టిడిపికి షాక్: విమర్శలకు కౌంటర్, సీట్ల పెంపుపై అమిత్ షా దే నిర్ణయం
అమరావతి: ఏపీ రాష్ట్రంలో స్వతహగా ఎదిగేందుకు బిజెపి నాయకత్వం ప్లాన్ చేస్తోంది. ఏపీ ప్రభుత్వానికి కేంద్రం నుండి ఏ మేరకు సహయం చేశామో ప్రజలకు వివరించాలని పార్టీ నాయకత్వానికి సూచించింది. టిడిపి విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పాలని బిజెపి నాయకత్వం ఏపీ నేతలకు సూచించింది.
బిజెపితో పొత్తుపై జగన్ ఇలా: వ్యూహత్మకంగా వైసీపీ అడుగులు
అసెంబ్లీ సీట్ల పెంపు విషయమై ఏపీ, తెలంగాణ రాష్ట్ర నేతలతో బిజెపి జాతీయ అధ్యక్షుడు గురువారం నాడు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాలపై చర్చించారు.
మా పెళ్ళికి ఆ ఇద్దరు ఒప్పుకోలేదు, తిరుపతిలో మైక్ కట్, లైట్లు ఆర్పేశారు: లక్ష్మీపార్వతి సంచలనం
టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఇటీవల కాలంలో బిజెపిపై చేసిన వ్యాఖ్యలు, ఏపీలోని రాజకీయ పరిస్థితులు రానున్న రోజుల్లో ఏపీలో అనుసరించాల్సిన వ్యూహలపై ఈ సమావేశంలో చర్చించారు.

టిడిపి విమర్శలకు చెక్
ఏపీలో ఇటీవల కాలంలో బిజెపి నేతలు టిడిపి నాయకులను,. ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తున్నారు.ఈ విమర్శలపై ఏపీ సీఎం కొంత కాలం పాటు తమ పార్టీ నేతలకు సంయమనం పాటించాలని సూచించారు. ధావోస్ పర్యటనను ముగించుకొని వచ్చిన తర్వాత చంద్రబాబునాయుడు కూడ బిజెపి నేతల తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే టిడిపి నేతలు బిజెపి నాయకత్వంపై చేస్తున్న విమర్శలను ధీటుగా ఎదుర్కోవాలని బిజెపి రాష్ట్ర నేతలకు అమిత్ షా సూచించారు. ఏపీ రాష్ట్రానికి ఏ మేరకు నిధులను ఇచ్చామనే విషయమై ప్రజలకు వివరించడం ద్వారా టిడిపి చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని అమిత్‌షా పార్టీ నేతలకు సూచించారు.

బూత్‌స్థాయి నుండి పార్టీని పటిష్టం చేయాలి
ఏపీలో బూత్‌స్థాయి నుండి పార్టీని పటిష్టం చేయాలని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పార్టీ నేతలకు సూచించారు ..పార్లమెంటరీ నియోజకవర్గాలను మూడు క్లస్టర్లుగా విభజించి వాటికి ఇన్చార్జిలను నియమించినట్లు తెలిపారు. ఉత్తరాంధ్రలో నియోజకవర్గాలకు మురళీధర్‌రావును, మధ్యాంధ్రలో ఉన్న నియోజకవర్గాలకు విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ను, రాయలసీమలో నాలుగు నియోజకవర్గాలకు మహారాష్ట్ర మంత్రి వినోద్ తావ్డేను ఇప్పటికే బాధ్యులుగా నియమించినట్టు అమిత్‌షా చెప్పారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని తనకు వివరించినట్టు షా చెప్పారు.

మిత్రధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడితే చర్యలు
టిడిపి, బిజెపి మధ్య స్నేహం ఉంది. 2019 ఎన్నికల్లో కూడ పోటీ చేయాలని భావిస్తున్నట్టు బిజెపి జాతీయ అధ్యక్షుడు ఈ సమావేశంలో సంకేతాలు ఇచ్చారు. అయితే అదే సమయంలో టిడిపి నేతలను లక్ష్యంగా చేసుకొని బిజెపి నేతలు విమర్శలు గుప్పించడంపై బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తప్పుబట్టినట్టు చెప్పారు. మిత్ర ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడే నేతలపై చర్యలు తప్పవని హెచ్చరించారని సమాచారం.తాము కలిసే ఉన్నామని, తమ మధ్య ఎటువంటి ఇబ్బందులు లేవని ఏపీ బిజెపి అధ్యక్షుడు హరిబాబు చెప్పారు. ఏదైనా ఉన్నా పార్టీ పెద్దలు చర్చించి పరిష్కరించుకుంటారని హరిబాబు అభిప్రాయపడ్డారు.


అసెంబ్లీ సీట్ల పెంపుపై అమిత్‌దే నిర్ణయం
రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు విషయమై రెండు రాష్ట్రాల నేతలను అభిప్రాయం చెప్పాల్సిందిగా బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కోరారు. అయితే ఈ విషయంలో అమిత్ షాను నిర్ణయం తీసుకోవాల్సిందిగా నేతలు కోరారని సమాచారం. రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచితే అాధికారంలో ఉన్న పార్టీలకు ప్రయోజనం కలిగే అవకాశం మాత్రమే ఉంది.