గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీ రీపోలింగ్: ఏపీలో ఐదు పోలింగ్ కేంద్రాల్లో జరిగిన ఓటింగ్‌కు సంబంధించిన సమాహారం

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో తొలివిడత పోలింగ్‌ సందర్భంగా పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణ వాతావరణం నెలకొనడంతో అక్కడ పోలింగ్ పై ఎన్నికల సంఘానిక ఫిర్యాదులు అందాయి. విచారణ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా 5 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చింది. దీంతో ఏపీలో ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ ప్రారంభమైంది. నరసారావుపేట అసెంబ్లీ పరిధిలోని కేసనపల్లిలోని 94వ పోలింగ్ కేంద్రం,గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని నల్లచెరువులో ఉన్న 244 పోలింగ్ కేంద్రం, నెల్లూరు శాసనసభ నియోజకవర్గంలోని పల్లెపాలెంలోని ఇసుకపల్లి 41వ పోలింగ్ కేంద్రం, నెల్లూరు జిల్లా సుళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని అటకానితిప్పలోని 197వ పోలింగ్ కేంద్రం, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పరిధిలోని కలనూతలలో ఉన్న 247వ పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ కొనసాగుతోంది.

Andhra Pradesh Repolling : Repolling in AP live upadates

రీపోలింగ్‌కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎవరైనా అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే ఈసీ హెచ్చరించింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగుస్తుంది.

Newest First Oldest First
7:16 PM, 6 May

అటకానితిప్పలో 83.15 శాతం పోలింగ్
7:16 PM, 6 May

కలనూతలలో 75.61 శాతం పోలింగ్
7:15 PM, 6 May

నల్లచెరువులో కేంద్రంలో 75.4 శాతం పోలింగ్
7:15 PM, 6 May

ఇసుకపాలెంలో 75.55 శాతం పోలింగ్
7:15 PM, 6 May

కేసానుపల్లిలో 89.23 శాతం పోలింగ్ నమోదు
7:15 PM, 6 May

ఏపీ

ఏపీలో 5 చోట్ల ముగిసిన రీ పోలింగ్
10:55 AM, 6 May

గుంటూరు వెస్ట్

ఉదయం 9 గంటల సమయానికి 13.91శాతం పోలింగ్ నమోదు
10:53 AM, 6 May

గుంటూరు

నల్లచెరువు పోలింగ్ కేంద్రానికి పసుపు కండువాతో వచ్చిన టీడీపీ నేత గల్లా జయదేవ్..తీవ్ర అభ్యంతరం తెలిపిన వైసీపీ
9:27 AM, 6 May

ఓటు హక్కు వినియోగించుకునేందుకు భారీగా తరలివచ్చిన ఓటర్లు
9:27 AM, 6 May

నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇసుకపాలెంలో రీ పోలింగ్‌
9:27 AM, 6 May

ప్రకాశం జిలా ఎర్రగొండపాలెం పరిధిలోని కలనూతలలో ప్రశాంతంగా సాగుతున్న పోలింగ్
9:27 AM, 6 May

సరసరావుపేట మండలం కేసానుపల్లిలో 80 ఓట్లు పోల్‌
9:27 AM, 6 May

గుంటూరు వెస్ట్‌ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్‌ నంబర్‌ 244లో 132 ఓట్లు పోల్
6:38 AM, 6 May

ఉదయం నుంచే ఓటువేసేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న ఓటర్లు
6:35 AM, 6 May

పోలింగ్‌కు అంతా సిద్ధం చేసిన అధికారులు
5:22 AM, 6 May

ప్రకాశం జిల్లా

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పరిధిలోని కలనూతలలో ఉన్న 247వ పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్
5:22 AM, 6 May

నెల్లూరు జిల్లా

నెల్లూరు జిల్లా సుళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని అటకానితిప్పలోని 197వ పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్
5:22 AM, 6 May

నెల్లూరు జిల్లా

నెల్లూరు శాసనసభ నియోజకవర్గంలోని పల్లెపాలెంలోని ఇసుకపల్లి 41వ పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్
5:21 AM, 6 May

గుంటూరు జిల్లా

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని నల్లచెరువులో ఉన్న 244 పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్
5:20 AM, 6 May

గుంటూరు జిల్లా

నరసారావుపేట అసెంబ్లీ పరిధిలోని కేసనపల్లిలోని 94వ పోలింగ్ కేంద్రంలో రీసోలింగ్
5:20 AM, 6 May

ఆంధ్రప్రదేశ్‌లో తొలివిడత పోలింగ్‌ సందర్భంగా పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణ
5:15 AM, 6 May

ఆంధ్రప్రదేశ్‌లో ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్

English summary
The Andhra Pradesh state elections commission is all set to organise repolling in five polling centres in the state on May 6th"All the arrangements have been made for the smooth conduct of the polls in these areas," said Chief Electoral Officer Gopala Krishna Dwivedi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X