విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెజవాడ దుర్గమ్మ దర్శనం?: కేసీఆర్‌కు ‘నో’ చెప్పిన ఏపీ

బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకోవాలనుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డుకుంది. దసరా ఉత్సవాల సందర్భంలోనే కేసీఆర్ దుర్గమ్మను దర్శించుకో

|
Google Oneindia TeluguNews

Recommended Video

CM KCR will not be able to fulfil his wish దుర్గమ్మ దర్శనం?: కేసీఆర్‌కు ‘నో’ఎంట్రీ | Oneindia Telugu

హైదరాబాద్/విజయవాడ: బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకోవాలనుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డుకుంది. దసరా ఉత్సవాల సందర్భంలోనే కేసీఆర్ దుర్గమ్మను దర్శించుకోవాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. అయితే, ఏపీ ప్రభుత్వం మాత్రం ఇందుకు అనుమతించలేదు.

ఏపీ ప్రభుత్వానికి కేసీఆర్..

ఏపీ ప్రభుత్వానికి కేసీఆర్..

తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత బెజవాడ దుర్గమ్మకు తన మొక్కులు చెల్లించుకుంటానని కేసీఆర్ చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దసరా పర్వదినం సందర్భంగా దుర్గమ్మను దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే మూలనక్షత్రం లేదా పంచమి లేదా దశమి రోజున దుర్గమ్మను దర్శించుకునేందుకు వీలు కల్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని కేసీఆర్ కోరారు.

అనుమతించని ఏపీ ప్రభుత్వం

అనుమతించని ఏపీ ప్రభుత్వం

అయితే, ఏపీ సీఎంఓ మాత్రం ఆయన పర్యటనకు అడ్డు చెప్పింది. దసరా తర్వాత ఏదైనా ఇతర రోజుల్లో అమ్మవారిని దర్శించుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రికి తెలియజేశారు. దీంతో కేసీఆర్ తన బెజవాడ పర్యటనను వాయిదా వేసుకున్నట్లు తెలిసింది.

దుర్గమ్మకు ముక్కుపుడక

దుర్గమ్మకు ముక్కుపుడక

ఇప్పటికే తిరుమల శ్రీవారికి తన మొక్కులు చెల్లించుకున్నారు కేసీఆర్..

తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన నేపథ్యంలో బెజవాడ కనకదుర్గకు ముక్కు పుడుక చేయిస్తానని మొక్కుకున్న విషయం తెలిసిందే.

రూపాయి కూడా కేటాయించని ప్రభుత్వం

రూపాయి కూడా కేటాయించని ప్రభుత్వం

దసరాను రాష్ట్ర పండగగా ప్రకటించినప్పటికీ కనకదుర్గ ఆలయ కార్యక్రమాల కోసం ఏపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ప్రకటించకపోవడం గమనార్హం. ఆలయ యాజమాన్యం మాత్రమే దసరా ఉత్సవాల కోసం రూ.14కోట్లను ఖర్చు చేస్తోంది.

English summary
Telangana state Chief Minister K. Chandrasekhar Rao will not be able to fulfil his wish of visiting the Kanakadurga temple in Vijayawada this Dasara to present a nose ring in fulfilment of his vow.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X