వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్స్ పంపిణీ: సీఎం జగన్ కీలక ఆదేశాలు

|
Google Oneindia TeluguNews

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకునే బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్స్ పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ విద్యాలయాల్లో చదువుకుంటున్న 7 నుంచి 12వ తరగతి విరకు విద్యార్థినిలకు శానిటరీ న్యాప్‌కిన్స్ పంపిణీపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ శుక్రవారం సమీక్షించారు. విద్య, వైద్య, ఆరోగ్య, మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు హాజరయ్యారు.

Recommended Video

Free Sanitary Napkins For Girl Students In AP చదువుకునే బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్స్!!
విద్యార్థినులకు ఉచిత శానిటరీ న్యాప్‌కిన్స్ పంపిణీ

విద్యార్థినులకు ఉచిత శానిటరీ న్యాప్‌కిన్స్ పంపిణీ

ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న 7-10వ తరగతి విద్యార్థినులకు బ్రాండెడ్ కంపెనీలకు చెందిన న్యాప్‌కిన్స్ ఉచితంగా పంపిణీ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. బాలికల ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు. కాగా, మార్చి 8 మహిళా దినోత్సవం రోజున ఈ ఉచిత శానిటరీ న్యాప్‌కిన్స్ పంపిణీ పథకం ప్రారంంభం కానున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ఏప్రిల్ 15 నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామని సీఎంకు అధికారులు చెప్పారు. ఏప్రిల్ నెలాఖరులోగా ప్రతిష్టాత్మక కంపెనీలతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, గురుకుల పాఠశాలల విద్యార్థినిలకు శానిటరీ న్యాప్‌కిన్స్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

జులై 1 నుంచి ప్రతి నెలా ఉచితంగా పంపిణీ..

జులై 1 నుంచి ప్రతి నెలా ఉచితంగా పంపిణీ..

జులై 1 నుంచి ప్రతి నెలా ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్స్ పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు. నెలకి 10 చొప్పున ఏడాదికి 120 శానిటరీ న్యాప్‌కిన్స్ ను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఇందు కోసం సుమారు రూ. 41.4 కోట్ల ఖర్చ చేయనుంది. కాగా, గ్రామీణ ప్రాంతాల్లో చేయూత కిరాణా స్టోర్ల ద్వారా తక్కువ ధరకే బ్రాండెడ్ కంపెనీల శానిటరీ న్యాప్‌కిన్స్ అందుబాటులో ఉంచుతున్నట్లు అధికారులు తెలిపారు. దీని కోసం న్యాప్‌కిన్స్ తయారీలో అత్యుత్తమ కంపెనీలతో మెప్మా, సెర్ప్ ఎంవోయూ ఏకం కానున్నట్లు తెలిపారు.

విద్యార్థినులను పోటీ పరీక్షలు సిద్ధం చేయండి..

విద్యార్థినులను పోటీ పరీక్షలు సిద్ధం చేయండి..

ఇక, విద్యార్థినిలకు పోటీ పరీక్షల కోసం అత్యుత్తమ శిక్షణ అందించాలని సీఎం జగన్ ఆదేశించారు. దీనికోసం ల్యాప్‌టాప్‌లను వాడుకోవాలన్నారు. అమ్మఒడి పథకంలో ల్యాప్‌టాల్‌లు కావాలనుకున్న 9వ తరగతి ఆపై చదువుతున్న విద్యార్థులకు ఇప్పటికే ఆప్షన్ ఇచ్చామని తెలిపారు. ప్రభుత్వం ఇస్తున్న కంప్యూటర్లతోపాటు రెప్యూటెడ్ కోచింగ్ సంస్థల సహకారం తీసుకునే దిశగా ప్రణాళిక రచించాలని అధికారులను ఆదేశించారు.

English summary
Andhra Pradesh govt distributes free napkins to school girls
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X