విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాక్ టైల్‌ పార్టీలో కలవమన్నారు, 10 ని.లు అని 40 ని.లు మాట్లాడారు: బిల్ గేట్స్‌పై బాబు

ఏపీలోని విశాఖపట్నంలో అగ్రి టెక్ సదస్సు ముగింపు సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరువురు వ్యవసాయ ప్రదర్శనలు తిలకించారు.

|
Google Oneindia TeluguNews

Recommended Video

Bill Gates Attended AP Agritech Summit | Oneindia Telugu

విశాఖపట్నం: ఏపీలోని విశాఖపట్నంలో అగ్రి టెక్ సదస్సు ముగింపు సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరువురు వ్యవసాయ ప్రదర్శనలు తిలకించారు.

విశాఖపట్నం చాలా కాస్ట్‌లీ, ఖరీదైన నగరాల్లో 9వ స్థానం: సర్వేలో వెల్లడివిశాఖపట్నం చాలా కాస్ట్‌లీ, ఖరీదైన నగరాల్లో 9వ స్థానం: సర్వేలో వెల్లడి

 డబ్బులు అందరూ సంపాదిస్తారు కానీ

డబ్బులు అందరూ సంపాదిస్తారు కానీ

అనంతరం చంద్రబాబు మాట్లాడారు. డబ్బులు అందరూ సంపాదిస్తారని, కానీ బిల్ గేట్స్‌లా కొందరే సద్వినియోగం చేస్తారని చంద్రబాబు అన్నారు. ఆయన నుంచి తాము డబ్బు ఆశించడం లేదన్నారు. సంపాదించిన సొమ్ములో ఎక్కువ భాగాన్ని బిల్ గేట్స్ ఇతరులకు సాయం చేసేందుకు ఉపయోగపడుతున్నారన్నారు. వ్యవసాయ సదస్సుకు బిల్ గేట్స్ రావడం అరుదైన విషయమని చంద్రబాబు అన్నారు.

 బిల్ గేట్స్‌తో తొలి పరిచయంపై చంద్రబాబు

బిల్ గేట్స్‌తో తొలి పరిచయంపై చంద్రబాబు

ఈ సందర్భంగా చంద్రబాబు బిల్ గేట్స్‌తో తొలి పరిచయం గుర్తు చేసుకున్నారు. ఇరవై ఏళ్ల క్రితం కాక్‌టైల్ పార్టీలో కలవమని చెప్పారని, రాజకీయంగా ఇబ్బంది ఉంటుందని చెబితే విడిగా సమావేశమయ్యాయమన్నారు. తనకు పది నిమిషాల సమయం ఇచ్చారని, కానీ 40 నిమిషాలు తనతో మాట్లాడారని చెప్పారు. ఆ తర్వాత హైదారాబాద్‌కు మైక్రోసాఫ్ట్ వచ్చిందని చెప్పారు.

 ప్రతి ఐదుగురు టెక్కీల్లో ఒకరు తెలుగువారు

ప్రతి ఐదుగురు టెక్కీల్లో ఒకరు తెలుగువారు

ప్రపంచంలోని ప్రతి ఐదుగురు టెక్కీల్లో తెలుగు వారు ఒక్కరు అని చంద్రబాబు చెప్పారు. వ్యవసాయంలో జాతీయ సగటు కంటే ఏపీ సగటు ఎక్కువ అన్నారు. ఉద్యానవన పంటలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. కోటి ఎకరాల్లో హార్టీ కల్చర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.

 విశాఖ అందమైన నగరం

విశాఖ అందమైన నగరం

విశాఖపట్నం చాలా అందమైన, స్వచ్ఛమైన నగరం అని చంద్రబాబు అన్నారు. ఇక్కడ పెట్టుబడులకు మంచి అవకాశం ఉందని చెప్పారు. వ్యవసాయానికి తాము ఆధునిక సాంకేతికతను వాడుకుంటున్నామని చెప్పారు.

English summary
Andhra Pradesh, Gates Foundation join hands to help farmers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X