విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమరావతి వైపు: రోడ్ల విస్తరణ, గుంటూరులో సీఎం క్యాంప్ ఆఫీసు ఇక్కడే..! (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: విజయావడ నుంచి పరిపాలను సాగించే దిశగా ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగా రహదారులు, విద్యుత్తు, వసతి, నవ్యాంధ్ర రాజదానిలో అత్యంత కీలకమైన సౌకర్యాల అభివృద్ధిపై దృష్టి సారించింది. పరిపాలన నవ్యాంధ్ర నూతన రాజధానికి తరలించే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది.

మంత్రులు, ఉన్నతాధికారుల కోసం గుంటూరులోని నాగుర్జున యూనివర్సిటీకి ఎదురుగా ఉన్న ఏజేఎం రెయిన్ ట్రీ పార్కుతో ఒప్పందం కదుర్చుకుని అందులోని 256 ప్లాట్లను, 26 విల్లాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.

స్వాధీనం చేసుకున్న వాటిలో ఐఏఎస్, సీనియర్ అధికారులు నివాసాలుగా వినియోగించనున్నారు. మంత్రులకు విల్లాలు కేటాయించనున్నారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో రెయిన్ ట్రీ పార్కులోని ఒక విల్లాలో ఆయన బస చేశారు.

ఇప్పుడు అదే విల్లాను గుంటూరులో ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసుగా వినియోగించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని ఏపీ సచివాలయానికి చెందిన కొన్ని విభాగాల నుంచి కంప్యూటర్లు, ఇతర పరికరాలను అమరావతికి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

అమరావతి వైపు: రోడ్ల విస్తరణ, గుంటూరులో సీఎం క్యాంప్ ఆఫీసు ఇక్కడే..!

అమరావతి వైపు: రోడ్ల విస్తరణ, గుంటూరులో సీఎం క్యాంప్ ఆఫీసు ఇక్కడే..!

నవ్యాంధ్ర రాజధానికి నాణ్యమైన విద్యుత్తుని అందించేందుకు గాను ట్రాన్స్ ఫార్మర్లు, సోలార్ పార్కుల ఏర్పాటు కోసం గ్రామీణ విద్యుద్దీకరణ లిమిటెడ్ (ఆర్‌ఈసీ) నుంచి రూ. 9000 కోట్లు రుణం తీసుకోనున్నారు. ఈరోజు ఢిల్లీలో సీఎం చంద్రబాబు సమక్షంలో ఆర్ఈసీతో జెన్‌కో, ట్రాన్స్‌కో ఈ రుణ ఒప్పందంపై ఎంవోయూ కుదుర్చుకోనుంది.

అమరావతి వైపు: రోడ్ల విస్తరణ, గుంటూరులో సీఎం క్యాంప్ ఆఫీసు ఇక్కడే..!

అమరావతి వైపు: రోడ్ల విస్తరణ, గుంటూరులో సీఎం క్యాంప్ ఆఫీసు ఇక్కడే..!

ఏపీలోని అన్ని జిల్లా కేంద్రాల నుంచి విజయవాడకు వెళ్లే దారులు అమరావతి పరిధిలోని అన్ని రహదారులను అభివృద్ధి చేయనున్నారు. తొలి దశలో భాగంగా రూ. 222 కోట్లతో రోడ్ల నిర్మాణం, విస్తరణ చేపట్టాలని ఆర్ అండ్ బీ ప్రణాళికలు తయారు చేసి ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపించింది.

అమరావతి వైపు: రోడ్ల విస్తరణ, గుంటూరులో సీఎం క్యాంప్ ఆఫీసు ఇక్కడే..!

అమరావతి వైపు: రోడ్ల విస్తరణ, గుంటూరులో సీఎం క్యాంప్ ఆఫీసు ఇక్కడే..!

ఇందులో భాగంగా తుళ్లూరు నుంచి విజయవాడ, ఆపై ప్రకాశం బ్యారేజీ, గుంటూరు వరకు రోడ్లను విస్తరించనున్నారు. రాజధాని నిర్మాణ పనులు ప్రారంభం కాక ముందే రోడ్ల నిర్మాణం ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఆర్ ఆండ్ బీ ప్రతిపాదించిన కొన్ని రోడ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చింది. ఉండవల్లి-ఎర్రబాలెం, మంగళగిరి-రాయపూడి, తాడికొండ-రాయపూడి, గుంటూరు-అమరావతి రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం అనుమతించింది.

అమరావతి వైపు: రోడ్ల విస్తరణ, గుంటూరులో సీఎం క్యాంప్ ఆఫీసు ఇక్కడే..!

అమరావతి వైపు: రోడ్ల విస్తరణ, గుంటూరులో సీఎం క్యాంప్ ఆఫీసు ఇక్కడే..!

వీటితో పాటు సత్తెనపల్లి-అమరావతి, ధరణికోట-దొడ్లేరు, బెల్లంకొండ-దొడ్లేరు, తుళ్లూరు-అమరావతి, మంగళగిరి-పెదపరిమి రహదారులను కూడా విస్తరించనున్నారు. ఇక రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన తేదీ సమీపిస్తున్న తరుణంలో సీఆర్‌డీఏ పరిధిని పెంచుతూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

 అమరావతి వైపు: రోడ్ల విస్తరణ, గుంటూరులో సీఎం క్యాంప్ ఆఫీసు ఇక్కడే..!

అమరావతి వైపు: రోడ్ల విస్తరణ, గుంటూరులో సీఎం క్యాంప్ ఆఫీసు ఇక్కడే..!

7068.38 నుంచి 8352 చదరపు కిలోమీటర్లకు సీఆర్‌డీఏ పరిధిని పెంచుతూ మున్సిపల్ శాఖ జీవో జారీచేసింది. దీని ప్రకారం కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 58 మండలాలను సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చాయి. దీంతోపాటుగా గతంలో పాక్షికంగా సీఆర్‌డీఏ పరిధిలో ఉండే మండలాలను కూడా పూర్తిగా సీఆర్‌డీఏ పరిధిలోకి తీసుకువచ్చింది.

 అమరావతి వైపు: రోడ్ల విస్తరణ, గుంటూరులో సీఎం క్యాంప్ ఆఫీసు ఇక్కడే..!

అమరావతి వైపు: రోడ్ల విస్తరణ, గుంటూరులో సీఎం క్యాంప్ ఆఫీసు ఇక్కడే..!

దీంతో కృష్ణాజిల్లాలోని జగ్గయ్య పేట మున్సిపాలిటీతో సహా 123 గ్రామాలు సీఆర్‌డీఏ పరిధిలోకి రానున్నాయి. సీఆర్‌డీఏ పాలకమండలిని సైతం ప్రభుత్వం పునర్ వ్యవస్థీకరించింది. అమరావతి సిటీ పోలీసు కమిషనరేట్ పరిధిలోకి 82 పోలీస్ స్టేషన్లను చేర్చాలని నిర్ణయించారు.

English summary
Andhra Pradesh Capital is ready for Administration.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X