• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏపీ ఎమ్మెల్యేలు వీరే : ఏ పార్టీకి ఎన్ని సీట్లు, ఎవరి మెజార్టీ ఎంత ?

|

అమరావతి : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ జయకేతనం ఎగురేసింది. మొత్తం 151 చోట్ల విజయదుందుబి మోగించింది. అధికార టీడీపీ మాత్రం కేవలం 23 సీట్లకు పరిమితమైంది. జనసేన పార్టీ ఒక్కో సీటుతో సరిపెట్టుకుంది. ఆయా చోట్ల ఏ పార్టీ తరఫున అభ్యర్థి విజయం సాధించారు. ఎంత మెజార్టీ ఉంది. ఉద్దండులను ఎవరైనా మట్టికరిపించారా అనే అంశాలను ఓ సారి పరిశీలిద్దాం.

శ్రీకాకుళం జిల్లా ..

శ్రీకాకుళం జిల్లా ..

తొలుత శ్రీకాకుళం జిల్లాకు వెళ్తే మొత్తం 10 సీట్లు ఇక్కడ ఉన్నాయి. 8 స్థానాల్లో వైసీపీ గెలువగా .. కేవలం 2 చోట్ల మాత్రమే టీడీపీ గెలిచింది. ఇచ్చాపురంలో టీడీపీ అభ్యర్థి బెండాళం అశోక్, టెక్కలిలో అచ్చెన్నాయుడు గెలుపొందారు. పలాసలో వైసీపీ అభ్యర్థి ఎస్ అప్పలరాజు, పాతపట్నంలో రెడ్డి శాంతి, శ్రీకాకుళంలో ధర్యాన ప్రసాదరావు, ఆముదాలవలసలో తమ్మినేని సీతారాం, ఎచ్చెర్లలో గొర్లె కిరణ్ కుమార్, నరసన్నపేటలో ధర్మాన కృష్ణప్రసాద్, రాజాంలో కంబాల జోగులు, పాలకొండలో కళావతి గెలుపొందారు.

విజయనగరం జిల్లా

విజయనగరం జిల్లా

విజయనగరం జిల్లాలో 9 స్థానాలు ఉన్నాయి. కురుపాంలో వైసీపీ అభ్యర్థి పుష్ప శ్రీవాణి, పార్వతీపురంలో జోగారావు, సాలూరులో రాజన్న దొర, బొబ్బిలిలో శంబంగి అప్పలనాయుడు, చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ, గజపతినగరంలో బొత్స అప్పల నర్సయ్య, నెల్లిమర్లలో అప్పలనాయుడు, విజయనగరం వీరభద్రస్వామి, ఎస్ కోట కడుంబడి శ్రీనివాసరావు గెలుపొందారు. ఇక్కడ 9 చోట్ల వైసీపీ విజయం సాధించింది.

విశాఖపట్నం జిల్లా ..

విశాఖపట్నం జిల్లా ..

విశాఖపట్నంలో 15 సీట్లు ఉన్నాయి. భీమిలిలో వైసీపీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాస్, గాజువాకలో తిప్పల నాగిరెడ్డి, చోడవరంలో కరణం ధర్మశ్రీ, వీ మాడుగులలో ముత్యాలనాయుడు, అరకులో చెట్టి ఫాల్గుణ, పాడేరులో భాగ్యలక్ష్మి, అనకాపల్లిలో అమర్ నాథ్, పెందుర్తిలో అదీప్ రాజు, యలమంచిలిలో రమణమూర్తి రాజు, పాయకరావుపేటలో గొల్ల బాబూరావు, నర్సీపట్నంలో ఉమాశంకర్ గణేశ్ గెలుపొందారు. విశాఖ ఈస్ట్ లో టీడీపీ అభ్యర్థి రామకృష్ణ బాబు, విశాఖ సౌత్‌లో వాసుపల్లి గణేశ్, విశాఖ నార్త్‌లో గంటా శ్రీనివాసరావు, విశాఖ వెస్ట్‌లో వెంకటరెడ్డి నాయుడు గెలుపొందారు. మొత్తంగా 11 చోట్ల వైసీపీ గెలువగా .. కేవలం 4 సీట్లతో టీడీపీ సరిపెట్టుకుంది.

