విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విజయవాడలో అర్ధరాత్రి కాల్పుల కలకలం: పోలీస్ కమిషనర్ కార్యాలయ ఉద్యోగిపై బుల్లెట్ల వర్షం

|
Google Oneindia TeluguNews

విజయవాడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి ఒకరిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత ఈ ఘటన చోటు చేసుకుంది. విజయవాడ శివార్లలో కాల్పుల ఉదంతం సంభవించినట్లు నగర పోలీసులు వెల్లడించారు. మృతుడిని మహేష్‌గా గుర్తించారు. ఈ కాల్పుల వెనుక గల కారణాలపై దర్యాప్తు చేపట్టామని నగర పోలీస్ కమిషనర్ బీ శ్రీనివాసులు వెల్లడించారు. విజయవాడ శివార్లలోని బైపాస్ రోడ్డు వద్ద గల ఓ బార్ వద్ద కాల్పులు చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

సమాచారం అందిన వెంటనే పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు పాల్గొన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలుస్తోంది. టూవీలర్‌పై వచ్చిన వారు ముఖానికి మాస్కులను ధరించి ఉన్నారని, బార్ వద్ద మహేష్‌పై రెండు రౌండ్ల పాటు కాల్పులు జరిపి పారిపోయినట్లు చెబుతున్నారు. ఈ ఘటనలో మహేష్ సంఘటనా స్థలంలోనే మరణించారని అంటున్నారు.

Andhra Pradesh: A man working at Vijayawada Police Commissioners office shot dead

Recommended Video

YS Jagan Opens Refurbished Bapu Museum In Vijayawada | Oneindia Telugu

నిందితులను గాలించడానికి రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు కమిషనర్ పేర్కొన్నారు. విస్తృతంగా గాలింపు చర్యలను చేపట్టామని అన్నారు. మహేష్‌ను కాల్చి చంపడానికి మోటివ్ ఏమిటనేది ఇంకా తెలియరాలేదని, ఆయన కుటుంబ సభ్యులను విచారిస్తున్నామని చెప్పారు. కాగా- రియల్ ఎస్టేట్ సెటిల్‌మెంట్లు ఈ ఘటనకు దారి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగిపైనే గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడం.. స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. విజయవాడలో క్రమంగా శాంతిభద్రతలు కొరవడుతున్నాయనే విమర్శలు వ్యక్తమౌతున్నాయి.

English summary
Mahesh, A man working at Vijayawada Police Commissioner's office shot dead last night on the outskirts of the city in Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X