• search
 • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఏడాది పాలన: జనగళాన్ని వినడానికి జగన్ రెడీ: ఏపీలో మరో ప్రోగ్రామ్: అయిదు రోజుల పాటు

|

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. అధికారంలోకి వచ్చిన ఏడాది ముగిసిన సందర్భంగా ఓ సరికొత్త కార్యక్రమానికి రూపకల్పన చేసింది. సోమవారమే దీన్ని ప్రారంభించబోతోంది. ఈ కార్యక్రమం సందర్భంగా వచ్చిన సూచనలు, సలహాల ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను రూపొందించబోతోంది. ఆ కార్యక్రమం పేరే మన పాలన-మీ సూచన. అయిదురోజుల పాటు దీన్ని నిర్వహించబోతోంది. దీనికోసం ఓ షెడ్యూల్‌ను తాజాగా ప్రభుత్వం రూపొందించింది.

ఏపీలో తిరగటానికి పాస్ లు అక్కరలేదు .. సర్కార్ నిర్ణయంతో ఊపిరి పీల్చుకున్న ఏపీ ప్రజలు

ఏడాది పాలనపై

ఏడాది పాలనపై

వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఏడాది పూర్తయింది. గత ఏడాది 23వ తేదీన వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్దాయి. రాష్ట్రంలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు 151, 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో వైసీపీ ఘన విజయాన్ని సాధించింది. అదే నెల 30వ తేదీన వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన 23వ తేదీని ప్రాతిపదికన తీసుకుని ఏడాది ముగిసినట్టుగా భావిస్తోంది ప్రభుత్వం. ఈ ఏడాది పాలనపై ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించడానికి సమాయాత్తమౌతోంది. ఇందులో భాగంగా మన పాలన-మీ సూచన పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది.

 షెడ్యూల్ ఇదీ..

షెడ్యూల్ ఇదీ..

ఈ నెల 25వ తేదీన పరిపాలనా వికేంద్రీకరణ, మూడు రాజధానుల ఏర్పాటు, గ్రామ సచివాలయాలు వంటి అంశాలపై వైఎస్ జగన్ ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరిస్తారు. 26వ తేదీన వ్యవసాయ అనుబంధ రంగాల్లో రైతులకు కల్పించిన ప్రయోజనాలపై చర్చిస్తారు. దీనికోసం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో చర్చిస్తారు. 27వ తేదీన విద్యార్థుల కోసం ఉద్దేశించిన పథకాలు నిపుణులతో చర్చ ఉంటుంది. 28వ తేదీన పరిశ్రమలకు కల్పించిన, కల్పించాల్సిన వసతులపై పారిశ్రామిక వేత్తలతో చర్చిస్తారు. 29వ తేదీన ఆరోగ్యశ్రీలో వచ్చిన మార్పులపై చర్చ ఉంటుంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి జగన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

  Lockdown : Big Relief To AP People,No Need Passes To Travel In AP
  బంపర్ మెజారిటీ సాధించిన నేపథ్యంలో..

  బంపర్ మెజారిటీ సాధించిన నేపథ్యంలో..

  గత ఏడాది మే 23వ తేదీన వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల సందర్భంగా 151 స్థానాలను కైవసం చేసుకుంది వైసీపీ. అన్ని వర్గాల ప్రజలు కూడా పార్టీపై విశ్వాసాన్ని ఉంచి ఓటు వేయడం వల్లే బంపర్ మెజారిటీ సాధ్యపడిందని పార్టీ నాయకులు చెబుతున్నారు. అందుకే- ఆయా వర్గాల ప్రజలతో చర్చించి, వారి సూచనలు, సలహాలను తీసుకోవాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని అంటున్నారు. మెజారిటీ ప్రజల సూచనలకు అనుగుణంగా, వారి ఆకాంక్షల మేరకు పరిపాలనలో మార్పులను తీసుకుని రావాలని వైఎస్ జగన్ భావిస్తున్నారు.

  English summary
  The Andhra Pradesh government headed by chief minister YS Jagan Mohan Reddy, which has been fulfilling the various schemes in the last one year has stepped into the second year grandly with yet another new flagship program for the welfare of people. AP government is planning to start a program under name Mana Palana-Mee Suchana program on Monday, which will continue till Friday to take the inputs from the people in governance. Vijaya Kumar, secretary of the Planning Department ex-officio, said in a statement on it.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more