ఏపీ విద్యార్థులకు అలర్ట్: నేటి మధ్యాహ్నం ఇంటర్ ఫలితాలు విడుదల
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు విజయవాడలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలు విడుదల చేయనున్నారు.
పరీక్షల ఫలితాలను www.bie.ap.gov.in , https://examresults.ap.nic.in వెబ్సైట్లలో పొందవచ్చు. ఇంటర్ పరీక్షలను మే 6 నుంచి 25 వరకు నిర్వహించగా 9లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాశారు.

ఇప్పటికే 10వ తరగతి ఫలితాలు విడుదల కాగా, ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులు కూడా కొన్ని రోజులుగా ఫలితాలు విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. పదో తరగతి ఫలితాలలో పాస్ పర్సంటేజీ తక్కువగా రావడం విమర్శలకు తావిచ్చిన విషయం తెలిసిందే. దీంతో బుధవారం విడుదల కానున్న ఇంటర్ ఫలితాల ఉత్తీర్ణత శాతంపై ఆసక్తి నెలొకంది.
Comments
English summary
Andhra Pradesh intermediate exam results will release today.