• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తల్లికి దూరమైన దీప్తి, ఉన్నత విద్యకు సహయం చేస్తానన్న ఐజీ

By Narsimha
|

పాలకొల్లు: బ్యూటీషీయన్ శిరీష కూతురు దీప్తిని సీఐడి ఐజీ సునీల్‌కుమార్ దత్తత తీసుకొన్నాడు. ఉన్నత చదువులు చదివేందుకుఆయన ముందుకు వచ్చాడు. గత నెల 12వ,తేదిన శిరీష ఆర్‌జె స్టూడియోలో ఆత్మహత్య చేసుకొంది.

కుకునూర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి బ్యూటీషీయన్ శిరీషపై అత్యాచారానికి ప్రయత్నించాడు. దీంతో మనోవేదనకు గురై ఆమె ఆత్మహత్య చేసుకొందని పోలీసులు నిర్ధారించారు.

శిరీష ఆత్మహత్య కేసు రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ కేసు రోజుకో మలుపుతిరిగింది. శిరీష మృతిపై ఆమె కుటుంబసభ్యులు అనేక అనుమానాలను వ్యక్తం చేశారు. అయితే ఈ అనుమానాలను పోలీసులు కొట్టిపారేశారు.

శిరీష ఆత్మహత్య చేసుకోలేదని హత్యేనని కుటుంబసభ్యులు ఆరోపించారు.అయితే ఈ ఆరోపణల్లో వాస్తవాలు లేవని పోలీసులు తేల్చిచెప్పారు. ఈ మేరకు శాస్త్రీయంగా రుజువు చేసేందుకు తమ వద్ద ఆధారాలున్నాయని పోలీసులు ప్రకటించారు.

శిరీష కూతురు దీప్తి ఉన్నత చదువులకు ఆర్థికసహయం

శిరీష కూతురు దీప్తి ఉన్నత చదువులకు ఆర్థికసహయం

బ్యూటీషీయన్ శిరీష కూతురు దీప్తిని ఉన్నత చదువులు చదివించేందుకు అవసరమైన సహయాన్ని అందించేందుకు ఏపీ సీఐడి ఐజీ సునీల్‌కుమార్ ముందుకు వచ్చారు. పాలకొల్లులోని ఆదిత్య పాఠశాలలో దీప్తిని ఆయన ఏడోతరగతిలో చేర్పించారు. డిగ్రీవరకు ఆమె చదువులకు అయ్యే ఖర్చును భరిస్తానని ఆయన ప్రకటించారు. శిరీష భర్త హైద్రాబాద్ బేగంపేటలోని ఓ స్వచ్చంద సంస్థలో వంటమనిషిగా పనిచేస్తున్నాడు

 తల్లికి దూరమైన దీప్తి

తల్లికి దూరమైన దీప్తి

బ్యూటీషీయన్ శిరీష మృతితో దీప్తికి తల్లి బిడ్డగా మారింది. రాజీవ్ , శ్రవణ్‌లతో కలిసి కుకునూర్‌పల్లికి వెళ్ళిన శిరీష అనుకోనిపరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడింది. ఆలస్యంగా ఇంటికివస్తానని భర్తకు ఫోన్ చేసిన చెప్పిన శిరీష శవంగా మారింది.ఈ ఘటనతో దీప్తి తల్లికి దూరమైంది.తన ఆలనాపాలనా చూసుకోవాల్సిన సమయంలోనే దీప్తికి తల్లికి దూరం కావడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.

  Hyderabad beautician Sirisha's Real Story : Exclusive Audio Tape Leaked
  శిరీష మృతితో హైద్రాబాద్ నుండి పశ్చిమగోదావరి జిల్లాకు

  శిరీష మృతితో హైద్రాబాద్ నుండి పశ్చిమగోదావరి జిల్లాకు

  గత నెల 12వ,, తేదిన శిరీష ఆర్‌జె స్టూడియోలో ఆత్మహత్య చేసుకొని మరణించింది.అయితే ఆమె మరణించిన తర్వాత ఆమె స్వగ్రామంలో అంత్యక్రియలను నిర్వహించారు. అంత్యక్రియల నిర్వహణ సందర్భంగా దీప్తితోపాటు శిరీష భర్త సతీష్‌చంద్ర కూడ పశ్చిమగోదావరి జిల్లా చేరుకొన్నారు.అయితే ఈ ఘటనపై రోజుకో రీతిలో వార్తలు వచ్చిన నేపథ్యంలో కుటుంబసభ్యులు కూడ అనుమానాలను వ్యక్తం చేశారు.అయితే ఈ అనుమానాలను కూడ పోలీసులు కొట్టిపారేశారు.శిరీష అంత్యక్రియల సమయం నుండి దీప్తి పశ్చిమగోదావరి జిల్లాలోనే ఉంటుంది.

  శిరీష కేసులో విచారణ పూర్తి

  శిరీష కేసులో విచారణ పూర్తి

  బ్యూటీషీయన్ శిరీష కేసులో విచారణను పూర్తిచేశారు పోలీసులు. శిరీష ఆత్మహత్య చేసుకొందని నిర్ధారించారు.అంతేకాదు ఆమెపై అత్యాచారం జరగలేదని తేల్చారు. కానీ, ఆమెపై అత్యాచారయత్నం జరిగిందని తేల్చారు.అయితే రాజీవ్, శ్రవణ్‌లకు ఈ కేసులో శిక్షపడేలా జాగ్రత్తలు తీసుకొంటామని పోలీసులుచెప్పారు. బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో ఈ నెల 11వ, తేదిన విచారణ జరగనుంది. అయితే నాలుగురోజుల క్రితం బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఈ విషయమై కోర్టు ఈ నెల 11న, విచారణ నిర్వహించనుంది.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Andhra pradesh CID IG Sunil Kumar took deepthi's responsibility.Deepthi is daughter of beautician Sirisha, who is recently suicide at RJ studio in Hyderabad in last month 12.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more