విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో రూ.500 కోట్ల అవినీతి: ప్రేమ-పెళ్లి-అక్రమాలు, ఎవరీ రఘు, ప్రసాద్, గాయత్రి?

ఏసీబీ వలలో సోమవారం భారీ తిమింగళాలు చిక్కుకున్నాయి.ఊహించని రీతిలో ఆస్తులు, వజ్రాలు, బంగారు ఆభరణాలు, నగదు బయటపడ్డ విషయం తెలిసిందే.

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏసీబీ వలలో సోమవారం భారీ తిమింగళాలు చిక్కుకున్నాయి. ఊహించని రీతిలో ఆస్తులు, వజ్రాలు, బంగారు ఆభరణాలు, నగదు బయటపడ్డ విషయం తెలిసిందే. 23 ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో రూ.500 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు.

ఏసీబీకి దొరికిన వారిలో ఒకరు పట్టణ ప్రణాళికా విభాగం (టౌన్‌ అండ్‌ కంట్రీప్లానింగ్‌) డైరెక్టరు గొల్ల వెంకట రఘు. మరొకరు పురపాలక శాఖ ఇంజినీరింగ్‌ విభాగం జూనియర్‌ టెక్నికల్‌ అధికారి నల్లూరి వెంకట శివప్రసాద్‌, ఇంకొకరేమో శివప్రసాద్‌ భార్య చింతమనేని గాయత్రి. ఆమె పురపాలక శాఖలో అసిస్టెంట్‌ ఇంజినీర్‌గా పని చేసి రెండేళ్ల కిందట స్వచ్చంద పదవీ విరమణ చేశారు. వీరు ముగ్గురు చేతులు కలిపారు.

రఘు ఇంట్లో రూ.500 కోట్ల అక్రమాస్తులు, కళ్లు తిరిగేలా ఆభరణాలు, ఇదీ ఆస్తుల చిట్టారఘు ఇంట్లో రూ.500 కోట్ల అక్రమాస్తులు, కళ్లు తిరిగేలా ఆభరణాలు, ఇదీ ఆస్తుల చిట్టా

ఒకరికి మరొకరు బినామీగా వ్యవహరించి రూ.500 కోట్ల (మార్కెట్‌ విలువ) అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఆంధ్రప్రదేశ్‌ ఏసీబీ గుర్తించింది. మూడు రాష్ట్రాల పరిధిలోని ఎనిమిది జిల్లాల్లో అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించారు. వారితో పాటు బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు.

ఎక్కువ మొత్తం గాయత్రి పేరిటే ఉన్నాయి

ఎక్కువ మొత్తం గాయత్రి పేరిటే ఉన్నాయి

ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. కళ్లు చెదిరే బంగారు, వజ్రాభరణాలు దొరికాయి. ఈ దాడుల్లో విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌నగరాల్లో ఖరీదైన ఆస్తులు వెలుగు చూశాయి. వీటిలో అత్యధిక శాతం ఆస్తులు నల్లూరి వెంకట శివప్రసాద్‌ భార్య చింతమనేని గాయత్రి పేరిటే ఉన్నాయి. శివప్రసాద్‌, గాయత్రిలు గొల్ల వెంకట రఘుకు బినామీలుగా వ్యవహరించినట్లు దర్యాప్తులో తేలింది.

పరిచయం పెళ్లి దాకా..

పరిచయం పెళ్లి దాకా..

వెంకట శివప్రసాద్, గాయత్రిలు నగరపాలక సంస్థలో ఒకేచోట ఉద్యోగం చేసేవారు. పరిచయం పెళ్లి దాకా వెళ్లింది. ఈ దంపతులకు ఉన్నతాధికారి రఘు పరిచయం కావడం, స్నేహం, ఆ తర్వాత ముగ్గురు కలిసి అక్రమాలకు తెరలేపారు. ఈ దంపతులు రఘుకు బినామీలుగా మారారు.

సేవ పేరుతో ఆస్తులు కూడబెట్టారు

సేవ పేరుతో ఆస్తులు కూడబెట్టారు

దంపతులు సేవ పేరుతో ఆస్తులు కూడబెట్టారు. ఊరి చివర ఒంటరిగా ఉన్న బంగ్లాలో ఆ దంపతులు ఇద్దరే కాపురం ఉంటూ సాయి మందిరం నిర్మాణం చేసి భక్తితత్వంలో ఉన్నారని అందరూ భావించారు.

ఏసీబీ దాడుల్లో అసలు స్వరూపం బయటపడింది

ఏసీబీ దాడుల్లో అసలు స్వరూపం బయటపడింది


కానీ ఏసీబీ దాడుల్లో ఆ దంపతుల అసలు స్వరూపం బయటపడింది. కట్టల కొద్ది డబ్బు. బంగారు, వెండి నగలు. స్థిరాస్తుల కాగితాల గుట్టలు వెలగు చూశాయి. ఇది తెలిసిన స్థానికులు నోరు వెళ్లబెట్టారు. ఏసీబీ అధికారులు సైతం అవాక్కయ్యారు.

