• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఇలా చేయాలి: బాబు, తమాషాగా ఉందా అంటూ మీడియాపై ఆగ్రహం

By Srinivas
|

రాజమండ్రి: గోదావరి మహా పుష్కరాలకు సుమారు 5 కోట్ల మంది వచ్చారని, దీనికి గుర్తుగా రాజమండ్రిలో మహా పుష్కర వనం ఏర్పాటు చేస్తున్నామని సీఎం చంద్రబాబు ఆదివారం అన్నారు. రాజమండ్రి సమీపంలోని 240 ఎకరాల అటవీ భూమిలో ఆయన మహా పుష్కరవనం నిర్మాణానికి మొక్కలు నాటి శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా మాట్లాడారు. రాజమండ్రిలో ఫారెస్ట్ అకాడమీకి శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. బొటానికల్ గార్డెన్, రాశివనం ఏర్పాటు చేస్తామన్నారు అఖండ గోదావరి అథారిటీ ఆధ్వర్యంలో రూ.100 కోట్లతో టూరిజం హబ్ రూపుదిద్దుకుంటుందన్నారు.

గోదావరి పుష్కరాలు అపూర్వమని, సమష్టి కృషితో ఘనంగా నిర్వహించామన్నారు. ఇదే స్ఫూర్తితో నవ్యాంధ్రప్రదేశ్‌ను ఆదర్శ రాష్ట్రంగా తిర్చిదిద్దేందుకు పునరంకితమవుదామన్నారు. ఆర్ట్స్ కళాశాలలో జరిగిన పుష్కర అభినందన సంభలో ఆయన మాట్లాడారు.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

తాను 13 రోజుల పాటు రాజమండ్రిలోనే ఉన్నానని, డిజిపి, సీఎస్‌లు కూడా ఇక్కడే ఉన్నారని, అందరు పనిలో పోటీ పడ్డారని చంద్రబాబు కితాబిచ్చారు.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

మంత్రి నారాయణ కూడా అలాగే శ్రమించారన్నారు. పుష్కరాల్లో పని చేసిన ఉద్యోగులకు రెండు రోజుల పాటు సెలవులు ఇస్తున్నట్లు చెప్పారు.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

ఒకటిన్నర డిఏ కూడా ఇస్తున్నామని చంద్రబాబు చెప్పారు. అధికారులు అందరికీ చంద్రబాబు మెమొంటోలను అందజేశారు. పలువురు ప్రజాప్రతినిధులను సన్మానించారు.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

అనంతరం చంద్రబాబు నాయుడు ఆదివారం సాయంత్రం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయలుదేరారు. బేగంపేట విమానాశ్రయంలో ఆయనకు టిడిపి తెలంగాణ అధ్యక్షులు ఎల్ రమణ, ఎర్రబెల్లి దయాకర రావు, ఎంపీ మల్లారెడ్డి ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

ఏపీలో నదుల అనుసంధానానికి గోదావరి పుష్కరాలు అందించిన స్ఫూర్తి నాంది కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిలషించారు. పుష్కరాలను సమష్టి కృషితో విజయవంతం చేయగలిగామన్నారు. దీన్ని ఒక నమూనా ప్రాజెక్టుగా తీసుకుని ఇదే విధానాన్ని రాష్ట్రం మొత్తానికి అమలు చేస్తామన్నారు.

 గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

అప్పుడు ఆదర్శ, అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, విదేశాలతో పోటీపడేలా అభివృద్ధి చేయగలమని అభిప్రాయపడ్డారు. అందరూ ఇదే స్ఫూర్తితో పనిచేస్తే రాష్ట్రం అనుకున్న సమయం కంటే ముందే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఒకటో స్థానంలో నిలుస్తుందని పేర్కొన్నారు.

 గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

స్వచ్ఛంద సంస్థలకు, పెద్ద మనసుతో యాత్రికులకు ఉచిత భోజన వసతి కల్పించిన నగర ప్రజలకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఇనుముని బాగా వేడి చేస్తే ఎలాగైనా మలుచుకోవచ్చునని, ప్రజల్లో చైతన్యం తెస్తే రాష్ట్ర అభివృద్ధికి ఎలా కావాలంటే అలా సహకరిస్తారని, పుష్కరాల ద్వారా ప్రజల్లో ఆ స్ఫూర్తి రగిలించగలిగామన్నారు.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

పుష్కరాల తొలిరోజు జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన 27 మంది ఆత్మశాంతి కోసం రెండు నిమిషాల మౌనం పాటించారు. ఆ దుర్ఘటనపై ముఖ్యమంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

ఇప్పటికీ తాను మర్చిపోలేకపోతున్నానని, వారి కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థికసాయమైతే అందజేశామని, చనిపోయిన వ్యక్తుల్ని తిరిగి తీసుకురాలేమని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఆ జిల్లాలకు వెళ్లినప్పుడు వారి కుటుంబసభ్యుల్ని పిలిపించి మాట్లాడుతానన్నారు. ప్రభుత్వం తరపున వారిని ఏ మేరకు ఆదుకోగలమో అంతవరకు ఆదుకుంటామన్నారు.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాల్లో 4,89,80,362 మంది స్నానాలు చేశారని చంద్రబాబు తెలిపారు. ఊహించిన దానికంటే పెద్ద ఎత్తున జనం వచ్చారని, స్పష్టమైన ప్రణాళిక, దాన్ని తూచ తప్పక అమలుచేయడం, సమస్యలు వస్తే పరిష్కరించుకోవడం, కొత్త ఆలోచనలు వస్తే క్రోడీకరించి అమలుచేయడం ద్వారా పుష్కరాల్ని విజయవంతంగా నిర్వహించామని తెలిపారు.

 గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

పుష్కరాల్లో వివిధ సేవలకు ప్రతి రోజు మార్కులు వేశారు. ఎవరికి సగటు మార్కులు ఎన్ని వచ్చాయో ముఖ్యమంత్రి చదివి వినిపించారు. పుష్కర సమాచార కేంద్రాలకు 96, ఉచిత బస్సులకు 69.47, ట్రాఫిక్‌ నియంత్రణకు 79.61, తాగునీటి సరఫరాకు 90, ఆహార సరఫరాకు 83, పుష్కరకేంద్రాల వద్ద వసతి 84, స్నానఘట్టాల శుభ్రత 88, స్నానఘట్టాల వద్ద సూచనలు ఇచ్చే విభాగానికి 88, దుస్తులు మార్చుకునే ప్రదేశాల నిర్వహణకు 80, మరుగుదొడ్ల నిర్వహణకు 86, ప్రాథమిక చికిత్స వసతులకు 90, పురోహితుల సేవలకు 84.97, క్యూలైన్ల నిర్వహణకు 86, పోలీసులకు 86.08, భక్తులతో సిబ్బంది, అధికారుల ప్రవర్తనకు 89.63, పార్కింగ్‌ వసతులకు 82 శాతం మార్కులు వచ్చినట్టు తెలిపారు.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

గోదావరి హారతి గంగాహారతి కంటే పది రెట్లు బాగుందని యోగా గురువు రాందేవ్‌ బాబా ప్రశంసలు కురిపించారని చెప్పారు.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

పురోహితులకు రూ.100 కోట్ల ఆదాయం వచ్చిందని, వారు మంచి సేవలందించారన్నారు. అదే సమయంలో మీడియా ప్రతినిధులంటే ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ఉండే ముఖ్యమంత్రి శనివారం అభినందన సభ సందర్భంగా వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

 గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

సభ మొదలైన వెంటనే ఫొటో, వీడియోగ్రాఫర్లు దాన్ని చిత్రీకరించడానికి పోటీపడ్డారు. వారు అడ్డుగా ఉండటంతో వేదికపై ఏం జరుగుతుందో వెనుక కూర్చున్న వారికి కనిపించని పరిస్థితి ఏర్పడింది.

 గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

దీంతో ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని... ఇది ఉద్యోగుల్ని అభినందించడానికి ఏర్పాటు చేసిన సభ అని, మీడియా ప్రతినిధులు అడ్డుగా ఉండటం సరికాదని, అందరూ పక్కకు వచ్చేయాలని పదేపదే సూచించారు.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

ఒక దశలో ఆయన మరీ గట్టిగా చెప్పడంతో కొందరు మీడియా ప్రతినిధులు అందర్నీ కూడగట్టి బయటకు వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. దీన్ని గమనించిన ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

 గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

అందర్నీ పక్కకి రమ్మంటే తప్పేంటి? మీకు కుర్చీలు వేస్తామని చెప్పాం కదా? ఏం తమాషాగా ఉందా? బాయ్‌కాట్‌ చేస్తారా? శాశ్వతంగా వెళ్లిపోదామనుకుంటే వెళ్లండి, ఎవరికీ నష్టం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

ఎవరూ ఎవర్నీ డిక్టేట్‌ చేయలేరని, ప్రజాస్వామ్యంలో బాధ్యత ఉందని, తమ డ్యూటీ తాము చేస్తున్నామని, మీ డ్యూటీ మీరు చేస్తున్నారని మండిపడ్డారు.

 గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలు

ఆ తర్వాత ఆయన చల్లబడి మీడియా ప్రతినిధులపై ప్రశంసలు కురిపించారు. ప్రజలు పుష్కరాలకు విపరీతంగా వచ్చారంటే అది మీడియా చొరవే అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మీడియా ప్రతినిధులకూ ముఖ్యమంత్రి జ్ఞాపికలు అందజేశారు.

మంగళంపల్లి బాలమురళీకృష్ణకు..

మంగళంపల్లి బాలమురళీకృష్ణకు..

మంగళంపల్లి బాలమురళీ కృష్ణను సన్మానిస్తున్న దృశ్యం. ఆయన పుష్కర ముగింపు వేడుకల్లో ఆయన గాత్ర కచేరీ అందర్నీ అలరించింది.

English summary
AP Chief Minister N Chandrababu Naidu has said that the state government planned to link the Godavari river with Krishna and Penna rivers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more