వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూటు మార్చిన టీడీపీ- ఒకే అంశంపై అందరూ.. ఇవాళ మడ అడవుల ధ్వంసం...

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఏ ఒక్క అవకాశం వచ్చినా దాన్ని వదులుకోవడానికి టీడీపీ ఇష్టపడదు. అయితే విమర్శించే విషయంలో అప్పుడప్పుడూ ప్లాన్ లో మార్పులు చేర్పులు ఉంటాయి. తాజాగా ఇదే కోవలో టీడీపీ అధినాయకత్వం ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని ప్రకారం ప్రతీ రోజూ ఏదో ఒక అంశాన్ని తీసుకుని దానిపైనే రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నేతలంతా విమర్శలు చేసేలా ప్లాన్ తయారు చేసినట్లు తెలుస్తోంది. అలాగైతేనే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని, సమస్య జనంలోకి వెళ్తుందని టీడీపీ భావిస్తున్నట్లుంది.

 రూటు మార్చిన టీడీపీ...

రూటు మార్చిన టీడీపీ...

గతేడాది ఏపీలో అధికారం కోల్పోయిన నాటి నుంచి తిరిగి గాడిన పడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న టీడీపీకి ఏదీ కలిసి రావడం లేదు. ప్రభుత్వాన్ని విమర్శించేందుకు వైసీపీ ఎలాంటి అవకాశం ఇవ్వడం లేదు. తాజాగా విశాఖ గ్యాస్ లీక్ ఘటనలోనూ బాధితులకు 20 లక్షల పరిహారం డిమాండ్ చేస్తే ప్రభుత్వం ఏకంగా కోటి రూపాయలు ఇచ్చేసింది. దీంతో విస్తుపోవడం టీడీపీ వంతయింది. ఇంగ్లీష్ మీడియాన్ని వ్యతిరేకిస్తే బడుగు బలహీన వర్గాల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్న విమర్శలు ఎదురయ్యాయి. దీంతో ఇంగ్లీష్ మీడియం విషయంలోనూ టీడీపీ ముందడుగు వేయలేని పరిస్ధితి. దీంతో ఈసారి రూటు మార్చాలని టీడీపీ నిర్ణయించుకుంది. దీని ప్రకారం ప్రభుత్వాన్ని విమర్శించే విషయంలో ఏకరూపత పాటించాలని నిర్ణయించింది.

 రోజుకో అంశం- అందరూ అదే మాట్లాడేలా....

రోజుకో అంశం- అందరూ అదే మాట్లాడేలా....

ప్రస్తుతం ఏపీలో నెలకొన్న పరిస్ధితుల్లో సమస్యలు లేవా అంటే అవునని చెప్పలేని పరిస్ధితి. అయితే వాటిని వెలికితీసి ప్రభుత్వాన్ని ఇరుకనపెట్టే ప్రణాళిక విపక్షాల వద్ద లేకపోవడమే అసలు సమస్య. దీంతో తమ దృష్టికి వచ్చిన అంశాలపై సైతం టీడీపీ మొక్కుబడిగా మా్ట్లాడి వదిలేసే పరిస్ధితి. దీనికి చెక్ పెడుతూ రాష్ట్రం దృష్టిని ఆకర్షించే ఏ సమస్య అయినా ఇకపై రోజుకొకటిగా తీసుకుని.. దానిపై జిల్లాలకు అతీతంగా నేతలంతా స్పందించేలా ప్లాన్ సిద్దం చేసినట్లు తెలిసింది. అప్పుడు సమస్యపై రాష్ట్రవ్యాప్తంగా ఒకే స్పందన వస్తుందని టీడీపీ అంచనా వేస్తోంది.

 ఇవాళ అంశం మడ అడవుల నరికివేత...

ఇవాళ అంశం మడ అడవుల నరికివేత...

