వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళలకు పెద్దపీట: ఏపీలోని 16 మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లకు రిజర్వేషన్ ఖరారు

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లోని 16 మున్సిపల్ కార్పొరేషన్లకు ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసింది. బీసీ మహిళ, జనరల్ కోసం ఐదు కార్పొరేషన్లను కేటాయించారు. మహిళ జనరల్ కూడా ఐదు కార్పొరేషన్లు కాగా.. 3 కార్పొరేషన్ల రిజర్వేషన్లకు జనరల్ కేటాయించారు. ఎస్సీలకు రెండు, ఎస్టీలకు ఒక కార్పొరేషన్ కేటాయించారు. కార్యదర్శి శ్యామలరావు శనివారం ఉత్తర్వులు జారీచేశారు.

 andhra pradesh: Reservations finalised for posts of mayor

ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ల రిజర్వేషన్లను ప్రభుత్వం విడుదల చేసింది. శ్రీకాకుళం బీసీ మహిళ, విజయనగరం బీసీ మహిళ, విశాఖ బీసీ జనరల్, రాజమండ్రి జనరల్, కాకినాడ జనరల్ మహిళ, ఏలూరు జనరల్ మహిళ, విజయవాడ జనరల్ మహిళ, మచిలీపట్నం జనరల్ మహిళ, గుంటూరు జనరల్, ఒంగోలు ఎస్సీ మహిళ, నెల్లూరు ఎస్టీ జనరల్, తిరుపతి జనరల్ మహిళ, చిత్తూరు ఎస్సీ జనరల్, కడప బీసీ జనరల్, అనంతపురం జనరల్, కర్నూలు బీసీ జనరల్ కేటాయించారు.

శనివారం స్థానిక సంస్థలతోపాటు మున్సిపాలిటీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. మున్సిపాలిటీలకు మార్చి 9వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేస్తారు. 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 14వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ విత్ డ్రా కోసం రెండు రోజుల సమయం ఇచ్చారు. 23వ తేదీన మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహిస్తారు. 27వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టి.. అదేరోజు ఫలితాలను ప్రకటించారు.

English summary
Reservations finalised for posts of mayor in 16 corporations in andhra pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X