అంత మొత్తంతో వెంచర్‌లో భయం లేకుండా ఒక్కరే

అంత మొత్తంతో వెంచర్‌లో భయం లేకుండా ఒక్కరే

ఈ దంపతులు మాత్రం బంగారు గొలుసులు వాషింగ్‌ మిషన్‌‌లో దాచారు. రూ.కోట్ల విలువ చేసే ఆభరణాలు ఇతర చర ఆస్తులు దగ్గర ఉంచుకొని ఏమాత్రం దొంగల భయం లేకుండా ఆ వెంచర్‌లో ఒక్కరే నివాసం ఉండటం అందరినీ విస్మయానికి గురి చేసింది.

ఆ వెంచర్‌లోని ఒకే ఇంటిలో వీరి నివాసం

ఆ వెంచర్‌లోని ఒకే ఇంటిలో వీరి నివాసం

ఇది. విజయవాడ నగరపాలక సంస్థలో జూనియర్‌ టెక్నికల్‌ అధికారిగా పనిచేస్తున్న వెంకట శివప్రసాద్‌ గన్నవరం మండలంలో రాఫిన్‌ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ వేసిన వెంచర్‌ భార్గవి నగర్‌లో నిర్మాణం చేసిన ఒకే ఇంటిలో వీరు నివాసం ఉంటున్నారు. పక్కనే వీరే నిర్మాణం చేసిన సాయిబాబా దేవాలయం ఉంది. విజయవాడ కార్పొరేషన్‌లో సర్కిల్‌ 3లో పటమట సమీపంలోని కార్యాలయంలో శివప్రసాద్‌ జూనియర్‌ టెక్నికల్‌ అధికారిగా పనిచేస్తున్నారు.

ఇక్కడ కలిశారు..

ఇక్కడ కలిశారు..

రఘును, శివప్రసాద్‌ దంపతులను విజయవాడ నగరపాలక సంస్థ కలిపింది. రఘు వీఎంసీలో మూడేళ్లపాటు సిటీ ప్లానర్‌గా పనిచేశారు. 2002 నుంచి 2004 వరకు ఆయన విజయవాడ కార్పొరేషన్‌లో పని చేశారు. ఆ సందర్భంలో ఏర్పడిన వారి పరిచయం కాస్త స్నేహ బంధంగా మారింది. ఆప్తులుగా మారారని చెబుతారు.

తొలుత శివప్రసాద్.. ఆ తర్వాత గాయత్రి

తొలుత శివప్రసాద్.. ఆ తర్వాత గాయత్రి

విజయవాడ నగరానికి చెందిన శివప్రసాద్‌ గుణదల ప్రాంతంలో ఉండేవారు. 1984లో విజయవాడ నగరపాలక సంస్థలో ఎన్‌ఎంఆర్‌గా వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌గా చేరారు. 1991లో ఆయనను శాశ్వత ఉద్యోగిగా నియామకం చేశారు. 1992లో చింతమనేని గాయత్రి నగర పాలక సంస్థలో జూనియర్‌ అసిస్టెంట్‌గా చేరారు.

ఇలా ఉద్యోగం పొందిన గాయత్రి

ఇలా ఉద్యోగం పొందిన గాయత్రి

గాయత్రి మోరంపూడి గ్రామానికి చెందినవారు. తల్లి టీచర్‌గా పనిచేస్తూ చనిపోవడంతో కారుణ్య ఉద్యోగం పొందారు. దీనికింద మొదట వీఎంసీలో జూనియర్‌ అసిస్టెంట్‌గా చేరారు. బీటెక్‌, ఎంబీఏ పూర్తి చేసిన ఆమె తర్వాత 1997లో ఏఈఈగా పదోన్నతి పొందారు. శాఖపరమైన పరీక్షలు రాసి పదోన్నతి సాధించారు.

ప్రేమ వివాహం

ప్రేమ వివాహం

నగర పాలక సంస్థలో పరిచయమైన వీరిద్దరూ (శివప్రసాద్, గాయత్రి) ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ సమయంలో వీఎంసీలో గాయత్రి ఓ వెలుగు వెలిగారు. జూనియర్‌ అసిస్టెంటుగా ఉన్న ఆమె తన స్థాయికి మించి ఇంచార్జ్ హోదాలో పదవులు నిర్వహించారు. ఆమెపై గతంలోను ఫిర్యాదులు వచ్చాయి.

English summary
In a huge catch, the Anti-Corruption Bureau (ACB) conducted simultaneous raids on the properties of Director, Town and Country Planning, Golla Venkata Raghu, and Junior Technical Officer (JTO, Engg. Section), Vijayawada Municipal Corporation (VMC), Nalluri Venkata Shivaprasad, on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X