వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

YS Jagan: పాకిస్తాన్ చెర నుంచి మాతృభూమికి: వైఎస్ జగన్‌ను కలిసిన ఏపీ మత్స్యకారులు..!

|
Google Oneindia TeluguNews

అమరావతి: పాకిస్తాన్ చెర నుంచి విడుదలైన మత్స్యకారులు రాష్ట్రానికి చేరుకున్నారు. బుధవారం ఉదయం వారు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారు. కృతజ్ఙతలను తెలపుకొన్నారు. ఏడాదిన్నర కాలంగా పాకిస్తాన్‌ జైలులో మగ్గిన మన రాష్ట్ర మత్స్యాకారులను విడిపించడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయానికి పలుమార్లు లేఖలను రాసింది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా చొరవను ప్రదర్శించాయి. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ.. పాకిస్తాన్‌లోని భారత రాయబార కార్యాలయం ద్వారా మత్స్యకారులను విడిపించడానికి ప్రయత్నాలు కొనసాగించింది. ఫలితంగా- సుమారు ఏడాదిన్నర కాలం తరువాత మత్స్యకారులు స్వరాష్ట్రానికి చేరుకున్నారు. గుజరాత్ సముద్ర జలాల్లో చేపలు పడుతూ వారంతా గత ఏడాది పొరపాటున పాకిస్తాన్ వైపు వెళ్లిన విషయం తెలిసిందే.

Andhra Pradesh fishermen released from Pakistan jail are meets CM YS Jagan

రెండు రోజుల క్రితం మొత్తం 22 మందిలో 20 మందిని పాకిస్తాన్ విడుదల చేసింది. వాఘా సరిహద్దు వద్ద మంత్రి మోపిదేవి వెంకటరమణ వారికి స్వాగతం పలికారు. బుధవారం ఉదయం వారు ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు 15 మంది, విజయనగరం జిల్లాకు చెందిన వారు అయిదుమంది ఉన్నారు. ఈ ఉదయం వారు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్‌ను కలిశారు. పాకిస్థాన్ చెర నుంచి స్వేచ్ఛా జీవితం కల్పించడానికి కృషి చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

గనగళ్ల రామారావు, మైలాపల్లి సన్యాసి రావు, మైలాపల్లి రాంబాబు, కేశం రాజు, కేశం ఎర్రయ్య, చీకటి గురుమూర్తి, బాడి అప్పన్న, కోనాడ వెంకటేష్, వాసుపల్లి శామ్యుల్, సూరాడ అప్పారావు, సూరాడ కల్యాణ్, సూరాడ కిశోర్, పెంటా మణి, దూడంగి సూర్యనారాయణ, నక్కా అప్పన్న, నక్కా నర్సింగ్, మైలాపల్లి గురువులు, బర్రి బావిరోడు, నక్కా ధనరాజు కాగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాకు చెందిన వారు కాగా.. అస్సాంకు చెందిన షేఖ్యా సుమ్న తదితరులు జగన్‌ను కలిసిన వారిలో ఉన్నారు.

English summary
Andhra Pradesh fishermen released from Pakistan jail are meets Chief Minister YS Jagan Mohan Reddy at Camp office in Thadepalli, Fishermen from Andhra Pradesh has caught by Pakistan in 2018.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X