అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కంగుతిన్న ఇంటిలిజెన్స్ అధికారులు: ఐసిస్ వీడియోలో ఏపీ విద్యార్ధి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్ధ ఐసిస్ అమెరికాలో చదువుకుంటున్న భారత విద్యార్ధులను టార్గెట్ చేసింది. అమెరికాలో విద్యను అభ్యసిస్తున్న భారతీయ విద్యార్ధులను తమవైపు ఆకర్షించుకుంటోంది. తాజాగా ఐసిస్ ఉగ్రవాదులు విడుదల చేసిన ఓ వీడియోనే ఇందుకు నిదర్శనం.

అమెరాకాలోని టెక్సాస్‌లో ఇంజనీరింగ్ చదువుతున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థితో భారత్‌లో దాడులు చేస్తామని వీడియో రూపంలో రికార్డ్‌ చేసి దానిని విడుదల చేశారు. మే 19న విడుదల చేసిన ఈ 22 నిమిషాల నిడివి ఉంది. ఈ వీడియోని పరిశోధించిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), ఇంటిలిజెన్స్ అధికారులు ఇందులో ఆరుగురు భారతీయ విద్యార్థులు ఉన్నట్టు పేర్కొంది.

Andhra Pradesh student in Texas identified in ISIS video

ఈ వీడియోలో ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్‌కు చెందిన మహ్మద్ సాజిత్ అలియాస్ బాబా సాజిద్, ఫారూక్ అల్ హిందీ అలియాస్ అబురషీద్‌గా గుర్తించారు. వీరితో పాటు మహారాష్ట్రలోని కళ్యాణ్‌కు చెందిన అబు సల్హా అల్ హిందీ, ఫహద్ షేక్ అలియాస్ అబు అమర్ అల్ హిందీ, థానేకు చెందిన అమన్ తాండ్లే అలియాస్ అబు సల్మాన్ అల్ హిందీ, షాహామ్ థాంకీ ఉన్నారు.

ఐసిస్ ఉద్రవాదుల కార్యకలాపాలపై నిఘా ఉంచిన ఇంటిలిజెన్స్ అధికారులకు ఈ వీడియోలో ఇంజనీరింగ్ విద్యార్ధి ఉన్నాడని తెలియడంతో కంగుతిన్నారు. దీంతో ఐసిస్‌లో చేరిన భారతీయుల సంఖ్య 25 నుంచి 40కు చేరింది. దీనిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటోందని, ఐసిస్‌ను అంతం చేస్తామని చెప్పారు.

English summary
In what is probably the first incident of its kind, terror outfit Islamic State (ISIS) has successfully managed to radicalise and rope in an Indian studying in the United States. The student, who hails from Andhra Pradesh and was pursuing engineering in Texas, figures in the latest video released by the terror outfit threatening to carry out attacks against India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X