విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అన్ని మతాల్లో సూర్యారాధన, లేనిపోని అపోహలు, సూర్యుడి జస్టిస్ చక్రవర్తి: చంద్రబాబు

|
Google Oneindia TeluguNews

Recommended Video

Surya Aaradhana : ఏపీ బ్రాండ్ అంబాసిడర్ 'సూర్యుడు'

విజయవాడ: ఏపీకి బ్రాండ్ అంబాసిడర్ సూర్యుడు అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం అన్నారు. విజయవాడ మున్సిపల్ స్టేడియంలో సూర్యారాధన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు.

చంద్రబాబును ఆకాశానికెత్తిన సోము వీర్రాజు, కానీచంద్రబాబును ఆకాశానికెత్తిన సోము వీర్రాజు, కానీ

సూర్యారాధన ప్రజాహిత వేడుక అన్నారు. అన్ని మతాల్లోను సూర్యునికి ప్రాధాన్యం ఉందని చెప్పారు. అరబ్ దేశాల్లో షమ్స్ అనే పేరుతో ఆరాధిస్తారని, నీరు - చెట్టు, జలసిరికి హారతి, వనం - మనం, ఏరువాక కార్యక్రమాలను ప్రకృతి ఆరాధనలో భాగంగా చేపట్టామన్నారు.

Andhra Pradesh CM Chandrababu Naidu on Sunday launches Surya Aaradhana

సూర్యకాంతి ద్వారా ఎన్నో అనారోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. సూర్యుడు నిత్య చైతన్య శక్తి అని చెప్పారు. తూర్పు తీర ప్రాంతంగా ఏపీ నుంచే సూర్యుడు ఉదయిస్తున్నందున సన్ రైజ్ స్టేట్‌గా నినాదం ఇచ్చామని చెప్పారు.

సూర్యుడిని ఆరాధిస్తే ఆరోగ్యంగా, మానసికంగా వృద్ధిని సాధిస్తామన్నారు. చైతన్యమూర్తి అయిన సూర్యుడిని ఆరాధిస్తే మనం నిత్య ప్రేరణ పొందవచ్చని చెప్పారు. సూర్యుడు జస్టిస్ చక్రవర్తి లాంటివాడన్నారు. పేదా, గొప్పా అనే తేడా లేకుండా అందరినీ సమానంగా చూస్తాడన్నారు.

460 కోట్ల సంవత్సరాల వయసున్న సూర్యుడి నుంచి మనం రోజూ శక్తిని పొందుతున్నామని చెప్పారు. ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకొని ముందుకు వెళ్లాలన్నారు. ప్రకృతిని, సాంకేతికతను సమన్వయం చేసుకోవాలన్నారు. ఈ రెండు మానవ మనుగడకు అవసరమన్నారు.

సూర్యారాదన ఏ మతానికి సంబంధించిన అంసం కాదన్నారు. కొందరు దీనిపై లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారన్నారు. సూర్యుడిని అరబ్ దేశాల్లో ఆరాధిస్తారని, బైబిల్లో ప్రాధాన్యత ఉందని, అలాగే హిందువులు పూజిస్తారని చెప్పారు.

రాష్ట్రంలో సౌరశక్తితో 5వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నామని చెప్పారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా 1000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి అవుతోందన్నారు. ఆ తర్వాత హిందూ, ముస్లీం, క్రైస్తవ ఆచారాలను అనుసరించి ప్రార్థనలు నిర్వహించారు. విద్యార్థులు ఆసనాలు చేసి సూర్యారాధన చేశారు.

English summary
Andhra Pradesh Chief Minister Chandrababu Naidu on Sunday launched 'Surya Aaradhana' (Sun worship) programme in Vijayawada to promote solar energy and reduce pollution.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X