వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీ సెంటిమెంట్, కేసీఆర్ విన్లేదు: బాధ వెళ్లగక్కిన బాబు! (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: విద్యుత్, తెలంగాణ అభివృద్ధిపై చర్చించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎన్నోసార్లు ఆహ్వానించినా ఆయన ముఖం చాటేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం అన్నారు. వరంగల్ జిల్లాలో గురువారం రాత్రి జరిగిన తెలంగాణ టీడీపీ వరంగల్ జిల్లా ప్రతినిధుల సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు.

తెలుగు ప్రజలు భౌగోళికంగా విడిపోయినా మానసికంగా కలిసి ఉండాలన్నదే తన ఉద్దేశమన్నారు. రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలు సంతోషంగా ఉండాలనే తాను కోరుకుంటున్నానని చెప్పారు. రెండు రాష్ట్రాల్లో తలెత్తిన సమస్యలను కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారమవుతాయని, అందుకు కేసీఆర్ ముందుకు రావడం లేదన్నారు. విభజన చట్టంలో కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పారు.

విభజన తరువాత ఒక పద్ధతి ప్రకారం కలిసి ఇద్దరికీ ఆమోద్యయోగంగా పరిష్కరించుకుందామని, లేదంటే పెద్దమనుషుల సమక్షంలో, అదీ కాదంటే కేంద్రం సమక్షంలోనైనా చర్చించుకుందామన్నా కూడా ఆయన వినడం లేదని చెప్పారు. విభజన తరువాత తెలంగాణలో కరెంటు కష్టాలు ఉంటాయని తాను ముందే చెప్పానన్నారు.

అందుకే తాను ముందు జాగ్రత్తగా 2 వేల మెగావాట్ల విద్యుత్ యూనిట్‌కు రూ.5.70 రూపాయలకే కొనుగోలు చేశానన్నారు. బొగ్గు దిగుమతి లేకున్నా తాను దిగుమతి చేసుకున్నానని చెప్పారు. అసలే ఆంధ్రప్రదేశ్‌లో ఆదాయం లేదని, అయినప్పటికీ ముందుచూపుతో తాను విద్యుత్ కొనుగోలు చేశానన్నారు. తెలంగాణకు కూడా విద్యుత్ ఇస్తానని తాను ఏనాడో చెప్పానని, అయినప్పటికీ కేసీఆర్ నుండి స్పందన లేదన్నారు.

 చంద్రబాబు

చంద్రబాబు

నా జీవితంలో చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయబోనని చంద్రబాబు స్పష్టం చేశారు. హన్మకొండలోని హయగ్రీవాచారి మైదానంలో జరిగిన టీడీపీ జిల్లా ప్రతినిధుల సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి చంద్రబాబు ఉద్వేగంగా 50 నిమిషాలపాటు ప్రసంగించారు.

 చంద్రబాబు

చంద్రబాబు

తాను ఓ కుటుంబ పెద్దలా ఆలోచిస్తానన్నారు. తన చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అన్యాయం చేయబోనన్నారు. భౌగోళికంగా రెండు రాష్ట్రాలుగా విడిపోయినా మానసికంగా కలిసి ఉందామని పిలుపునిచ్చారు.

 చంద్రబాబు

చంద్రబాబు

తెలంగాణ రాష్ట్రం అన్నా.. ఇక్కడి ప్రజలన్నా .. నాకు ఎంతో అభిమానం. వారితో నాది విడదీయలేని అనుబంధమని చెప్పారు.

చంద్రబాబు

చంద్రబాబు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు భవిష్యత్తులో రెండు రాషా్ట్రలుగా ఉంటాయి తప్ప మళ్లీ విలీనమయ్యే పరిస్థితి లేదని, ఒక కుటుంబంలో పిల్లలు విడిపోయినప్పుడు ఒకరికొకరు కలిసి ఉండి పని చేసుకుంటే ఇబ్బందులు ఉండవన్నారు.

 చంద్రబాబు

చంద్రబాబు

వాళ్లలో వాళ్లు కొట్టుకొంటే ఆ కుటుంబం పూర్తిగా నష్టపోతుందని, అందుకే సమస్యలపై కూర్చుని మాట్లాడాకుందామని, మన సమస్యలను మనమే పరిష్కరించుకుందామన్నారు.

 చంద్రబాబు

చంద్రబాబు

మన వల్ల కాకపోతే పెద్ద మనుషులను పెట్టుకొని వారి చెప్పేది విందామని, రెండు రాష్ట్రాలను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందామన్నారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులకు టీడీపీ హయాంలో అధిక ప్రాధాన్యమిచ్చామన్నారు.

 చంద్రబాబు

చంద్రబాబు

అప్పటి సీఎం వైఎస్సార్‌, తెరాస నాయకులు రెండు టీఎంసీల కోసమే కదా.. ఏం నష్టం వస్తుందని వ్యాఖ్యానించారని, బాబ్లీ నష్టం ఏమిటో ఇప్పుడు తెలుస్తోందన్నారు. కృష్ణా నది నీళ్ల విషయంలోనూ మన హక్కులను పూర్తిగా కోల్పోయే పరిస్థితి వచ్చిందన్నారు.

