వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిమ్మగడ్డ వ్యవహారంలో మరో ట్వీస్ట్: సర్క్యులర్ వెనక్కి తీసుకున్న ఏపీ ఈసీ, ఏజీ మాట్లాడిన కాసేపటికే...

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ బాధ్యతలు తీసుకుంటున్నట్టు ఏపీ ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. అయితే నిమ్మగడ్డను బాధ్యతలు స్వీకరించాలని హైకోర్టు చెప్పలేదని.. దీనిపై సుప్రీంకోర్టుకు వెళతామని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ శనివారం మీడియాతో మాట్లాడారు. కాసేపటికే... ఏపీ ఈసీ వెనక్కి తగ్గింది. నిన్న నిమ్మగడ్డ బాధ్యతలు స్వీకరిస్తున్నారని జారీచేసిన 317 సర్య్కులర్‌ను వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటించింది. ఈ మేరకు ఇంచార్జీ సెక్రటరీ సర్క్యులర్ జారీచేశారు.

పరిధి కాదు..

పరిధి కాదు..

అంతకుముందు ఏజీ శ్రీరామ్ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నియామకం రాష్ట్ర పరిధిలోని అంశం కాదు అని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ అన్నారు. హైకోర్టు చెప్పిన అంశాలను ప్రస్తావించిన ఆయన.. ఇప్పుడే కాదు, చంద్రబాబు హయాంలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ నియామకం తప్పు అని పేర్కొన్నారు. దీనిపై తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నామని తెలిపారు. హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే తనను తాను ఎస్ఈసీగా ప్రకటించుకొని సర్క్యులర్ విడుదల చేశారని, హైదరాబాద్‌లో ఉండి.. తనకు వాహనం పంపించాలని ఆదేశాలు జారీచేయడం.. కోర్టు తీర్పుకు విరుద్ధమని తెలిపారు.

హైకోర్టు చెప్పలేదు..

హైకోర్టు చెప్పలేదు..

రమేశ్ కుమార్‌ను ఎస్‌ఈసీగా కొనసాగమని హైకోర్టు ఎక్కడా చెప్పలేదని శ్రీరామ్ అన్నారు. సెక్షన్ 200 క్రింద ప్రిన్సిపల్ సెక్రెటరీకి ఎన్నికల కమిషనర్ ను ఎన్నుకునే హక్కు లేదని చెప్పారు. కానీ ఆయన మాత్రం బాధ్యతలు స్వీకరించినట్టు సర్క్యులర్ కూడా విడుదల చేశారన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని హైకోర్టులో ఒక పిటిషన్ వేశామని... అప్పటివరకు హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరామని గుర్తుచేశారు. కానీ ఇంతలోనే రమేశ్ కుమార్ బాధ్యతలు చేపట్టడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు.

Recommended Video

Tirumala Temple Plans To Open Doors To Devotees
ఆ అధికారం లేదు

ఆ అధికారం లేదు

రాష్ట్ర ఎన్నికల అధికారిని నియమించే అధికారం రాష్ట్రానికి లేదు.. కానీ ఇదివరకు ఎలా నియమించారు.. అప్పటి సీఎం చంద్రబాబు మంత్రిమండలి సిఫారసుతో గవర్నర్ ఎలా నిర్ణయం తీసుకొన్నారు అని అడిగారు. ఇప్పుడే కాదు.. అప్పటి నియామకం కూడా చెల్లదని చెప్పారు. నియామకానికి సంబంధించి హైకోర్టు తీర్పు చెప్పకుంటే.. 2 నెలల సమయం ఉంటుంది. కానీ రమేశ్ కుమార్ సొంతంగా ఎలా తనను తాను ఎస్ఈసీగా ప్రకటించుకున్నారు అని అడిగారు. మరోవైపు ఎస్‌ఈసీ స్టాండింగ్ కౌన్సిల్‌ ప్రభాకర్‌ను రాజీనామా చేయాలని ఆదేశించడం ఏంటీ అని అడిగారు.

English summary
andhra pradesh election commission withdraw yestaurday 317 circular as nimmagadda ramesh kumar as sec.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X