వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో ఆస్తి పన్ను చట్టానికి సవరణ, నోటిఫికేషన్ జారీ..అక్రమ కట్టడాలకు భారీగా జరిమానా..

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్తి పన్ను చట్టానికి సవరణ చేసింది. 2021-22 ఏడాది నుంచి రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా ఆస్తి పన్ను లెక్కిస్తారు. ఈ మేరకు పురపాలక మంత్రిత్వ శాఖ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటివరకు ప్రభుత్వం ఏడాది అద్దె ప్రాతిపదికన ఆస్తి పన్నును లెక్కిస్తోంది. ఇకపై రిజిస్ట్రేషన్ విలువ సవరించిన ప్రతిసారి ఆ మేరకు ఆస్తి పన్నుపెరగనుంది.

రిజిస్ట్రేషన్ విలువ ఆధారిత పన్ను 10 శాతం కంటే ఎక్కువ ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది. సవరించిన మేరకు ధార్మిక, విద్య, వైద్య, సాంస్కృతిక కట్టడాలకు ఆస్తి పన్నును మినహాయించారు. సైనికులు, మాజీ సైనికుల గృహాలకు కూడా ఆస్తి పన్ను నుంచి వెసులుబాటు కల్పించారు. 375 చదరపు అడుగుల లోపు భవనాలకు వార్షిక ఆస్తిపన్ను రూ.50 అని నిర్ధారించారు. భవన శైలి ఆధారంగా ఆస్తి విలువ ఖరారు చేస్తారు. ఇల్లు డిజైన్ బట్టి పన్ను వడ్డించనున్నారు. అంటే శ్రీమంతుల ఇళ్లకు పన్ను మోత ఉండనుండగా... సామాన్యులకు మినహాయింపు లభించే ఛాన్స్ ఉంది.

andhra pradesh government amends property tax

ఆర్ సీసీ, రేకులు, పెంకులు, నాపరాళ్లు, పూరిళ్లకు ఆస్తిపన్నును వర్గీకరించారు. ఆస్తి పన్నును నిర్ధారించే క్రమంలో అక్రమ కట్టడాలకు 25 నుంచి 100 శాతం జరిమానా విధిస్తారు. ఏదైనా భవనానికి సంబంధించి పూర్తి వివరాలను అందజేయాలి. నమూనా మారినా.. నిర్మాణం పెరిగినా ఫైన్ తప్పదు. నిర్దేశిత భవనాన్ని బట్టి ఫైన్ ఉంటుందని అధికారులు తెలిపారు. ఎంత అక్రమ నిర్మాణం ఉంటే అంత ఫైన్ కట్టాల్సి ఉంటుంది.

English summary
andhra pradesh government amends property tax, notification issued by officials.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X