వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుకూ సెగ: కేసీఆర్ పట్టించుకోవాలని... (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/విజయవాడ: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ధర్నా చౌక్ (ఇందిరా పార్క్) వద్ద జూనియర్ డాక్టర్లు (జుడా)లు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తమ సమస్యలను పట్టించుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఏపీ జుడాలు కూడా తెలంగాణ జుడాల ధర్నాలో పాలు పంచుకున్నారు.

మరోవైపు, విజయవాడలోను జుడాలు ఆందోళనకు దిగారు. పీజీ తర్వాత వైద్యులు విధిగా ఏడాది పాటు గ్రామాల్లో వైద్యసేవలు అందించాలనే నిబంధనను వ్యతిరేకిస్తూ విజయవాడలో జూనియర్ వైద్యులు సోమవారం విధులు నిర్వర్తిస్తూనే కొంతసేపు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వాసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా జుడాల సంఘం అధ్యక్ష కార్యదర్శులు క్రాంతికుమార్, స్నిగ్ద మాట్లాడుతూ ఏడాది పాటు గ్రామాల్లో సేవలందించాలని ఆదేశిస్తున్న ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికన గ్రామాల్లోనే తమకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌పై రేపోమాపో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్‌ను కలవనున్నామని తెలిపారు.

జుడాలు

జుడాలు

తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించేవరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని జూనియర్ డాక్టర్లు ప్రభుత్వానికి మళ్లీ మళ్లీ స్పష్టం చేస్తున్నారు.

 జుడాలు

జుడాలు

తాము చేస్తున్న పోరాటం న్యాయమైందని, తమ వెనుక ఎలాంటి కార్పోరేట్ శక్తులు లేవని చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించాలని మెడికల్ కౌన్సిల్ ఆప్ ఇండియాలో ఎక్కడా పేర్కొనలేదంటున్నారు.

 జుడాలు

జుడాలు

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ధర్నా చౌక్ (ఇందిరా పార్క్) వద్ద జూనియర్ డాక్టర్లు (జుడా)లు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు.

జుడాలు

జుడాలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తమ సమస్యలను పట్టించుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఏపీ జుడాలు కూడా తెలంగాణ జుడాల ధర్నాలో పాలు పంచుకున్నారు.

English summary
Junior doctors in AP have extended their support to the doctors in Telangana State and have joined the strike.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X