వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ ఎంపీలు వీరే : వైసీపీ విజయ దుందుబి, 3 సీట్లతో సరిపెట్టుకున్న టీడీపీ

|
Google Oneindia TeluguNews

అమరావతి : ఏపీ లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ జయకేతనం ఎగురేసింది. మొత్తం 22 చోట్ల విజయదుందుబి మోగించింది. అధికార టీడీపీ మాత్రం కేవలం 3 సీట్లకు పరిమితమైంది. జనసేన పార్టీ ఖాతా తెరవలేదు. విశాఖ నుంచి బరిలోకి దిగిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా ఓడిపోయారు. ఏపీలో వైసీపీ విజయానికి కారణమేంటీ ? టీడీపీ ప్రభుత్వంపై అంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది. ఏ నియోజకవర్గంలో ఏ నేత విజయం సాధించారు. మెజార్టీ ఎవరు సాధించారనే అంశాలను ఓసారి పరిశీలిద్దాం.

వైయ‌స్ జ‌గ‌న్ అనే నేను..30వ తేదీ జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకార ముహూర్తం ఇదే : ఆయ‌న సూచ‌న మేర‌కే.. .!వైయ‌స్ జ‌గ‌న్ అనే నేను..30వ తేదీ జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకార ముహూర్తం ఇదే : ఆయ‌న సూచ‌న మేర‌కే.. .!

22 చోట్ల వైసీపీ జయకేతనం

22 చోట్ల వైసీపీ జయకేతనం

ఏపీలో మొత్తం 25 లోక్‌సభ సీట్లు ఉండగా 22 చోట్ల వైసీపీ జయకేతనం ఎగరేసింది. టీడీపీ కేవలం 3 సీట్లతో సరిపెట్టుకుంది. జనసేన ఖాతా తెరవడం ఆ పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది. అరకు నుంచి వైసీపీ అభ్యర్థి గొడ్డేటి మాధవి 2 లక్షల 21 వేల మెజార్టీతో కిశోర్ చంద్రదేవే్‌పై విజయం సాధించారు. విజయనగరం నుంచి బెల్లాన చంధ్రశేఖర్, విశాఖపట్నం నుంచి ఎంవీవీ సత్యనారాయణ గెలుపొందారు. ఎంవీవీకి టీడీపీ అభ్యర్థి భరత్ గట్టి పోటీనిచ్చారు. కేవలం 3 వేల 111 ఓట్ల తేడాతో ఎంవీవీ విజయం సాధించారు.

 వార్ వన్ సైడే ..

వార్ వన్ సైడే ..

అనకాపల్లి నుంచి జీవీ సత్యవతి, కాకినాడ నుంచి వంగా గీత, అమలాపురం నుంచి చింతా అనురాధ, రాజమండ్రి నుంచి భరత్ గెలుపొందారు. తన ప్రత్యర్థిపై భరత్ లక్షా 17 వేల మెజార్టీతో జయకేతనం ఎగరేశారు. నరసాపురంలో రఘురామ కృష్ణంరాజు, ఏలూరులో కోటగిరి శ్రీధర్ విక్టరీ కొట్టారు. శ్రీధర్ తన ప్రత్యర్థి మాగంటి బాబుపై లక్షా 61 వేల మెజార్టీతో గెలిచి రికార్డు సృష్టించారు. మచిలీటప్నం నుంచి బాలశౌరి, నరసరావుపేట నుంచి లావు కృష్ణదేవరాయలు, బాపట్ల నుంచి నందిగం సురేశ్, ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసరెడ్డి గెలుపొందారు. మాగుంట తన ప్రత్యర్థి శిద్దా రాఘవరావుపై 2 లక్షల 11 వేల 292 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

మాధవ్ గెలిచాడు

మాధవ్ గెలిచాడు

నంద్యాలలో బ్రహ్మానందరెడ్డి తన ప్రత్యర్థి శివానంద్ పై 2 లక్షల 43 వేల ఓట్ల భారీ తేడాతో ఘన విజయం సాధించారు. కర్నూలు నుంచి సంజీవ్ కుమార్, అనంతపురం నుంచి తలారి రంగయ్య, హిందూపురం నుంచి గోరంట్ల మాధవ్ గెలుపొందారు. మాధవ్ తన ప్రత్యర్థి నిమ్మల కిష్టప్పపై లక్షా 38 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. కడపలో వైఎస్ అవినాష్ రెడ్డి మరోసారి విజయం సాధించారు. తన ప్రత్యర్థి ఆదినారాయణరెడ్డిపై 3 లక్షల 71 వేల ఓట్ల తేడాతో విక్టరీ కొట్టారు.ః

3 సీట్లతో సరిపెట్టుకున్న టీడీపీ

3 సీట్లతో సరిపెట్టుకున్న టీడీపీ

నెల్లూరులో ఆదాల ప్రభాకర్ రెడ్డి, తిరుపతి నుంచి బల్లి దుర్గాప్రసాద్, రాజంపేట నుంచి పీ వీ మిథున్ రెడ్డి, చిత్తూరు నుంచి రెడ్డప్ప గెలుపొందారు. తన ప్రత్యర్థి శివప్రసాద్ ను లక్షా 34 వేల ఓట్లతో మట్టికరించాడు. శ్రీకాకుళంలో టీడీపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు, విజయవాడలో కేశినేని నాని, గుంటూరులో గల్లా జయదేవ్ గెలుపొందారు. రామ్మోహన్, నాని, గల్లా జయదేవ్ వరసుగా 8 వేలు 7 వేలు 4 వేల ఓట్ల తేడాతో బయటపడ్డారు.

English summary
Lok Sabha Election Results 2019: Check the Complete list of all winning candidates from YSRCP, TDP in Andhra Pradesh Lok Sabha elections. Also Find party wise results of Lok Sabha elections 2019 here.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X