వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుపై కామెంట్లకు వివరణ ఇచ్చుకున్న ద్వివేది: ఇకనైన ఆగుతుందా రచ్చ?

|
Google Oneindia TeluguNews

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే తనకు గౌరవం ఉందని ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది వివరణ ఇచ్చారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న సమయంలో ముఖ్యమంత్రికి అధికారాలు ఉండవని తాను ఎప్పుడూ చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో నోరు జారాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. వివిధ శాఖలపై సమీక్షలు చేపట్టే అధికారం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు అధికారాలు లేవని గోపాలకృష్ణ ద్వివేది వ్యాఖ్యానించారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన వివరణ ఇచ్చుకున్నారు. తాను అలా ఎప్పుడూ అనలేదని, ఆ అవసరం కూడా తనకు లేదని తేల్చి చెప్పారు.

Andhra Pradesh CEO refuses to respond to CM’s letter to Election Commission

ఏడు దశల పోలింగ్ ముగిసిన తరువాతే రీపోలింగ్:

దేశవ్యాప్తంగా ఏడు దశల్లో పోలింగ్ పూర్తయిన తరువాతే రీ పోలింగ్ నిర్వహిస్తామని ద్వివేదీ తెలిపారు. ప్రస్తుతం రెండు దశల్లో పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. మూడోదశ పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటలకు ఆరంభం కానుంది. తొమ్మిది రాష్ట్రాల్లో 71 లోక్ సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించబోతున్నారు. అనంతరం వచ్చేనెల 6, 12, 19వ తేదీల్లో మిగిలిన మూడు దశల్లో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. 23వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. వచ్చే నెల 20వ తేదీ నుంచి 23వ తేదీ లోపు ఎప్పుడైనా రీపోలింగ్ నిర్వహిస్తామని అన్నారు. రాష్ట్రంలో అయిదు చోట్ల రీ పోలింగ్ చేపట్టనున్నట్లు ద్వివేదీ వెల్లడించారు,

ఈసీ నిబంధనలను అనుసరిస్తాం

కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్దేశించిన ప్రవర్తనా నియమావళి ప్రకారమే అధికారులు, ప్రజాప్రతినిధులు నడుచుకోవాల్సి ఉంటుందని ద్వివేదీ చెప్పారు. ఎవరు తమను ప్రశ్నించినా, ఇదే సమాధానం ఇస్తామని అన్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా సమీక్షలు నిర్వహించుకునే అధికారం చంద్రబాబుకు ఉందా? లేదా? అనేది తమ పరిధిలో లేదని అన్నారు. అసలు ఈ విషయమే ప్రస్తావనకు రాలేదని అన్నారు. ఈ అంశాన్ని మేం విస్తృతంగా ప్రచారం చేసినట్లు కేద్ర చంద్రబాబు రాసిన లేఖలో పేర్కొనడం ఆశ్యర్యంగా ఉందన్నారు. రాష్ట్రంలో వివిధ కారణాల వల్ల ఐదు కేంద్రాల్లో రీపోలింగ్‌ జరపాలని ఈసీకి నివేదిక పంపామని, కౌంటింగ్‌లోపు ఎప్పుడైనా రీపోలింగ్‌ నిర్వహించే అవకాశం ఉందని ద్వివేదీ చెప్పారు.

English summary
Refusing to respond to the letter shot off by Chief Minister and TDP supremo N Chandrababu Naidu to the Election Commission, Chief Electoral Officer Gopal Krishna Dwivedi on Friday maintained that he is implementing the directions of the EC. In his letter to the CEC, Naidu alleged that the CEO was preventing him from organising reviews and urged the EC to issue necessary directions to the CEO to enable him to hold reviews on important matters. When asked for his response on the matter, Dwivedi maintained that he will not speak on the letter written by Naidu to the CEC.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X