అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దేశంలో అత్యంత నివాసయోగ్యమైన రాష్ట్రాల్లో ఏపీ టాప్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: హౌసింగ్ అండ్ అర్బన్ ఎఫైర్స్ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ ప్రకారం.. దేశంలో నివసించేందుకు అత్యంత అనుకూలమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. ఏపీతోపాటు మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు ఈ జాబితాలో అగ్రభాగాన నిలిచాయి.

జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా జీవించేందుకు అనుకూలమైన రాష్ట్రాలను గుర్తించేందుకు ప్రాథమికంగా ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ రూపొందించామని గృహ మరియు పట్టణ వ్యవహారాల సహాయ మంత్రి హర్దీప్ సింగ్ పురి వెల్లడించారు. ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ 2018పై నిర్వహించిన నేషనల్ డిస్మనైషన్ వర్క్‌షాప్‌లో ఈ మూడు రాష్ట్రాలు అగ్రభాగాన నిలిచాయన్నారు.

 Andhra most liveable state in India as per Ease of Living index: Govt report

ఆరోగ్యవంతమైన పోటీని నగరాల మధ్య పెంపొందించేందుకే ఈ ఇండెక్స్ రూపొందించామని కేంద్రమంత్రి తెలిపారు. మొత్తం 116 నగరాలకు ర్యాంకులు ఇస్తున్నామని తెలిపారు. జూన్ 2017 నుంచి 2018 జనవరి వరకు మానవ మనుగడకు వీలైన పరిస్థితులు కల్పించడంపై ఈ ర్యాంకులు ఇవ్వడం జరిగిందన్నారు.

సంస్థాగత, సామాజిక, ఆర్థిక, భౌతిక అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ ర్యాంకులు కేటాయించడం జరుగుతోందని తెలిపారు. వీటిని 78ఇండికేటర్స్, 15విభాగాల్లో విభజించడం జరుగుతోందన్నారు. మొత్తం 100 మార్కుల్లో ఫిజికల్ పిల్లర్(మౌలిక సదుపాయాలు)కు 45 మార్కులు కేటాయించడం జరుగిందన్నారు.
సంస్థాగత(పరిపాలన), సామాజిక అంశాలు చెరో 25, ఇతర ఆర్థికపరమైనవి 5 వెటేజీ ఇస్తున్నట్లు తెలిపారు. స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు, భద్రత లాంటి ఇతర అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగిందన్నారు.

English summary
Andhra Pradesh topped the chart in terms of ease of living followed by Odisha and Madhya Pradesh, according to the "Ease of Living Index" released by the Ministry of Housing and Urban Affairs (MoHUA) on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X