• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
LIVE

బురేవీ స్థానంలోనే ఆర్నాబ్ తుఫాను: తమిళనాడు ఏపీలకు భారీ వర్షసూచన

|

నివర్ తుఫాన్ మిగిల్చిన నష్టం నుంచి కోలుకోకముందే.. మరో తుఫాన్ వెంటాడబోతోంది. ఇప్పటికే అది బంగాళాఖాతంలో పురుడుపోసుకుంది కూడా. బంగాళాఖాతంలో ఆగ్నేయదిశగా ఏర్పడిన అల్పపీడనం.. తీవ్ర రూపాన్ని దాల్చింది. తీవ్ర అల్పపీడనంగా రూపుదిద్దుకుంది. క్రమంగా అది వాయుగుండంగా అనంతరం, తుఫాన్‌ను అవతరించడానికి అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నాయి.దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ, తమిళనాడుల్లో భారీ వర్షం కురుస్తుందని అభిప్రాయపడుతున్నారు.

తుఫాన్‌గా ఆవిర్భవించిన అనంతరం అది క్రమంగా తమిళనాడు దక్షిణ ప్రాంతం వైపు కదిలే అవకాశాలు కనిపిస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఫలితంగా తమిళనాడు, పుదుచ్చేరితో పాటు ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు కురుస్తాయని పేర్కొన్నారు. దీని ప్రభావంతో మంగళవారం నుంచే భారీ వర్షాలు పడుతాయని, 48 గంటల పాటు దాని తీవ్రత కొనసాగవచ్చని అంచనా వేస్తున్నట్లు పువియరాసన్ చెప్పారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఉష్ణోగ్రత సైతం భారీగా తగ్గుతుందని చెప్పారు.

ఇక నివార్ తుపానుకు సంబంధించి మినిట్‌-టూ- మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం..

