వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో కరోనా కల్లోలం: వారంలో 20 వేల పాజిటివ్ కేసులు, దేశంలో కరోనా కేసుల్లో ఐదో స్థానం..

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్కరోజు 5 వేల 41 కేసులు నమోదవడంతో ఆందోళన నెలకొంది. ఇప్పటివరకు మహారాష్ట్ర, తమిళనాడు తప్ప మిగతా రాష్ట్రాల్లో 5 వేల పైచిలుకు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలే. గత 4 రోజుల్లో ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. 7.9 శాతం పెరుగుదలతో రోజు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.

Recommended Video

Corona Booming In Rainy Season కురుస్తున్న వర్షాలే కరోనాకు కారణమా.? మూల్యం చెల్లిస్తున్నామా ?

గత వారం రోజుల్లో ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి. మొత్తం పాజిటివ్ కేసులు 50 వేలు కాగా.. 40 శాతం అంటే 20 వేల పాజిటివ్ కేసుల్లో వారం రోజుల్లోనే నమోదవడం గమనార్హం. ఇది వైరస్ ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక కన్నా ఎక్కువ అని గణాంకాలు చెబుతున్నాయి. వైరస్ కేసులు పెరగడంతో ఎక్కువ నమోదవుతున్న జాబితాలో ఏపీ ఐదో స్థానంలోకి చేరింది. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక.. ఒకటి, రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.

Andhra pradesh surges in Coronavirus case load, so does India..

దేశంలో కూడా కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఆదివారం 3.4 శాతం జాతీయ వృద్దితో 40 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నెల 5వ తేదీ తర్వాత మరోసారి 40 వేల మార్క్ పాజిటివ్ కేసులు వచ్చాయి. దేశంలో పాజిటివ్ కేసులు సంఖ్య 11.18 లక్షలకు చేరగా.. 7 లక్షలకు పైచిలుకు మంది వైరస్ తగ్గింది. కానీ 27 వేల 500 మంది చనిపోయారు.

English summary
Andhra Pradesh reported as many as 5,041 new cases. No other state, except Maharashtra and Tamil Nadu, have ever gone beyond the 5,000 mark in a single day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X