తూర్పుగోదావరి జిల్లా

తూర్పుగోదావరి జిల్లా

తూర్పుగోదావరి జిల్లాలో 19 సీట్లు ఉన్నాయి. 14 చోట్ల వైసీపీ, 4 చోట్ల టీడీపీ, 1 చోట జనసేన విజయం సాధించాయి. తునిలో వైసీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా, ప్రత్తిపాడులో పూర్ణచంద్ర ప్రసాద్, పిఠాపురంలో పెండెం దొరబాబు, కాకినాడ రూరల్‌లో కురసాల కన్నబాబు, అనపర్తిలో సూర్యనారాయణ రెడ్డి, కాకినాడ సిటీ ద్వారంపూరి చంద్రశేఖర్ రెడ్డి, రామచంద్రపురం చెల్లుబోయిన వేణు, ముమ్మిడివరంలో సతీశ్ కుమార్, అమలాపురంలో పినిపే విశ్వరూప్, పీ గన్నవరంలో కె చిట్టిబాబు, కొత్తపేటలో చిర్ల జగ్గిరెడ్డి, రాజానగరంలో జక్కంపూడి రాజా, జగ్గంపేటలో జ్యోతుల చంటిబాబు, రంపచొడవరంలో ధనలక్ష్మీ గెలుపొందారు. పెద్దాపురంలో టీడీపీ అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప, మండపేటలో వేగుళ్ల జోగేశ్వరరావు, రాజమండ్రిలో ఆదిరెడ్డి భవానీ, రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలుపొందారు. రాజోలు ఒక్క స్థానంలో రాపాక వరప్రసాద్ విజయం సాధించారు.

పశ్చిమగోదావరి జిల్లా

పశ్చిమగోదావరి జిల్లా

పశ్చిమ గోదావరి జిల్లాలో 15 సీట్లు ఉన్నాయి. 13 చోట్ల వైసీపీ, 2 చోట్ల టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. కొవ్వూరులో వనిత, నిడదవోలులో జీఎస్ నాయుడు, ఆచంటలో శ్రీరంగనాథరాజు, నర్సాపురంలో ప్రసాదరాజు, భీమవరంలో గ్రంథి శ్రీనివాస్, తణుకులో కారుమూరి నాగేశ్వరరావు, తాడేపల్లిగూడెంలో కొట్టు సత్యనారాయణ, ఉంగూటూరులో పుష్పాల శ్రీనివాసరావు, దెందులూరులో కే అబ్బయ్య చౌదరి, ఏలూరులో ఆళ్లనాని, గోపాలపురంలో తలారి వెంకటరావు, పోలవరంలో తెల్లం బాలరాజు, చింతలపూడిలో వీఆర్ ఎలేజా విజయం సాధించారు. పాలకొల్లులో టీడీపీ అభ్యర్థి నిమ్మల రామానాయుడు, ఉండిలో మంతెన రామరాజు గెలుపొందారు.

కృష్ణా జిల్లా

కృష్ణా జిల్లా

కృష్ణా జిల్లాలో 16 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 14 చోట్ల వైసీపీ, కేవలం 2 చోట్ల టీడీపీ తమ సీట్లను ఖాతాలో వేసుకున్నాయి. తిరువూరులో రక్షణనిధి, నూజివీడులో ప్రతాప్ అప్పారావు, గుడివాడలో కొడాలి నాని, కైకలూరులో నాగేశ్వరరావు, పెడన జోగి రమేశ్, మచిలీపట్నం పేర్ని నాని, అవనిగడ్డ సింహాద్రి రమేశ్ బాబు, పామర్రు కే అనిల్ కుమార్, పెనమలూరు పార్థసారథి, విజయవాడ వెస్ట్ వెల్లంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ సెంట్రల్ మల్లాది విష్ణు, మైలవరం వసంత కృష్ణ ప్రసాద్, నందిగామ జగన్మోహన్ రావు, జగ్గయ్యపేట సామినేని ఉదయభాను గెలుపొందారు. గన్నవరంలో టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ, విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు విజయం సాధించారు.