Andhra Pradesh brace for cyclone Nivar live updates

Newest First Oldest First
1:41 AM, 8 Dec
తుపాను కారణంగా నష్టపోయిన ప్రజలు, రైతులకు తక్షణమే పరిహారం చెల్లించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
7:56 PM, 7 Dec
తుపాను కారణంగా తమిళనాడుతోపాటు పుదుచ్చేరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
4:57 PM, 7 Dec
కడప జిల్లాలో తుఫాను ధాటికి దెబ్బతిన్న పంట
9:14 AM, 7 Dec
రేపు నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు
9:13 AM, 7 Dec
ఇవ్వాల ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కృష్ణా, గుంటూరు, అనంతపురం, కర్నూలు, జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం
9:06 AM, 7 Dec
తమిళనాడు రాయలసీమలకు భారీ వర్షసూచన. నేడు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణశాఖ
9:05 AM, 7 Dec
బురేవీ తుఫాను బలహీనపడ్డ చోటే మరో తుఫాను. ఆర్నాబ్‌గా నామకరణం చేసిన బంగ్లాదేశ్
8:55 AM, 7 Dec
రాయలసీమలో బురేవి తుఫాను ఎఫెక్ట్, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు, అనంతపురం జిల్లాలో స్వల్పంగా కురుస్తున్న వర్షాలు
11:35 PM, 6 Dec
తమిళనాడులోని పలు ప్రాంతాల్లో అర్నబ్ తుపాను నేపథ్యంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు.
7:16 PM, 6 Dec
తమిళనాడులో వరద బాధితులకు అన్నదానం చేస్తున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు. అమ్మ క్యాంటీన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటోందని అన్నారు.
4:04 PM, 6 Dec
అర్నబ్ తుపాను కారణంగా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.
1:41 PM, 6 Dec
తమిళనాడు
తుఫాన్ నష్టాన్ని అంచనా వేయడానికి నియమించిన కేంద్ర బృందం చెన్నైకి చేరుకుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉప కార్యదర్శి ఈ బృందానికి సారథ్యాన్ని వహిస్తున్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం నష్టాన్ని అంచనా వేస్తుంది.
1:34 PM, 6 Dec
తమిళనాడు
బురెవి తుఫాన్ బలహీనపడిన గల్ఫ్ ఆఫ్ మన్నార్, హిందూ మహాసముద్రంలో ఆర్నబ్ తుఫాన్ ఏర్పడటానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
1:20 PM, 6 Dec
తమిళనాడు
నివర్ తుఫాన్ కారణంగా సంభవించిన నష్టాన్ని 3,758.55 కోట్ల రూపాయలుగా అంచనా వేసిన తమిళనాడు ప్రభుత్వం. బురెవి తుఫాన్ మిగిల్చిన నష్టం దీనికి అదనం.
1:07 PM, 6 Dec
తమిళనాడు
కొత్తగా ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. క్రమంగా ఇది తుఫాన్‌గా మారుతుందని, దీనికి ఆర్నబ్ అని పేరు పెట్టినట్లు తెలిపారు.
12:53 PM, 6 Dec
కేరళ
తుఫాన్ ప్రభావిత జిల్లాలైన పత్తినంథిట్ట, కోచ్చి, తిరువనంతపురంలల్లో కొనసాగుతోన్న సహాయక చర్యలు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాల కురిసే అవకాశం ఉందని హెచ్చరికలను జారీ చేసిన వాతావరణ శాఖ అధికారులు.
12:03 PM, 6 Dec
తమిళనాడు
తుఫాన్ వల్ల 75 గుడిసెలు నేలమట్టం అయ్యాయి. మరో రెండు వేలకు పైగా పూరి గుడిసెలు, పక్కా గృహాలు పాక్షికంగా ధ్వంసం అయ్యాయి. వందలాది పశువులు మరణించాయి. వాటికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించింది.
11:55 AM, 6 Dec
తమిళనాడు
బురెవి తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతోన్న సహాయ, పునరావాస చర్యలు. వరద సహాయక కార్యక్రమాల్లో నిమగ్నమైన ఉన్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు
11:20 AM, 6 Dec
తమిళనాడు
బురెవి తుఫాన్ ప్రభావం వల్ల సంభవించిన వేర్వేరు దుర్ఘటనల్లో తమిళనాడులో ఏడుమంది మరణించారు. ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులు ధృవీకరించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారాన్ని ప్రకటించింది.
10:40 AM, 6 Dec
కేరళ
అరేబియా సముద్రంలో ఏర్పడనున్న మరో అల్పపీడనం. ఈ నెల 10వ తేదీ నాటికి తుఫాన్‌గా మారే అవకాశాలు ఉన్నాయంటోన్న తిరువనంతపురంలోని భారత వాతావరణ కేంద్రం అధికారులు.
11:04 PM, 5 Dec
బురేవీ తుఫాను కారణంగా చనిపోయిన మృతుల కుటుంబాలకు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి రూ.10లక్షలు పరిహారం ప్రకటించారు.
3:42 PM, 5 Dec
బురేవి తుఫాను ఎఫెక్ట్‌తో భారీగా వర్షాలు. చిదరంబంలో జలదిగ్భంధంలో నటరాజ స్వామి ఆలయం
10:52 AM, 5 Dec
మరో 12 గంటల పాటు స్థిరంగా కొనసాగే అవకాశం. దక్షిణ తమిళనాడు జిల్లాలకు భారీ వర్ష సూచన
10:51 AM, 5 Dec
దక్షిణ తమిళనాడులో స్థిరంగా కొనసాగుతోన్న బురేవీ తుఫాను
9:10 PM, 4 Dec
బురేవి తుఫానుతో రామేశ్వరంలోని కొన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిపివేత
5:46 PM, 4 Dec
తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో బురేవీ తుఫాను ఎఫెక్ట్. ఈ రోజు భారీ వర్షాలు కురుస్తాయంటూ హెచ్చరికలు జారీ చేసిన వాతావరణశాఖ అధికారులు
1:57 PM, 4 Dec
పుదుచ్చేరి
బురేవి తుఫానుతో నీటమునిగిన కామరాజ్ నగర్‌లో పర్యటించిన ముఖ్యమంత్రి నారాయణ స్వామి
1:49 PM, 4 Dec
గత 24 గంటల్లో కురిసిన భారీ వర్షాలకు కడలూరులోని చిదంబరంలో ఉన్న నీట మునిగిన నటరాజ ఆలయం. 31 మిల్లిమీటర్ల వర్షపాతం ఇక్కడ నమోదైంది
1:32 PM, 4 Dec
తమిళనాడు
చెన్నైతో పాటు పరిసర జిల్లాలైన చెంగల్పట్టు, కంచీపురం, తిరువల్లూరులో ఈ రోజు రేపు భారీ వర్షాలు
1:24 PM, 4 Dec
తుఫాను పట్ల ప్రజలు అప్రమత్తతతో ఉండాలని దండోరా వేయిస్తున్న అధికారులు
READ MORE

English summary
Cyclone Nivar is expected to make landfall between Mamallapuram and Karaikal late on Wednesday with a wind speed of up to 145kmph, according to IMD.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X