• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆంధ్రా కోడలి చేతుల మీదుగా ఆంధ్రా బ్యాంకు కనుమరుగు

|
  బ్యాంకుల విలీనాలను ప్రకటించిన నిర్మలా సీతారామన్ || Nirmala Sitharaman Press Meet Highlights

  మచిలీపట్నం: దశాబ్దాల చరిత్ర ఉన్న ఆంధ్రా బ్యాంకు ఇక కనుమరుగు కానుంది. కొన్ని సంవత్సరాల పాటు నిరంతరాయంగా ఖాతాదారులకు సేవలందిస్తూ వచ్చిన ఈ బ్యాంకు పేరు ఇక ఎక్కడా కనిపించకపోవచ్చు. ఇకపై ఆంధ్రా బ్యాంకు స్థానంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే పేరు కనిపిస్తుంది. ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య ఏర్పాటు చేసిన ఆంధ్రా బ్యాంకు.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్ లలో విలీనం కానుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. శుక్రవారం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ఆంధ్రా కోడలిగా గుర్తింపు ఉన్న నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ఆంధ్రా బ్యాంకు కనుమరుగు కానుడటం ప్రాధాన్యత సంతరించుకుంది.

  ఆంధ్రా బ్యాంకులాగే..రాష్ట్రీయతను ప్రతిబింబించే పేరు ఉన్న బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రను కేంద్ర ప్రభుత్వం విలనీం చేయదలచుకోలేదు. ఆ బ్యాంకును ఆర్థికంగా మరింత బలోపేతం చేయాలని నిర్ణయించుకుంది. ఆంధ్రా బ్యాంకు తరువాత ఆ స్థాయిలో తెలుగువారికి పరిచితమైన సిండికేట్ బ్యాంక్ సైతం తెరమరుగు కానుంది. సిండికేట్ బ్యాంకు.. కెనరా బ్యాంకులో విలీనం కాబోతోంది.

   భోగరాజు పట్టాభి స్వప్నం..

  భోగరాజు పట్టాభి స్వప్నం..

  కృష్ణాజిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య 1923లో ఆంధ్రా బ్యాంకును ప్రారంభించారు. మచిలీపట్నం కేంద్రంగా 1923 నవంబర్ 20వ తేదీన ఈ బ్యాంకు తన కార్యకలాపాలను ఆరంభించింది. ఈ ఏడాది మార్చి 31వ తేదీన 2017-2018 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఆంధ్రాబ్యాంకునకు దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 2885 శాఖా కార్యాలయాలు ఉన్నాయి. 38 శాటిలైట్ కార్యాలయాలు, 3798 ఏటీఎంలు ఖాతాదారులకు అందుబాటులో ఉన్నాయి. వాటన్నింటి ప్రధాన కార్యాలయం మన హైదరాబాద్ లోనే ఉంది. కోఠి సుల్తాన్ బజార్ వద్ద ఉన్న ఆంధ్రా బ్యాంకు ప్రధాన కార్యాలయం నుంచే వాటి పర్యవేక్షణ కొనసాగుతోంది. ఈ బ్యాంకులో కేంద్ర ప్రభుత్వానికి 90.85 శాతం షేర్ క్యాపిటల్ ఉండగా.. మిగిలిన వాటా జీవిత బీమా సంస్థ ఆధీనంలో ఉంది.

  వైసీపీ, టీడీపీ నేతల మధ్య ముదురుతున్న ట్వీట్ల యుద్ధం: 420 తాతయ్యా అంటూ!

  1969లో జాతీయీకరణ..

  1969లో జాతీయీకరణ..

  1969లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ బ్యాంకులను జాతీయం చేశారు. ఆ ఏడాది జులైలో నాటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి మొరార్జి దేశాయ్ బ్యాంకుల జాతీయీకరణను ప్రకటించారు. అప్పటి దాకా స్వతంత్ర వ్యవస్థగా పనిచేసిన ఆంధ్రా బ్యాంకు కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లింది. ఆంధ్రా బ్యాంకు ఒక్కటే కాదు.. అప్పటికే దేశవ్యాప్తంగా పదుల సంఖ్యలో ఉన్న బ్యాంకులన్నీ జాతీయం అయ్యాయి. తాజాగా తన ఉనికిని కోల్పోనుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రాబ్యాంకు, కార్పొరేషన్ బ్యాంక్ లను విలీనం చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ మూడింట్లో యూనియన్ బ్యాక్ ఆఫ్ ఇండియా.. యాంకర్ బ్యాంక్ గా ఆవిర్భవిస్తుంది. విలీనం తరువాత..14.58 లక్షల కోట్ల రూపాయల డిపాజిట్లతో దేశంలో అయిదో అతి పెద్ద బ్యాంకుగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడుతుంది.

  ఈ మూడు మాత్రమే కాకుండా..

  ఈ మూడు మాత్రమే కాకుండా..

  పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనం కాబోతున్నాయి. ఈ మూడింట్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ యాంకర్ బ్యాంక్ గా ఆవిర్భవించబోతోంది. అలాగే- అలహాబాద్ బ్యాంకు ఇండియన్ బ్యాంకులో విలీనం అవుతుంది. ఆంధ్రా బ్యాంకు తరువాత ఆ స్థాయిలో తెలుగువారికి పరిచితమైన సిండికేట్ బ్యాంక్ సైతం తెరమరుగు కానుంది. సిండికేట్ బ్యాంకు.. కెనరా బ్యాంకులో విలీనం కాబోతోంది.

  English summary
  Finance Minister Nirmala Sitharaman on Friday announced a mega consolidation plan for public sector banks, with Union Bank of India, Andhra Bank and Corporation Bank getting merged into a single entity. Sitharaman said that the merger of these state-owned banks would make it the fifth largest bank of the country with business of Rs 14.59 lakh crore, which is nearly two times of Union Bank of India.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
  X