వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎపి:నేటితో ముగుస్తున్న అసెంబ్లీ సమావేశాలు...చివరి రోజు 14 బిల్లులు ప్రవేశపెడుతున్న ప్రభుత్వం

|
Google Oneindia TeluguNews

అమరావతి:ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు నేటితో ముగిసిపోతున్నాయి. సమావేశాలు నేటితో ముగియనుండటంతో ప్రభుత్వం ఈ చివరి రోజు సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చలతో పాటు ముఖ్యమైన బిల్లులు ప్రవేశపెట్టనుంది.

ఇటీవలికాలంలో తీవ్ర రూపం దాల్చి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారిన సిపిఎస్ రద్దుపై రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు సమావేశాల్లో ప్రకటన చేయనున్నట్లు తెలిసింది.
అలాగే ఈ చివరి రోజు సమావేశాల్లో ఎపి ప్రభుత్వం మొత్తం 14 బిల్లులు ప్రవేశపెట్టేందుకు సంసిద్దమైంది. అలాగే మరోవైపు శాసనమండలిలోనూ రాష్ట్ర ప్రభుత్వం రెండు బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది.

నేటితో...సభ సమాప్తం

నేటితో...సభ సమాప్తం

ఇటీవలే ప్రారంభమైనట్లు అనిపిస్తున్న ఎపి అసెంబ్లీ వర్షాకాలం సమావేశాలు అప్పుడే చివరి రోజుకు చేరుకున్నాయి. నేటి అసెంబ్లీ సమావేశాలకు శుభం కార్డు పడుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు సభలో పలు కీలక అంశాలపై చర్చ, ప్రకటనలతో పాటు రాష్ట్రానికి సంబంధించి వివిధ ముఖ్యమైన బిల్లులను ప్రవేశపెట్టేందుకు సంసిద్దమైంది.

సభ...ఇలా మొదలైంది

సభ...ఇలా మొదలైంది

ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం సభ మొదలవగానే స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అందులో కృష్ణానది కరకట్టల నిర్మాణం, శ్రీకాకుళం రిమ్స్‌ వైద్యశాలలో పదవుల భర్తీ, ఎపిఎస్ఆర్టీసీ, కొండరాజులను గిరిజన తెగగా గుర్తించుట, రాష్ట్రంలో మితంవ్యయ గృహాల నిర్మాణంకు సంబంధించిన అంశాలపై చర్చకు తెరతీసారు.

చివరి రోజు...14 బిల్లులు

చివరి రోజు...14 బిల్లులు

అలాగే ఓల్డ్‌ పెన్షన్‌ స్కీమ్‌పైనా, నదుల అనుసంధానం, సంక్షేమ రంగం, వైద్యం ఆరోగ్యం పైనా శాసనసభలో చర్చ జరుగనుంది. వీటితో పాటు గ్రామదర్శిని 1500 పనిదినాల అమలుపై, చంద్రన్న భీమా, యువ నేస్తంపై సభలో చర్చించనున్నారు. అలాగే ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్న సీపీఎస్‌పై తమ వైఖరి తెలియచెబుతూ సభలో ఎపి ప్రభుత్వం ఒక ప్రకటన చేయనుంది. అలాగే ఈ చివరిరోజు సభలో ప్రభుత్వం మొత్తం 14 బిల్లులను ప్రవేశపెట్టనుంది.

శాసనమండలిలో...విస్తృత చర్చ

శాసనమండలిలో...విస్తృత చర్చ

ఈరోజు శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో మెడికల్ అడ్మిషన్లలో అడ్డంకులపై అత్యవసర ప్రజా ప్రయోజన నోటీసుపై చర్చ, అలాగే యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాల పంపిణీపై, జూనియర్‌ కళాశాలలో మధ్యాహ్న భోజనం అమలు, టీటీడీ ఆభరణాల ఆడిట్‌, తెలుగుభాష పునరుద్ధరణ, రైతులకు నాణ్యమైన విత్తనాల పంపిణీ, బాక్సైట్‌ గనుల తవ్వకం వంటి అంశాలపై చర్చ జరుగనుంది. అలాగే ఈరోజు శాసనమండలిలో ఎపి ప్రభుత్వం రెండు బిల్లులను ప్రవేశపెట్టనుంది.

English summary
Amaravathi:Legislative Assembly session of Andhra Pradesh ends today. As the last day of the session, the AP government will introduce important bills, including discussions on key issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X