గుంటూరు జిల్లా

గుంటూరు జిల్లా

గుంటూరులో 17 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 15 చోట్ల వైసీపీ, కేవలం 2 చోట్ల టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. పెదకూరపాడులో వైసీపీ అభ్యర్థి శంకరరావు, తాడికొండలో శ్రీదేవి, మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి, పొన్నూరులో కిలారి రోశయ్య, వేమూరులో మేరుగు నాగార్జున, తెనాలిలో అన్నాబత్తుని శివకుమార్, బాపట్లలో కోన రఘుపతి, ప్రత్తిపాడులో సుచరిత, గుంటూరు ఈస్ట్‌లో మహ్మద్ ముస్తఫా, చిలకలూరిపేటలో విడదల రజని, నరసరావుపేట గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సత్తెనపల్లిలో అంబటి రాంబాబు, వినుకొండలో బ్రహ్మనాయుడు, గురజాల కాసు మహేశ్ రెడ్డి, మాచర్ల పిన్నెలి రామకృష్ణారెడ్డి గెలుపొందారు. రేపల్లెలో టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్, గుంటూరులో మద్దాలి గిరి గెలుపొందారు.

ప్రకాశం జిల్లా

ప్రకాశం జిల్లా

ప్రకాశం జిల్లాలో 12 స్థానాలు ఉన్నాయి. 8 చోట్ల వైసీపీ, 4 స్థానాల్లో టీడీపీ విజయం సాధించాయి. ఎర్రగొండపాలెంలో వైసీపీ అభ్యర్థి ఆదిమూలపు సురేష్, దర్షిలో మద్దిశెట్టి వేణుగోపాల్, సంతనూతలపాడులో సుధాకర్ బాబు, ఒంగోలులో బాలినేని శ్రీనివాస రెడ్డి, కందుకూరులో మహీధర్ రెడ్డి, మర్కాపురంలో కేపీ నాగార్జున రెడ్డి, గిద్దలూరులో అన్నా వెంకట రాంబాబు, కనిగిరిలో మధుసూదన్ యాదవ్ వైసీపీ అభ్యర్థులు జయకేతనం ఎగరేశారు. పర్చూరులో టీడీపీ అభ్యర్థి ఏలూరు సాంబశివరావు, అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్, చీరాలలో కరణం బలరాం, కొండపిలో ఎస్వీ స్వామి గెలిచారు.

నెల్లూరు జిల్లా

నెల్లూరు జిల్లా

నెల్లూరులో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ వైసీపీ క్వీన్ స్వీప్ చేసింది. కావలిలో వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్, ఆత్మకూరులో మేకపాటి గౌతంరెడ్డి, కోవూరులో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, నెల్లూరు సిటీలో అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు రూరల్‌లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సర్వేపల్లిలో కాకాని గోవర్ధన్ రెడ్డి, గూడూరులో వరప్రసాద్, సూళ్లూరుపేటలో కిలివేటి సంజీవయ్య, వెంకటగిరిలో ఆనం రాంనారాయణరెడ్డి, ఉదయగిరిలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గెలుపొందారు.

