విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏయులో ఏపి తొలి కేబినెట్ భేటీ: మెరుగులు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి మంత్రివర్గ సమావేశం జూన్ 12న ఉదయం 10.30గంటలకు విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ హాల్‌లో జరగనుంది. ఇప్పటికే కలెక్టరేట్, ఏయు టిఎల్‌ఎన్ సభాహాల్, ఏయు సెనేట్ హాల్‌ను పరిశీలించిన యంత్రాంగం చివరకు ఇసి హాల్‌లో క్యాబినెట్ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. 1954లో ఆంధ్ర రాష్ట్ర శాసనసభ సమావేశాలు జరిగిన ఏయు టిఎల్‌ఎల్ సభాహాల్‌లో మంత్రివర్గ సమావేశం జరుపాలని తొలుత భావించారు.

ఇందుకోసం టిఎల్‌ఎన్ హాలుకు అవసరమైన మరమ్మతులు చేశారు. ఏయు విసి జిఎస్‌ఎన్ రాజు, జిల్లా కలెక్టర్ ఆరోఖ్యరాజ్, ఇతర ఉన్నతాధికారులు దగ్గరుండి మరీ మరమ్మతులు చేయించారు. తొలుత కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మంత్రివర్గ సమావేశం ఉంటుందని భావించారు. అందుకు అనుగుణంగా కలెక్టరేట్‌ను ముస్తాబు చేశారు.

అయితే వాటికన్నా ఏయు ఈసి హాల్ అనుకూలంగా ఉంటుందని భావించిన అధికారులు అదే విషయాన్ని మంగళవారం రాత్రి ఏయును సందర్శించిన మంత్రి గంటా శ్రీనివాసరావుకు తెలిపారు. ఆయన అంగీకరించటంతో అక్కడే మంత్రివర్గ సమావేశం జరపాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈసి హాల్‌లో అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేస్తున్నారు.

కాగా మంత్రి వర్గ తొలి సమావేశాల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం ఉందని, ముఖ్యంగా విశాఖకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు వెలువడతాయని గంటా అన్నారు. ఈ సందర్భంగా ఏయు విసి ప్రొఫెసర్ జిఎస్‌ఎన్ రాజుతో మంత్రి సమావేశమయ్యారు. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఆంధ్రా విశ్వవిద్యాలయంలో నూతన ఆంధ్రప్రదేశ్ తొలి క్యాబినెట్ సమావేశాలు జరగడం శుభపరిణామమని విసి రాజు అన్నారు. రాష్ట్ర సమగ్ర వికాసానికి, అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాల్సిందిగా ఆయన కోరారు.

ఏపి తొలి కేబినెట్ భేటీ

ఏపి తొలి కేబినెట్ భేటీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి మంత్రివర్గ సమావేశం జూన్ 12న ఉదయం 10.30గంటలకు విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ హాల్‌లో జరగనుంది.

ఏపి తొలి కేబినెట్ భేటీ

ఏపి తొలి కేబినెట్ భేటీ

ఇప్పటికే కలెక్టరేట్, ఏయు టిఎల్‌ఎన్ సభాహాల్, ఏయు సెనేట్ హాల్‌ను పరిశీలించిన యంత్రాంగం చివరకు ఇసి హాల్‌లో క్యాబినెట్ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది.

ఏపి తొలి కేబినెట్ భేటీ

ఏపి తొలి కేబినెట్ భేటీ

1954లో ఆంధ్ర రాష్ట్ర శాసనసభ సమావేశాలు జరిగిన ఏయు టిఎల్‌ఎల్ సభాహాల్‌లో మంత్రివర్గ సమావేశం జరుపాలని తొలుత భావించారు.

ఏపి తొలి కేబినెట్ భేటీ

ఏపి తొలి కేబినెట్ భేటీ

ఇందుకోసం టిఎల్‌ఎన్ హాలుకు అవసరమైన మరమ్మతులు చేశారు. ఏయు విసి జిఎస్‌ఎన్ రాజు, జిల్లా కలెక్టర్ ఆరోఖ్యరాజ్, ఇతర ఉన్నతాధికారులు దగ్గరుండి మరీ మరమ్మతులు చేయించారు. తొలుత కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మంత్రివర్గ సమావేశం ఉంటుందని భావించారు.

ఏపి తొలి కేబినెట్ భేటీ

ఏపి తొలి కేబినెట్ భేటీ

అయితే వాటికన్నా ఏయు ఈసి హాల్ అనుకూలంగా ఉంటుందని భావించిన అధికారులు అదే విషయాన్ని మంగళవారం రాత్రి ఏయును సందర్శించిన మంత్రి గంటా శ్రీనివాసరావుకు తెలిపారు.

ఏపి తొలి కేబినెట్ భేటీ

ఏపి తొలి కేబినెట్ భేటీ

గంటా శ్రీనివాస రావు అంగీకరించటంతో అక్కడే మంత్రివర్గ సమావేశం జరపాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏయు ఈసి హాల్‌లో అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేస్తున్నారు.

ఏపి తొలి కేబినెట్ భేటీ

ఏపి తొలి కేబినెట్ భేటీ

మంత్రి వర్గ తొలి సమావేశాల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం ఉందని, ముఖ్యంగా విశాఖకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు వెలువడతాయని గంటా అన్నారు.

ఏపి తొలి కేబినెట్ భేటీ

ఏపి తొలి కేబినెట్ భేటీ

ఈ సందర్భంగా ఏయు విసి ప్రొఫెసర్ జిఎస్‌ఎన్ రాజుతో మంత్రి సమావేశమయ్యారు. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఆంధ్రా విశ్వవిద్యాలయంలో నూతన ఆంధ్రప్రదేశ్ తొలి క్యాబినెట్ సమావేశాలు జరగడం శుభపరిణామమని విసి రాజు అన్నారు.

English summary
The first meeting of the new Council of Ministers of Andhra Pradesh will be held at 10.30 AM on June 12 on Andhra University campus in port city of Visakhapatnam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X