately. The coronavirus threat killed a man in Chittoor district of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X