నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నెల్లూరులో మినీ ఎల్జీ పాలిమర్స్: కెమికల్స్ గోడౌన్‌లో అగ్నిప్రమాదం: ఘాటు వాసనతో ఉక్కిరిబిక్కిరి

|
Google Oneindia TeluguNews

నెల్లూరు: విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి విషవాయువులు వెలువడిన ఉదంతం తరహాలోనే నెల్లూరులో మరో ఘటన చోటు చేసుకుంది. ఓ కెమికల్ ఫ్యాక్టరీకి చెందిన గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. అందులో నిల్వ ఉంచిన వస్తువులన్నీ రసాయనాలతో తయారు చేసినవే కావడంతో స్థానికులు ఊపిరిపీల్చుకోవడానికి ఇబ్బంది పడ్డారు. ముక్కుపుటాలను అదరగొట్టేలా రసాయనాల ఘాటు వాసనతో ఉక్కిరిబిక్కిరికి గురయ్యారు. సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో మంటలను ఆర్పివేయగలిగారు. వాటి తీవ్రత అప్పటికప్పుడు అదుపు చేయగలిగారు.

పాలనలో మెరుపు వేగం: యాక్షన్‌లోకి దిగిన జగన్ సర్కార్: జిల్లాల్లో ఇక ముగ్గురు జేసీలు: పోలవరానికి ఐఎఎస్పాలనలో మెరుపు వేగం: యాక్షన్‌లోకి దిగిన జగన్ సర్కార్: జిల్లాల్లో ఇక ముగ్గురు జేసీలు: పోలవరానికి ఐఎఎస్

బ్లీచింగ్ పౌడర్.. లిక్విడ్ హ్యాండ్ వాష్..

బ్లీచింగ్ పౌడర్.. లిక్విడ్ హ్యాండ్ వాష్..

నెల్లూరులోని శ్రీబాలాజీ కెమికల్స్ కంపెనీకి చెందిన గోడౌన్ అది. ఫ్యాక్టరీలో తయారైన వస్తువులను ఇక్కడ నిల్వ ఉంచుతుంటారు. బళ్లారి-కృష్ణపట్నం జాతీయ రహదారికి సమీపంలో పెన్నానదికి ఆనుకుని ఉంటుందా గోడౌన్. బాలాజీ కెమికల్స్ ఫ్యాక్టరీలో తయారైన బ్లీచింగ్ పౌడర్, లైమ్ పౌడర్, లిక్విడ్ హ్యాండ్ వాష్, డిటర్జెంట్ పౌండర్ వంటి రసాయనిక ఉత్పత్తులను ఈ గోడౌన్‌లో నిల్వ ఉంచుతుంటారు. ఆదివారం అందులో మంటలు చెలరేగాయి. రసాయనిక మిశ్రమాలతో తయారు చేసిన ఉత్పత్తులు కావడం వల్ల మంటలు వేగంగా వ్యాప్తి చెందాయి.

 ఉలిక్కిపడ్డ స్థానికులు..

ఉలిక్కిపడ్డ స్థానికులు..

దట్టమైన పొగ, ఘాటు వాసన వెలువడింది. బోడిగాడి తోట సమీప ప్రాంతాల ప్రజలు ఉలిక్కిపడ్డారు. ముఖాలకు మాస్కులు వేసుకుని రోడ్ల మీదికి పరుగులు పెట్టారు. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. సమాచారం అందుకున్న వెంటనే నెల్లూరు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరకున్నారు. మంటలను సకాలంలో ఆర్పివేయగలిగారు. మంటలను అదుపు చేయడానికి నీళ్లతో పాటు కొన్ని రసాయనాలను వినియోగించారు. ఈదురుగాలులకు ఓ చెట్టుకొమ్మ విరిగి ఫ్యాక్టరీకి దగ్గరే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ మీద పడటం వల్ల మంటలు చెలరేగాయని ప్రాథమికంగా నిర్ధారించారు.

 మంత్రుల పర్యవేక్షణ..

మంత్రుల పర్యవేక్షణ..

సమాచారం అందుకున్న వెంటనే జిల్లాకు చెందిన జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బందితో పాటు అక్కడే ఉండి నియంత్రణ చర్యలను పర్యవేక్షించారు. జిల్లాకే చెందిన వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఈ ఘటనపై స్పందించారు. జిల్లా ఎస్పీకి ఫోన్ చేశారు. అనిల్ కుమార్ యాదవ్‌తోనూ మాట్లాడారు. అధికార, పోలీసు, అగ్నిమాపక యంత్రాంగం సకాలంలో స్పందించడం వల్ల భారీ ప్రమాదం తప్పిందని అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు.

Recommended Video

AP Corona Cases Crossed 1500 With 62 New Positive Cases in 24 hours | Oneindia Telugu
డిమాండ్ అధికంగా ఉండటంతో..

డిమాండ్ అధికంగా ఉండటంతో..

కరోనా వ్యాప్తి చెందిన ప్రస్తుత పరిస్థితుల్లో బ్లీచింగ్ పౌడర్, లిక్విడ్ హ్యాండ్‌ వాష్ వంటి వస్తువులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడిన విషయం తెలిసిందే. బాలాజీ కెమికల్స్ కూడా అవే వస్తువులను ఉత్పత్తి చేస్తున్నందున.. ప్రొడక్షన్‌ను రెట్టింపు చేసిందని అంటున్నారు. సామర్థ్యానికి మించి ఉత్పత్తులను చేపట్టడం వల్ల ట్రాన్స్‌ఫార్మర్‌పై లోడ్ అధికమై.. ఈ ప్రమాదం చోటు చేసుకుని ఉండొచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమౌతున్నాయి. కంపెనీ లైసెన్స్, పర్యావరణ అనుమతులు వంటి అంశాలను పరిశీలిస్తామని, సక్రమంగా లేనట్టయితే చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

English summary
A chemical factory close to Bodigadithota area in the Nellore caught fire in the evening on Sunday. Fire officials rushed to the spot and tried to put off the flames. Sri Balaji Chemicals is located close to Penna River which produces bleaching powder, lime powder, liquid handwash, detergent powder and other chemicals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X