నంద్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కర్నూలులో ఘోరం: గర్భసంచిలో శిశువు తల.. మొండెం మాత్రం బయటికి: 80 కిలోమీటర్లు ట్రావెల్..నరకం

|
Google Oneindia TeluguNews

కర్నూలు: కర్నూలు జిల్లా నంద్యాలలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వైద్య రంగానికే మచ్చ తీసుకొచ్చేలా వ్యవహరించారు అక్కడి గైనకాలజిస్ట్. గర్భంలోనే కన్నుమూసిన ఓ శిశువును వెలికి తీసే ప్రయత్నంలో తలను కోసి వేశారు. తలను వేరు చేసి, మొండేన్ని బయటికి తీశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధిత తల్లి కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ధర్నా చేశారు. బాధ్యులపై కఠిన చర్యలను తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.

బాధితురాలి పేరు శ్రీలక్ష్మి. కర్నూలు జిల్లా మిడ్తూరు మండలం అలగనూరుకు చెందిన ఆమె ఏడునెలల గర్భిణి. పురిటినొప్పులు తీవ్రం కావడంతో ఆమెను నంద్యాలలోని ప్రభుత్వ మెటర్నిటీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆమెను పరీక్షించిన గైనకాలజిస్ట్..కడుపులోనే బిడ్డ మరణించినట్లు తెలిపారు. శిశువు మృతదేహాన్ని వెలికి తీయడానికి శస్త్ర చికిత్స చేశారు. గర్భసంచిలో తల ఇరుక్కుని పోవడం వల్ల శరీరం నుంచి వేరు చేశారు. తలను, మొండేన్ని వేరు చేశారు.

 Andhra Pradesh: Doctors cut head of baby during cesarean in Nandyal

గర్భసంచిలో ఇరుక్కుని పోయిన తలను వెలికి తీయడంలో గైనకాలజిస్ట్ విఫలం అయ్యారు. తోటి డాక్టర్లు ప్రయత్నించినప్పటి సాధ్యం కాలేదు. పొరపాటు చోటు చేసుకుంటే తల్లి ప్రాణానికే ప్రమాదమని భావించిన డాక్టర్లు శ్రీలక్ష్మిని వెంటనే అంబులెన్స్‌లో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గర్భసంచిలో శిశువు తల, పక్కనే మొండెంతో 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన దుస్థితిని ఎదుర్కొందామె. కర్నూలు ఆసుపత్రిలో మరోసారి శస్త్ర చికిత్స చేశారు డాక్టర్లు. శిశువును తలను బయటికి తీశారు.

Recommended Video

Doctors Declare April 23 As Black Day | ప్రాణాలకు తెగించి వైద్యం చేస్తుంటే దాడులు చేస్తారా ?

ఈ ఘటన పట్ల శ్రీలక్ష్మి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆసుపత్రి ముందు బైఠాయించారు. డాక్టర్ల నిర్వాకం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. శిశువు ప్రాణాలతో లేదని తమకు ముందుగానే తెలియజేశారని, అయినప్పటికీ.. మృత శిశువును వెలికి తీయడంలో గైనకాలజిస్ట్ అమానవీయంగా ప్రవర్తించారని మండిపడ్డారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ.. డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ ఘటన పట్ల కర్నూలు జిల్లా అధికార యంత్రాంగం విచారణకు ఆదేశించింది. బాధ్యులపై కఠిన చర్యలను తీసుకుంటామని జిల్లా వైద్యాధికారులు తెలిపారు.

English summary
Doctors at the Government Maternity Hospital, Nandyal in Kurnool district cut the head of an infant during a cesarean. The doctors have come under severe criticism. It is reported that the pregnant woman Srilakshmi from Alaganuru village of Miduturu mandal was admitted to the Maternity Hospital at Nandyal in Kurnool district with labour pains. The doctors at the hospital told the woman and her relatives that c-section was a safer option as the baby’s position had changed. The woman was then administered anesthesia. According to the doctors, the lady delivered a breech baby ( when a baby is born bottom first instead of head first). This forced the doctors to severed head, hospital claimed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X