వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Lockdown: ఆంధ్రా- కర్ణాటక బార్డర్ లో 66 చెక్ పోస్టులు, నో ఎంట్రీ, తెలంగాణ కూడా, ప్రాణాలతో గేమ్స్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ కర్నూల్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ప్రజలను ఎట్టిపరిస్థితుల్లో కర్ణాటకలోకి అనుమతించరాదని, ఒకవేళ అక్కడి ప్రజలను మనం సరిహద్దులు దాటిస్తే మన ప్రాణాలతో మనమే చెలగాటం (గేమ్స్) ఆడుకున్నట్లు అవుతోందని కర్ణాటకకు చెందిన ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు, అనంతరపురం జిల్లాల్లో కరోనా వైరస్ వ్యాధి ఏ విదంగా వ్యాపిస్తుందో మీరు గమనించాలని, కన్నడిగుల ప్రాణాలు కాపాడుకోవడానికి ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల నుంచి అక్కడి ప్రజలతో పాటు తెలంగాణ నుంచి వస్తున్న ప్రజలను కర్ణాటకలోకి అనుమతించరాదని సీనియర్ ఐఏఎస్ అధికారి అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటక సరిహద్దులోకి అక్రమంగా ఎవ్వరినీ అనుమించకుండా 66 ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని సీనియర్ ఐఏఎస్ అధికారి ఆదేశాలు జారీ చేశారు.

సోషల్ మీడియాలో 100 మంది అమ్మాయిలు, ఆంటీల టార్గెట్, ల్యాప్ టాప్ లో రహస్యాలు, గుండా యాక్ట్, బెండ్ !సోషల్ మీడియాలో 100 మంది అమ్మాయిలు, ఆంటీల టార్గెట్, ల్యాప్ టాప్ లో రహస్యాలు, గుండా యాక్ట్, బెండ్ !

 కర్నూలు కొంప ముంచింది ?

కర్నూలు కొంప ముంచింది ?

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ఎక్కువగా కరోనా వైరస్ (COVID 19) పాజిటివ్ కేసులు నమోదు కావడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆదివారం వరకు కర్నూలు జిల్లా అధికారులు తెలిపిన లెక్కల ప్రకారం 466 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఇప్పటి వరకు 77 మంది చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 379 మంది కరోనా వైరస్ వ్యాధి నయం చేసుకోవడానికి చికిత్స పొందుతున్నారని మునిసిపల్ కమిషనర్ రవీంద్ర బాబు తెలిపారు.

 కలెక్టర్ హోమ్ క్వారంటైన్ లో !

కలెక్టర్ హోమ్ క్వారంటైన్ లో !

కర్నూలు జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్ ముందు జాగ్రత్తగా హోమ్ క్వారంటైన్ కే పరిమితం అయ్యారని అధికారులు అంటున్నారు. జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు అధికారుల నుంచి సమాచారం సేకరించి కరోనా వైరస్ ను అరికట్టడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని కర్నూలు జిల్లా అధికారులు తెలిపారు.

ఆంధ్రా నుంచి కర్ణాటకలోకి నో ఎంట్రీ

ఆంధ్రా నుంచి కర్ణాటకలోకి నో ఎంట్రీ

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు, అనంతపురం జిల్లాలో రోజురోజుకు కరోనా వైరస్ వ్యాధి కేసులు పెరిగిపోతున్నాయని, ఆ జిల్లాల నుంచి కర్ణాటకలోకి ఎవ్వరినీ ప్రవేశించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని బళ్లారి (కర్ణాటక) జిల్లాధికారి ( కలెక్టర్) ఎస్ఎస్. నకుల్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బళ్లారి నగరంలోని జిల్లాధికారి కార్యాలయంలో ఆ జిల్లా అధికారులతో ఎస్ఎస్. నకుల్ సమావేశమై చర్చించిన తరువాత ఈ నిర్ణయం తీసుకుని ఆదేశాలు జారీ చేశారు.

మీ ప్రాణాలతో చెలగాటం వద్దు !

మీ ప్రాణాలతో చెలగాటం వద్దు !

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు, అనంతపురం జిల్లాల మీదుగా కర్ణాటకలోకి ఎవరైనా ప్రవేశిస్తే కరోనా వైరస్ వ్యాపించే అవకాశం ఉందని, కర్ణాటక సరిహద్దులోని స్థానిక ప్రజలు ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న వారికి సహకరించకూడదని బళ్లారి జిల్లాధికారి ఎస్ఎస్. నకులు స్థానిక ప్రజలకు మనవి చేశారు. బళ్లారి జిల్లాలోని సండూరు తాలుకా సరిహద్దులు, సిరిగుప్ప, బళ్లారి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కర్ణాటకలోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు.

 మూడు ప్రాంతాలు టార్గెట్

మూడు ప్రాంతాలు టార్గెట్

ఆంధ్రప్రదేశ్- కర్ణాటక సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చెయ్యాలని సంబధిత అధికారులకు బళ్లారి జిల్లాధికారి ఎస్ఎస్. నకుల్ ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్- కర్ణాటక సరిహద్దులోని బళ్లారిలో 29 గ్రామాలు, సిరుగుప్పలో 27 గ్రామాలు, సండూరులో 10 గ్రామాలు ఉన్నాయని, ఈ మూడు ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ప్రజలు కర్ణాటకలోకి ప్రవేశించే అవకాశం ఉందని బళ్లారి జిల్లాధికారి ఎస్ఎస్. నకుల్ గుర్తు చేశారు.

66 ప్రత్యేక చెక్ పోస్టులు

66 ప్రత్యేక చెక్ పోస్టులు

బళ్లారి, సండూరు, సిరిగుప్ప ప్రాంతాల్లోని గ్రామాల నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి వచ్చే ప్రజలు కర్ణాటకలోకి ప్రవేశించే అవకాశం ఉందని బళ్లారి జిల్లాధికారి ఎస్ఎస్. నకుల్ గుర్తు చేస్తున్నారు. మొత్తం 66 ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చెయ్యాలని సంబంధిత అధికారులకు బళ్లారి జిల్లాధికారి ఎస్ఎస్. నకుల్ ఆదేశాలు జారీ చేశారు.

Recommended Video

Andhra Pradesh Govt to Hike Liquor Prices By 25 Percent | Onewindia Telugu
 24 గంటలు నిఘా వెయ్యండి

24 గంటలు నిఘా వెయ్యండి

ప్రతి ప్రాంతానికి ప్రత్యేక నోడల్ అధికారులను నియమించామని, ఎప్పటికప్పుడు చెక్ పోస్టుల్లో సంచరించి ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు దాటి కర్ణాటకలోకి ఎవ్వరూ ప్రవేశించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని బళ్లారి జిల్లాధికారి ఎస్ఎస్. నకుల్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

English summary
Coronavirus Lockdown: Andhra And Karnataka Border Is Very Tight Ahead Of Coronavirus, says Bellary DC S S Nakul
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X