వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: తెలంగాణ ఎన్జీవో చీఫ్ విఠల్ ఎపికి కేటాయింపు

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Andhra Pradesh kicks in division of employees
హైదరాబాద్: ఉద్యోగుల విభజనలో షాక్! తెలంగాణ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు విఠల్‌ను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. ఉద్యోగుల విభజనలో భాగంగా విఠల్‌ను ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర)కు కేటాయించడం గమనార్హం. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ఉద్యోగులను విభజించిన విషయం తెలిసిందే.

ఉద్యోగుల పంపకాల్లో గురువారం ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. విఠల్‌ను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. దీనిపై విఠల్ స్పందించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తనను ఆంధ్రా ఇంటర్ బోర్డుకు మార్చే కుట్రలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఇంటర్ విద్యాశాఖ విభజనలో జరిగింది.

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నేతలను ఆంధ్రాకు తరలించేందుకు తెర వెనుక కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. తనను సీమాంధ్రకు కేటాయించడంపై మరో పోరాటానికైనా సిద్ధమన్నారు.

జాగృతి మరొకరికి అప్పగిస్తానన్న కవిత

నిజామాబాద్ నుండి లోకసభకు ఎన్నికైన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.. జాగృతి బాధ్యతలను మరొకరికి అప్పగిస్తానని చెప్పారు. తెలంగాణ పునర్నిర్మాణంలో జాగృతి కీలక పాత్ర పోషిస్తుందన్నారు. తెరాస ప్రభుత్వం పట్ల ఎన్డీయే పక్షపాతంగా వ్యవహరిస్తే పోరాటానికి సిద్ధమవుతామన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం సత్సంబంధాలను కొనసాగిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.

English summary

 The tricky issue of division of staff commenced on Tuesday with the state government making provisional allotment of 1,865 employees of the Secretariat, ranging from additional secretary to driver/transport assistant, to AP and Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X