 చంద్రబాబు

చంద్రబాబు

ఈ రోజు నేను వచ్చింది రాజకీయాల కోసం కాదని, తనను నమ్ముకున్న తన కుటుంబ సభ్యులను కాపాడుకోవాలని, మీ రుణం తీర్చుకోవాలని, అందుకే వచ్చానన్నారు. కార్యకర్తల రుణం తీర్చుకుంటానని చెప్పారు.

చంద్రబాబు

చంద్రబాబు

విభజన తర్వాత కూడా తెలంగాణకు అధిక ఆదాయం ఉందంటే ఎంతో ఆనంద పడ్డాను తప్ప ఎప్పుడూ బాధ పడలేదని, ఏపీలోనూ సమస్యలున్నాయని, రాజధానిని కట్టుకోవాల్సి ఉందన్నారు. వీలైనంత త్వరగా అక్కడికిపోతే ప్రజలకు అందుబాటులో ఉంటానని చెబితే నాపై లేనిపోని ఆరోపణలు చేశారని విమర్శించారు. విదేశాల్లో ఉన్నట్టు ఉందని అన్నానని ప్రచారం చేశారని విమర్శించారు.

చంద్రబాబు

చంద్రబాబు

తాను రెండో రోజు ఆదే పేపర్‌కు క్లారిఫై ఇచ్చానని, అనలేదని చెప్పినా నాపై చౌకబారు విమర్శలు చేస్తున్నారన్నారు. తాను పిరికివాడిని కాదని, అనుంటే అన్నానని జస్టిఫై చేసేవాడినని, కానీ నేను అనలేదన్నారు. అలా దుష్పర్చారం చేయడం ద్వారా సెంటిమెంట్‌ను రెచ్చగొట్టాలని చూస్తున్నారని విమర్శించారు.

 చంద్రబాబు

చంద్రబాబు

తెలంగాణ ప్రాంతంలో పొలాలు ఎండిపోవడానికి వీలు లేదన్నారు. అవసరమైతే కొంత కరెంట్‌ ఆదా చేసైనా సరే తెలంగాణకు ఇస్తానని ఆరోజు చెప్పాను. ఇంత వరకు స్పందన రాలేదని చంద్రబాబు తెలిపారు.

 చంద్రబాబు

చంద్రబాబు

తాను కేంద్ర విద్యుత్ మంత్రి పీయూష్ ఘోయల్‌కు కూడా తెలంగాణ విద్యుత్ సమస్యపై వివరించానన్నారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉత్తర తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలని బాబ్లీ ప్రాజెక్టు కోసం పోరాడిన సంగతి చంద్రబాబు గుర్తుచేశారు.

 చంద్రబాబు

చంద్రబాబు

తాను అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణను అభివృద్ధి చేశానని, ఎఎంఆర్, దేవాదుల కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్సారెస్పీ రెండవ దశ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశానన్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో తాగునీటికి అధిక ప్రాధాన్యత ఇచ్చానన్నారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్‌కు ఫౌండేషన్ చేసి నిధులు విడుదల చేశానని తెలిపారు.

 చంద్రబాబు

చంద్రబాబు

తెలంగాణలో నీటి ప్రాజెక్టుల కోసమే తాను ఎక్కువ నిదులు వెచ్చించినట్లు చెప్పారు. తాను అధికారంలో ఉన్నప్పుడు 9 గంటలు రైతులకు విద్యుత్ అందించడంతో పాటు 24 గంటలు గృహాలకు విద్యుత్ అందించినట్లు చెప్పారు. తెలంగాణలోని ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టులతో పాటు పోలవరం కూడా జాతీయ ప్రాజెక్టు కావాలన్నారు. తాగునీటి విషయంలో లేనిపోని అపోహాలు ఉన్నాయని, రెండు ప్రాంతాల పంటలను కాపాడుకోవడానికి శ్రీశైలం నీరు నిండితే నాగార్జునసాగర్ నుండి పులిచింతలకు వెళ్తాయనీ ఈ మూడు ప్రాంతాలలో విద్యుత్ ఉత్పత్తి అవుతుందన్నారు.

 చంద్రబాబు

చంద్రబాబు

తెలంగాణలో ప్రతిపక్షంగా ఉన్నామని, ఇక్కడి ప్రజల బాధ్యత మనపై ఉందని చెప్పారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు అధికారం ఇచ్చారని అక్కడి బాగోగులుగా చూసే బాధ్యత టిడిపిదేనన్నారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నామని, ఈ మూడు అంశాలను దృష్టిలో పెట్టుకుని రెండు రాష్ట్రాల ప్రజల అబివృద్ధే తమ విధానమన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

తనను కొందరు ఏపికి వచ్చేయండని కోరినప్పటికి తన జీవితం ఉన్నంత కాలం తనను అభిమానించిన తెలంగాణ కార్యకర్తలను, ప్రజలను వదులుకోనని బాబు స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల ప్రజలు తనకు రెండు కళ్ల లాంటి వారని మరోసారి స్పష్టం చేశారు. తాను సున్నితమైన సమయంలో తటస్థంగా ఉన్నానని, ఏ ప్రాంతానికి కూడా నష్టం కలిగించే విధంగా ప్రయత్నం చేయలేదన్నారు.

English summary
AP Chief Minister Chandrababu Naidu on Friday said in Warangal that all contentious issues like water as well as power, between Telangana and Andhra Pradesh could be resolved through dialogue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X