ఏపీలో స్థానిక సంస్కరణలను మెచ్చిన కేంద్రం: రూ. 2,525 కోట్ల రుణ సౌకర్యానికి అనుమతి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు కేంద్రం నుంచి ప్రశంసలు దక్కాయి. స్థానిక సంస్థల సంస్కరణల్లో ఏపీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ప్రథమ స్థానంలో నిలిచాయని పేర్కొంది. దీంతో ఈ రెండు రాష్ట్రాలకు అదనపు రుణ సౌకర్యానికి కేంద్రం అనుమతిచ్చింది.
అంజు కురియన్ క్యూట్ గ్యాలరీ.. వైరల్ అవుతున్న లవ్లీ పిక్
సంస్కరణలను అమలు చేస్తున్నందుకు గానూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ. 2,525 కోట్లు, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి రూ. 2373 కోట్లు రుణ సౌకర్యం కల్పించింది. మెరుగైన ప్రజారోగ్యం, పారిశుద్ధ్య నిర్వహణ, స్థానిక సంస్థల ఆర్థిక వనరుల బలోపేతం, మెరుగైన పౌర సేవలకు కేంద్రం గుర్తించింది.

కరోనా మహమ్మారి సంక్షోభం నేపథ్యంలో రాష్ట్రాల స్థూల దేశీయోత్పత్తి(జీఎస్డీపీ)పై రెండు శాతం అదనంగా రుణం తీసుకునే సౌకర్యం కేంద్రం కల్పించింది. నాలుగు సంస్కరణలను అమలు చేస్తేనే రుణ సౌకర్యానికి అవకాశం ఇచ్చింది. సంస్కరణలను విజయవంతంగా అమలు చేయడంతో ఏపీకి అదనపు రుణం తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది.
మోడరన్ లుక్తో మతిపోగొడుతున్న యువ హీరోయిన్.. బ్యూటిఫుల్ ఫోటో గ్యాలరీ
ఏపీలో 4 కీలక బిల్లులకు గవర్నర్ ఆమోదం
గత కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదించిన నాలుగు బిల్లులకు బుధవారం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. గవర్నర్ ఆమోదం తెలిపిన బిల్లులలో ఫిస్ ఫీడ్ క్వాలిటీ కంట్రోల్ బిల్లు, వ్యవసాయ భూముల మార్పిడి సవరణ బిల్లు, స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బిల్లు, ఎఫ్ఆర్బీఎం సవరణ బిల్లు ఉన్నాయి. గవర్నర్ బిల్లుతో ఈ నాలుగు బిల్లులు చట్టాలుగా మారాయి. గవర్నర్ పేరుపై రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.