తాజాగా వైసీపీ ప్రభుత్వం పేదల ఇళ్ల స్ధలాల కోసం తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ సమీపంలో మడ అడవులను నరికివేసింది. దీనిపై జాతీయ హరిత ట్రైబ్యునల్ స్పందించి విచారణ జరుపుతోంది. దీంతో ఈ విషయాన్ని రాష్ట్రంలో ప్రజలందరి దృష్టికి తీసుకెళ్లేందుకు అధిష్టానం సిద్ధమైంది. హై కమాండ్ ఆదేశాలతో ఇవాళ ఏపీలో టీడీపీ నేతలంతా ఇదే అంశంపై అన్ని మాధ్యమాల్లోనూ స్పందిస్తున్నారు.

టీడీపీ నేతలు ఇవాళ సామాజిక మాధ్యమాల్లో పెట్టిన కొన్ని ట్వీట్లు, పోస్ట్ లు గమనిస్తే...


ముఖ్య‌మంత్రి గారూ! మీరు వంద‌ల ఎక‌రాల్లో లోట‌స్‌పాండ్ క‌ట్టారు. య‌ల‌హంక ప్యాలెస్ నిర్మించారు. తాడేప‌ల్లి రాజ‌సౌధం ఏర్ప‌ర‌చుకున్నారు. కానీ మీరు ధ్వంసం చేసిన వంద‌ల ఎక‌రాలు మ‌డ అడ‌వుల‌ను తిరిగి నిర్మించ‌గ‌ల‌రా?
#SaveMadaForestFromJagan


@BTNaidu.


జీవ వైవిధ్యంలో కీలకపాత్ర పోషించే మడ అడవులను నరికేయడం క్షమించరాని నేరం @ysjagan గారు...

#SaveMadaForestFromJagan

@సోమిరెడ్డి చంద్రమోహన్

ప్ర‌జావేదిక కూల్చిన‌ప్పుడే మీ విధ్వంసం ఏస్థాయిలో ఉంటుందో ప్రజలకి అర్థ‌మైంది వంద‌ల ఏళ్లక్రితం ఏర్ప‌డిన‌ మ‌డఅడ‌వుల్ని వంద రోజుల్లో కూక‌టివేళ్ల‌తో నరికేశారు సునామి 7తుఫాన్ల నుండి తీరప్రాంతాన్ని కాపాడిన మడ అడవులని ఎన్నేళ్ల‌యినా ఎన్నివేలకోట్లిస్తే తేగలమో ప్రజలకి చెప్పండి @ysjaganగారు


@దేవినేని ఉమ

కాకినాడ మడ అడవులు ప్రకృతి ఇచ్చిన వరం. తుఫాన్ నుంచి కాకినాడన్ని కాపాడే రక్షణ కవచం. మడ అడవులను ఎలా నరికేసి,మట్టి నింపేసారో చూడండి. అటువంటి వాటిని పరిరక్షించుకునే బాధ్యత మన అందరిది.
#SaveMadaForestFromJagan


@మాగంటి రూప

కాకినాడకు పెట్టని కోటలా ఉండి తుఫానులు, ఉప్పెనల నుండి రక్షణ ఇచ్చే మడ అడవులను ఎలా నరికేసి, పూడ్చేసారో చూడండి. ప్రజలందరూ, దీనిని ఖండించాలని మనవి.

#SaveMadaForestFromJagan


@నిమ్మకాయల చిన్న రాజప్ప

ఇంతకాలం మనల్ని ప్రకృతి వైపరీత్యాల నుండి కాపాడుతున్న మడ అడవులను నరికేయడానికి మనస్సు ఎలా వచ్చింది సీఎం గారూ?
#SaveMadaForestFromJagan ht

@BV జయనాగేశ్వర్ రెడ్డి

కాపాడాల్సిన వారే కాటేస్తుంటే తన కష్టాన్ని చెప్పుకోవడానికి మడ అడవికి మాటలు రావు.ఇంతకాలం మనల్ని ప్రకృతి వైపరీత్యాల నుండి కాపాడుతున్న మడ అడవులను నరికేయడానికి మనస్సు ఎలా వచ్చింది @ysjagan గారూ
#SaveMadaForestFromJagan


@పంచమర్తి అనురాధ

English summary
telugu desam party have choosed new plan to criticise ruling ysrcp govt in andhra pradesh. according to the orders from the tdp high command tdp leaders have been choosing an agenda for every day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X