వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం జగన్ రిక్వెస్టుకు కేంద్రం అంగీకారం - ఏడాది చివరిదాకా సీఎస్ నీలం సాహ్నినే

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభ్యర్థనకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలాన్ని మరో మూడు నెలలు పెంచాలన్న సీఎం రిక్వెస్టుకు కేంద్ర శిక్షణ, సిబ్బంది శాఖ(డీవోపీటీ) గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు శుక్రవారం తాజా ఉత్తర్వులు జారీ చేసింది.

ఐఏఎస్ 1984 బ్యాచ్ కు చెందిన నీలం సాహ్ని పదవీకాలం మొన్న జూన్ లోనే ముగిసింది. అయితే రాష్ట్రంలో పరిస్థితులు, సీనియర్ అధికారుల కొరత తదితర అంశాల నేపథ్యంలో నీలం పదవీకాలాన్ని పెంచాలంటూ సీఎం జగన్ కేంద్రానికి లేఖ రాయడం, ఆ మేరకు సెప్టెంబర్ 30 వరకు ఎక్స్ టెన్షన్ కల్పిస్తూ డీవోటీపీ ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే.

ఏపీలో కొత్త జిల్లాలు: ఆ మెలికకు అర్థమేంటి? - మూడు నెలల డెడ్ లైన్ తో కమిటీ - నీలం వెళ్లేలోపే..ఏపీలో కొత్త జిల్లాలు: ఆ మెలికకు అర్థమేంటి? - మూడు నెలల డెడ్ లైన్ తో కమిటీ - నీలం వెళ్లేలోపే..

andhra pradesh Chief Secretary Nilam Sawhney service extended for 3 months

Recommended Video

AP Colleges To Reopen From October 15 | Assistant Professors Recruitment : AP CM YS Jagan

అయితే, జిల్లాల పునర్విభజనకు ప్రక్రియలో సీఎస్ పాత్ర కీలకం కావడంతో మరోసారి పదవీ కాలాన్ని పెంచాలంటూ సీఎం జగన్ కేంద్రానికి లేఖ రాశారు. రెండో ఎక్స్ టెన్షన్ కు కూడా ఆమోదం లభించడంతో రాష్ట్ర సాధారణ పరిపాలన విభాగం శుక్రవారం సీఎస్ పదవీకాలంపై ఉత్తర్వులిచ్చింది.

కొత్త ఉత్తర్వుల మేరకు 2020, డిసెంబర్ 31 వరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని కొనసాగనున్నారు. మరోవైపు, కొత్త జిల్లాల ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ఆర్థిక శాఖ ఓ అధ్యయన కమిటీని శుక్రవారం ప్రకటించింది. సీఎస్ నేతృత్వంలోని ఆ కమిటీలో సీసీఎల్ఏ కమిషనర్, జీఏడీ కార్యదర్శి, ప్రణాళికశాఖ కార్యదర్శి, సీఎంవో అధికారి, ప్రిన్సిపల్ ఫైన్సాన్స్ సెక్రటరీ సభ్యలుగా కొనసాగుతారని తెలిపింది. కమిటీ కన్వీనర్‌గా ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ ఉంటారని, మూడు నెలల్లోగా కమిటీ తన నివేదికను ఇవ్వాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

English summary
Nilam Sawhney, the Andhra Pradesh government's chief secretary, got an extension of her term in office for three months. as center agrees to chief minister ys jagan request, state govt issued an order on friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X