విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తప్పిన ప్రమాదం: విశాఖ-హైదరాబాద్ విమానాన్ని ఢీకొన్న అడవిపంది, అసలేం జరిగిందంటే?

ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకున్న ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానానికి పెద్ద ప్రమాదమే తప్పింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

|
Google Oneindia TeluguNews

Recommended Video

IndiGo flight hits wild boar at Visakhapatnam airport

విశాఖపట్నం: ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకున్న ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానానికి పెద్ద ప్రమాదమే తప్పింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఆదివారం రాత్రి 10.30గంటల సమయంలో ఇండిగో విమానం విశాఖపట్నం నుంచి హైదరాబాద్ బయలు దేరింది.

 టైర్లను ఢీకొట్టిన అడవిపంది

టైర్లను ఢీకొట్టిన అడవిపంది

అయితే, విమానం టేకాఫ్ సమయంలో రన్‌వేపైకి దూసుకొచ్చిన అడవిపంది విమానం టైరును ఢీకొట్టింది. అప్పటికి విమానం టైర్లు ముడుచుకోకపోవడంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని సుమారు గంటపాటు విశాఖపట్నంలోనే ఆకాశంలో చక్కర్లు కొట్టించి ఆ తర్వాత సేఫ్‌గా ల్యాండ్ చేశాడు.

 మరమ్మతుల అనంతరం..

మరమ్మతుల అనంతరం..

అనంతరం విమానానికి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేశారు. టైర్లలో చిక్కుకున్న పంది మాంసం ముద్దలను తొలగించి.. ప్రమాదం లేదని నిర్ధారించాక విమానం హైదరాబాద్ బయలుదేరింది.

విశాఖలోనే చక్కర్లు.. భయపడిన ప్రయాణికుల

విశాఖలోనే చక్కర్లు.. భయపడిన ప్రయాణికుల

విమానం సుమారు గంటపా విశాఖపట్నంలోనే గగనతలంపైనే తిరిగి తిరిగి మళ్లీ విశాఖ విమానాశ్రయంలోనే ల్యాండ్ కావడంతో ఏం జరిగిందో తెలియక ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు.

 ఆ పంది ఎలా వచ్చింది..?

ఆ పంది ఎలా వచ్చింది..?

ఆ తర్వాత విషయం తెలిసి పెద్ద ప్రమాదం తప్పిందంటూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ విమానంలో సుమారు వందమంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. కాగా, విమానాశ్రయం రన్ వేపైకి అడవిపంది(ముళ్లపంది) ఎలా వచ్చిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

English summary
A wild boar hist a Hyderabad-bound IndiGo aircraft that was carrying nearly 100 passengers and crew during take off at 10.30 pm on Sunday. Sources said that the wild boar appeared on the runway just as the aircraft was taking off. With no chance of avoid, the pilot continued the aborting take-off run.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X