కడప జిల్లా

కడప జిల్లా

కడపలో మొత్తం 10 అసెంబ్లీ సీట్లు ఉండగా .. వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. బద్వేలులో వైసీపీ అభ్యర్థి వెంకటసుబ్బయ్య, రాజంపేటలో మేడా మల్లికార్జున రెడ్డి, కడప అంజద్ బాషా, కోడూరు కొరుమట్ల శ్రీనివాసులు, రాయచోటి గడికోట శ్రీకాంత్ రెడ్డి, పులివెందుల జగన్ మోహన్ రెడ్డి, కమలాపురం రవీంద్రనాథ్ రెడ్డి, జమ్మలమడుగు సుధీర్ రెడ్డి, ప్రొద్దుటూరు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, మైదుకూరు శెట్టిపల్లి రఘురాం రెడ్డి జయకేతనం ఎగరేశారు.

కర్నూలు జిల్లా

కర్నూలు జిల్లా

కర్నూలులో 14 సీట్లలో వైసీపీ అభ్యర్థులు జయకేతనం ఎగురేశారు. ఆళ్లగడ్డలో వైసీపీ అభ్యర్థి గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి, శ్రీశైలం శిల్పచక్రపాని రెడ్డి, నందికొట్కూరు ఆర్థర్, కర్నూలు హఫీజ్ ఖాన్, పాణ్యం కాటసాని రాంభూపాల్ రెడ్డి, నంద్యాల శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి, బనగానపల్లె కాటసాని రామిరెడ్డి, డోన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పత్తికొండ శ్రీదేవి, కోడుమూరు సుధాకర్ బాబు, ఎమ్మిగనూరు చెన్నకేశవ రెడ్డి, మంత్రాలయం బాలనాగిరెడ్డి, ఆదోని సాయిప్రసాద్ రెడ్డి, ఆలూరు జయరాం గెలుపొందారు.

అనంతపురం జిల్లా

అనంతపురం జిల్లా

అనంతపురంలో 14 స్థానాలు ఉన్నాయి. 12 చోట్ల వైసీపీ, 2 చోట్ల టీడీపీ విజయం సాధించారు. రాయదుర్గంలో వైసీపీ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి, గుంతకల్లు వెంకటరామిరెడ్డి, తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి, శింగనమలలో జొన్నలగడ్డ పద్మావతి, అనంతపురం అర్బన్‌లో అనంత వెంకటరామిరెడ్డి, కళ్యాణదుర్గంలో కేవీ ఉషశ్రీ చరణ్, రాప్తాడులో ప్రకాశ్ రెడ్డి, మడకశిరలో తిప్పేస్వామి, పెనుకొండలో శంకర్ నారాయణ, పుట్టపర్తిలో శ్రీధర్ రెడ్డి, ధర్మవరంలో వెంకటరామిరెడ్డి, కదిరిలో సిద్దారెడ్డి గెలుపొందారు. ఉరవకొండలో పయ్యావుల కేశవ్, హిందూపురంలో బాలకృష్ణ గెలిచారు.

చిత్తూరు జిల్లా

చిత్తూరు జిల్లా

చిత్తూరులో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 13 చోట్ల వైసీపీ జయకేతనం ఎగరేయగా .. 1 చోట టీడీపీ విజయం సాధించింది. తంబళ్లపల్లెలో ద్వారకానాథ్ రెడ్డి, పీలేరు చింతల రామచంద్రారెడ్డి, మదనపల్లెలో నవాజ్ బాషా, పుంగనూరులో రామచంద్రారెడ్డి, చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి, శ్రీకాళహస్తిలో మధుసూదన్ రెడ్డి, సత్యవేడులో ఆదిమూలం, నగరిలో రోజా, గంగాధర నెల్లూరులో నారాయణ స్వామి, చిత్తూరులో బింగాలపల్లి శ్రీనివాసులు, పూతలపట్టులో డీఎంఎస్ బాబు, పలమనేరులో వెంకటయ్య గౌడ్ గెలుపొందారు. ఒక కుప్పంలో చంద్రబాబు విజయం సాధించారు.

English summary
Andhra Pradesh MLA List 2019: Check the Complete list of all winning candidates from YSRCP, TDP, Janasena in Andhra Pradesh Assembly elections. Also Find Constituency and party wise results of Andhra Pradesh elections 2019 here.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X