నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఒక కూతురు కోసం అమ్మకానికి మరో కూతురు: ఏపీలో మనసును పిండేసిన వ్యధ

|
Google Oneindia TeluguNews

మనసుల్ని పిండేసే విషాద సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది . నవమాసాలు మోసి కని, పెంచి, కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఓ కూతుర్ని తల్లిదండ్రులు 46 ఏళ్ల వ్యక్తికి విక్రయించారు. పన్నెండేళ్ల వయసున్న ఆ కుమార్తెను పది వేల రూపాయల కోసం విక్రయించిన సంఘటన తెలిసిన వారంతా ఆ తల్లిదండ్రుల కర్కశత్వాన్ని నిందిస్తూ ఉంటే, ఆ కర్కశత్వం వెనుక మరో విషాదం దాగి ఉందన్న విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది.

 నెల్లూరు జిల్లాలో కూతుర్ని అమ్మిన తల్లిదండ్రులు

నెల్లూరు జిల్లాలో కూతుర్ని అమ్మిన తల్లిదండ్రులు

నెల్లూరు జిల్లా విడవలూరు మండలం దంపూరులో జరిగిన ఘటనలో తల్లిదండ్రులు పన్నెండేళ్ల కుమార్తెను అమ్మడానికి గల కారణం అందరి మనసులను కలచివేసింది. నెల్లూరు నగరంలోని కొత్తూరుకి చెందిన దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిలో పెద్ద కుమార్తె వయస్సు 16 సంవత్సరాలు, పెద్ద కుమార్తె శ్వాసకోస సంబంధమైన వ్యాధితో బాధపడుతుంది. ఇక చిన్న కుమార్తె వయస్సు పన్నెండు సంవత్సరాలు. రోజువారి కూలి పనులు చేసుకుని జీవనం సాగించే ఆ కుటుంబానికి రెక్కాడితే గానీ డొక్కాడదు.

బిడ్డకు పాలిస్తుండగా, తల్లి స్తనంపై కాటేసిన పాము.. బిడ్డ కోసం ఆ తల్లి ఏం చేసిందంటేబిడ్డకు పాలిస్తుండగా, తల్లి స్తనంపై కాటేసిన పాము.. బిడ్డ కోసం ఆ తల్లి ఏం చేసిందంటే

పెద్ద కూతురు కోసం చిన్న కూతుర్ని 46 ఏళ్ళ వ్యక్తికి విక్రయం

పెద్ద కూతురు కోసం చిన్న కూతుర్ని 46 ఏళ్ళ వ్యక్తికి విక్రయం

అలాంటి ఆ కుటుంబంలో పెద్దకుమార్తె అనారోగ్యసమస్యలు వారికి తలకు మించిన భారంగా తయారయ్యాయి. పదహారేళ్ల కుమార్తె వైద్య చికిత్సకు డబ్బుల్లేక ఆ తల్లిదండ్రులు చిన్న కుమార్తెను విక్రయించారు.

వారింటికి సమీపంలోనే ఉండే 46 సంవత్సరాల చిన్న సుబ్బయ్య అనే వ్యక్తి భార్య మరణించడంతో ఒంటరిగా ఉంటున్నాడు. బాలిక కుటుంబ ఆర్థిక పరిస్థితులు తెలుసుకుని 10 వేల రూపాయలకు బాలికను కొనుక్కుని రెండు రోజుల క్రితం బాలికను పెళ్ళికూడా చేసుకున్నాడు. ఆ తర్వాత దంపూరులోని బంధువుల ఇంటికి తీసుకెళ్ళాడు .

బాలిక ఏడవటంతో బయటపడిన అమ్మకం ... శిశు సంరక్షణా కేంద్రానికి బాలిక తరలింపు

బాలిక ఏడవటంతో బయటపడిన అమ్మకం ... శిశు సంరక్షణా కేంద్రానికి బాలిక తరలింపు

ఇక ఇదంతా అర్థం కాని బాలిక ఏడవడంతో స్థానికులు ఆరా తీశారు. దీంతో వారు ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించడంతో వారు బాలికను కాపాడి శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు.

బాలికను విక్రయించిన తల్లిదండ్రుల కర్కశత్వానికి ప్రతిఒక్కరూ ఆగ్రహం వ్యక్తం చేసినా, ఆ తర్వాత ఇంకో కుమార్తె అనారోగ్యం కోసం వైద్యం చేయించేందుకు డబ్బులు లేక బాలికను విక్రయించినట్లు తెలిసి స్థానికులు ప్రతిఒక్కరూ ఆవేదనకు గురయ్యారు.

పేదరికం , కుమార్తెకు వైద్యం చేయించలేని పరిస్థితులే కూతురు అమ్మకానికి కారణం

పేదరికం , కుమార్తెకు వైద్యం చేయించలేని పరిస్థితులే కూతురు అమ్మకానికి కారణం

కనీసం వైద్యానికి కూడా డబ్బులు లేని వారి ఆర్థిక పరిస్థితులు, పేదరికం వారిని కన్న కూతురిని విక్రయించేలా చేసిందని పలువురు కంటతడి పెట్టారు. ఇక ఇలాంటి వారికి అండగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఎంతైనా ఉంది.

పెద్ద కుమార్తె అనారోగ్యానికి ప్రభుత్వం వైద్యం చెయ్యటానికి సహాయం అందించాలని స్థానికులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

English summary
Unable to fund their 16-year-old daughter's treatment, a daily wager couple in Andhra Pradesh’s Nellore reportedly sold their 12-year-old daughter to a 46-year-old man. The parents were unable to afford the treatment for their elder daughter's who is suffering from a respiratory illness.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X