• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

యోగా సాధనలో చంద్రబాబు: కళ్లు మూసుకున్నారు (ఫోటోలు)

By Nageswara Rao
|

విజయవాడ: ప్రజలకు ఆనందం, ఆరోగ్యం అందించే శాస్త్ర విజ్ఞానం యోగా మాత్రమేనని, క్రమశిక్షణ కలిగిన నడవడికి యోగాభ్యాసం అవసరమని సిఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని బందరు రోడ్డులో ఉన్న ఒక కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన సామూహిక యోగాభ్యాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల, మత, ప్రాంత, వయోబేధం లేకుండా ప్రతి ఒక్కరూ యోగా ఆచరించటం ద్వారా ఏకాగ్రత పెంచుకోవచ్చన్నారు. యోగాను రాష్ట్ర ఆరోగ్యశాఖలో భాగంగా తీసుకురాబోతున్నానని చెబుతూ తొలిదశగా రూ.25 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు.

యోగా సాధనలో చంద్రబాబు

యోగా సాధనలో చంద్రబాబు

భారతీయ వారసత్వ సంపదైన యోగాను ప్రపంచ దేశాలు అనుసరించేలా చేయటంలో ప్రధాని మోడీ కృతకృత్యులు కాగలిగారన్నారు. ఆ రోజు స్వావిు వివేకానంద తన వాగ్ధాటితో భారత కీర్తిని, నేడు ప్రధాని నరేంద్రమోడీ యోగా గొప్పతనాన్ని చాటారని కొనియాడారు.

యోగా సాధనలో చంద్రబాబు

యోగా సాధనలో చంద్రబాబు

మంచి నడవడిని, మంచి కోరికలను వృద్ధిచేసే లక్షణం యోగాకు ఉందంటూ ఇప్పటికే యోగా ఆచరించి ప్రారంభించినవారు మున్ముందు కూడా కొనసాగించాలని కోరారు. వీరిని చూసి ఇతరులు కూడా దీన్ని ప్రారంభించాలని కోరారు.

యోగా సాధనలో చంద్రబాబు

యోగా సాధనలో చంద్రబాబు

విలువలతో కూడిన జీవన విధానం భారతీయుల సొంతమన్నారు. గతంలోనే తాను మంత్రులకు, ఉన్నతాధికారులకు యోగాలో శిక్షణ ఇప్పించిన విషయాన్ని బాబు గుర్తు చేశారు.

యోగా సాధనలో చంద్రబాబు

యోగా సాధనలో చంద్రబాబు

యోగా దినోత్సవం సందర్భంగా 192 దేశాల్లో అందరూ ఒకేసారి యోగాలో పాల్గొనడం మనందరికీ గర్వకారణమన్నారు. క్రమశిక్షణ, విలువలతో కూడిన జీవితానికి యోగా ఉపకరిస్తుందని..వీటి ద్వారానే జపాన్‌, సింగపూర్‌ వంటి దేశాలు నేడు ఎంతో అభివృద్ధిని సాధించాయని వివరించారు.

యోగా సాధనలో చంద్రబాబు

యోగా సాధనలో చంద్రబాబు

మన కుటుంబమే మన బలంఅందరూ అనుకున్నట్లు వస్తు వినియోగంలో ఆనందం ఉండదు. మన కుటుంబ వ్యవస్థలోనే నిజమైన సంతోషం ఇమిడి ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. ఇంట్లో భార్యాపిల్లలతో కలిసి భోజనం చేస్తే వచ్చే ఆనందం ప్రపంచంలో ఎక్కడా లేదని చెప్పారు.

 యోగా సాధనలో చంద్రబాబు

యోగా సాధనలో చంద్రబాబు

పలు దేశాల్లో సావూజిక భద్రతా పథకాలుంటే మనకు మన కుటుంబమే పెద్ద భద్రత అన్నారు. మన కుటుంబవ్యవస్థను చూసి అమెరికాలో కూడా అలాగే పాటిస్తున్నారని, పిల్లల కోసం పొదుపు చేస్తున్నారని చెప్పారు. ఈ గొప్ప వారసత్వంతో రానున్న 20-30 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే ఉన్నతస్థాయికి ఎదుగుతుందని స్పష్టం చేశారు.

 యోగా సాధనలో చంద్రబాబు

యోగా సాధనలో చంద్రబాబు

ఉద్యోగులందరికీ యోగాలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. జపాన్ స్ఫూర్తితో రాష్ట్రాన్ని దేశంలో మొదటిస్థానంలో నిలుపుతానన్నారు.

 యోగా సాధనలో చంద్రబాబు

యోగా సాధనలో చంద్రబాబు

క్రమశిక్షణతో కష్టపడి పని చేస్తే ఏదైనా సాధ్యమని సిఎం చంద్రబాబు అన్నారు. ప్రముఖ మనో విశ్లేషకులు డాక్టర్ పిఎస్ రావు రచించిన విజేత చంద్రబాబు పుస్తకాన్ని ఇదే వేదికపై నుంచి ఆయన ఆవిష్కరిస్తూ ఎన్టీఆర్ నుంచే తాను క్రమశిక్షణ నేర్చుకున్నానని అన్నారు.

 యోగా సాధనలో చంద్రబాబు

యోగా సాధనలో చంద్రబాబు

తొలుత అరగంటపాటు 2 వేలమంది బాలబాలికలు చేసిన యోగాలో సిఎం సైతం పాల్గొన్నారు. ఆయనతోపాటు మంత్రులు యోగాసనాలు ఆచరించారు.

యోగా సాధనలో చంద్రబాబు

యోగా సాధనలో చంద్రబాబు

కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, కామినేని శ్రీనివాస్, రావెల కిషోర్‌బాబు, కె అచ్చెన్నాయుడు, పలువురు ఎంపీలు పాల్గొన్నారు.

యోగా సాధనలో చంద్రబాబు

యోగా సాధనలో చంద్రబాబు

ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని బందరు రోడ్డులో ఉన్న ఒక కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన సామూహిక యోగాభ్యాసంలో పాల్గొన్న ప్రభుత్వ అధికారులు.

యోగా సాధనలో చంద్రబాబు

యోగా సాధనలో చంద్రబాబు

ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని బందరు రోడ్డులో ఉన్న ఒక కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన సామూహిక యోగాభ్యాసంలో పాల్గొన్న విద్యార్ధులు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu on Sunday announced that the state government will provide Rs 25 crores for conduction of regular yoga programmes in the state by the AYUSH department.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more