వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిఫాల్టర్ల జాబితాలోకి 'ఆప్కాబ్', బాబు అప్రమత్తం..!

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

విజయవాడ: బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించడంలో విఫలమయ్యే సంస్ధలను డిఫాల్టర్లుగా ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈ జాబితాలో సాధారణంగా ప్రైవేట్ కంపెనీలు ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ డిఫాల్టర్ల జాబితాలో ప్రభుత్వ రంగ సంస్ధలు కూడా చేరుతున్నాయి.

వివరాల్లోకి వెళితే.. తాజాగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్ (ఆప్కాబ్) కూడా చేరబోతోంది. తీసుకున్న రుణంలో కనీసం వడ్డీ కూడా కట్టని ఆప్కాబ్‌ను డిఫాల్టర్‌గా ప్రకటించేందుకు నాబార్డ్ సిద్ధమవుతోంది.

Andhra Pradesh State Cooperative Bank to be declared defaulter

గత ఏడాది రైతు రుణాల పేరిట నాబార్డ్ నుంచి రూ. 9 వేల కోట్లను రుణంగా తీసుకున్న ఆప్కాబ్, వాటిని జిల్లాలవారీగా ఉన్న తమ శాఖలు డీసీసీబీలకు పంపింది. డీసీసీబీలు రైతులకు రుణాల రూపేనా డబ్బుని అందజేశారు. తిరిగి రైతుల నుంచి వసూలు చేయడంతో విఫలమయ్యారు. దీంతో డీసీసీబీల నుంచి వడ్డీ కూడా ఆప్కాబ్‌కు జమ కాలేదు. ఈ నేపథ్యంలో ఆప్కాబ్ కూడా నాబార్డ్‌కు ఎటువంటి చెల్లింపులు జరపలేదు.

ఈ పరిస్ధితిని ముందే వస్తుందని ఊహించిన మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఈ పరిస్థితిని ముందే పసిగట్టిన ఎంపీ యలమంచిలి శివాజీ, ఏపీ సీఎం చంద్రబాబునాయుడును అప్రమత్తం చేసి.. వడ్డీ కింద కనీసం రూ. 400 కోట్లైనా చెల్లిద్దామన్న చంద్రబాబును కొంతమంది రాజకీయ నేతలు తప్పుదోవ పట్టించడంతో ఈరోజు ఆప్కాబ్‌కు ఈ దుస్థితి పట్టిందని శివాజీ ఆరోపించారు.

English summary
For the first time in the history, Andhra Pradesh State Cooperative Bank (APCOB) is heading to get the tag of 'defaulter' from National Bank for Agriculture and Rural Development (Nabard).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X