అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ జిల్లా కరోనా ఫ్రీ అవుతుందా?: ఈ సారి సీమ జిల్లాలో భారీగా: గుంటూరులో ఒక్కటే కేసు నమోదు..!

|
Google Oneindia TeluguNews

అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతికి అడ్డుకట్ట పడట్లేదు. కరోనా తీవ్రత యధాతథంగా కొనసాగుతూనే ఉంది. ఒక జిల్లాలో తగ్గితే.. మరో జిల్లాలో భారీగా కేసులు నమోదువుతున్నాయి. ఈ పరిణామాలు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా 54 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 1887కు చేరింది. ఇందులో యాక్టివ్‌గా ఉన్నవి 1004. ఇప్పటిదాకా 842 మంది డిశ్చార్జి కాగా.. 41 మంది మృతి చెందారు. ప్రకాశం జిల్లాలో మొత్తం 61 కేసులు ఉండగా.. అందులో యాక్టివ్‌గా ఉన్నది ఒక్కటి మాత్రమే. 60 మంది ఈ జిల్లా నుంచి డిశ్చార్జి అయ్యారు.

ఎల్జీ పాలిమర్స్‌పై చర్యలకు సిద్ధం: అలాంటి కంపెనీలకు చెక్: హైపవర్ కమిటీ ఏర్పాటు: నెలరోజుల్లో..ఎల్జీ పాలిమర్స్‌పై చర్యలకు సిద్ధం: అలాంటి కంపెనీలకు చెక్: హైపవర్ కమిటీ ఏర్పాటు: నెలరోజుల్లో..

ఈ సారి అనంతలో..

ఈ సారి అనంతలో..

మొన్నటిదాకా వరుసగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతూ వచ్చిన కర్నూలు, గుంటూరు జిల్లాల్లో దాని తీవ్రత కాస్తయిన తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తోంది. 24 గంటల వ్యవధిలో అతి తక్కువ కేసులు నమోదు అయ్యాయి. ఈ సారి అనంతపురం జిల్లాలో అత్యధిక కేసులు నమోదు అయ్యాయి. ఈ రాయలసీమ జిల్లాలో 24 గంటల్లో 16 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తన తాజా బులెటిన్‌లో వెల్లడించింది. ఈ జిల్లాలో ఇప్పటిదాకా నమోదైన కేసుల సంఖ్యం 99కి చేరుకుంది. ఇప్పటిదాకా 42 మంది డిశ్చార్జి అయ్యారు. నలుగురు మరణించారు. దీనితో ఈ జిల్లాలో యాక్టివ్‌గా ఉన్న కేసుల సంఖ్య 53.

 కర్నూలు-7, గుంటూరులో ఒక్కటే..

కర్నూలు-7, గుంటూరులో ఒక్కటే..

ఇప్పటిదాకా రాష్ట్రంలో అత్యధిక పాజిటివ్ కేసులు నమోదై జిల్లాల్లో గుంటూరు, కర్నూలు జిల్లాలు పోటీ పడుతుండేవి. అలాంటి ఈ రెండు చోట్ల కరోనా కేసులు అతి తక్కువగా నమోదు అయ్యాయి. కర్నూలులో 7, గుంటూరులో ఒక పాజిటివ్ కేసు మాత్రమే నమోదైందని అధికారులు తెలిపారు. కర్నూలులో మొత్తం కేసుల సంఖ్య 547కు చేరుకుంది. ఇందులో యాక్టివ్‌గా ఉన్నవి 342. ఇప్పటిదాకా 191 మంది డిశ్చార్జి అయ్యారు. 14 మంది మృత్యువాత పడ్డారు. 24 గంటల్లో గుంటూరులో ఒక్క కేసే నమోదైంది. ఇక్కడ యాక్టివ్ కేసులు 202 కాగా.. 164 మంది డిశ్చార్జి అయ్యారు. ఎనిమిది మంది చనిపోయారు.

విశాఖపట్నంలో ఆందోళనకరంగా..

విశాఖపట్నంలో ఆందోళనకరంగా..

కొద్దిరోజుల కిందటి దాకా పరిమితంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతూ వచ్చిన విశాఖపట్నంలో జిల్లాలో వాటి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. 24 గంటల్లో కొత్తగా 11 కేసులు వెలుగు చూశాయి. ఫలితంగా- మొత్తం కేసుల సంఖ్య 57కు చేరుకుంది. 23 మంది డిశ్చార్జి కాగా.. యాక్టివ్ కేసులు 33కు చేరుకుంది. వైరస్ వల్ల విశాఖలో ఇప్పటిదాకా మరణించింది ఒక్కరే. 24 గంటల్లో కొత్తగా చిత్తూరు-3, కృష్ణా-6, విజయనగరం- ఒకటి, పశ్చిమ గోదావరి 9 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గుజరాత్ నుంచి స్వస్థలానికి వచ్చిన వారిలో 16, కర్ణాటక వచ్చిన వారిలో ఒక కేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు.

Recommended Video

Vizag Gas Leak: PM Modi Assures All Help To Andhra CM
ప్రకాశం.. కరోనా ఫ్రీ జిల్లా అవుతుందా?

ప్రకాశం.. కరోనా ఫ్రీ జిల్లా అవుతుందా?

జిల్లావారీగా మొత్తం కేసులు అనంతపురం-99, చిత్తూరు-85, తూర్పు గోదావరి-46, గుంటూరు-374, కడప-96, కృష్ణా-322, కర్నూలు-547, నెల్లూరు-96, ప్రకాశం-61, శ్రీకాకుళం-5, విశాఖపట్నం-57, విజయనగరం-1, పశ్చిమ గోదావరి-9 ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న కేసు ఒక్కటి మాత్రమే. ఈ జిల్లా నుంచి 60 మంది పూర్తిగా కోలుకున్నారు. ఆసుప్రతుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఈ ఒక్క కేసు కూడా లేకపోతే.. కరోనా రహిత జిల్లాగా మారుతుంది. కనీసం వారంరోజుల పాటు కొత్త కేసులేవీ నమోదు కాలేకపోతే.. దాన్ని కరోనా ఫ్రీ జిల్లా మార్చుతారు.

English summary
Newly 54 Covid-19 Coronavirus positive cases have been reported in Andhra Pradesh past 24 hours. The Total number of Positive cases have reached at 1887. 54 out of 7,320 samples tested were positive and 62 people recovered from COVID 19 and got discharged.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X